Honda CB200X ఫస్ట్ లుక్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & మరిన్ని వివరాలు

ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ Honda Motorcycle India (హోండా మోటార్ సైకిల్ ఇండియా) ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త CB200X బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలై ఈ కొత్త Honda CB200X బైక్ (హోండా సిబి200ఎక్స్ బైక్) ప్రారంభ ధర రూ. 1.44 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ విడుదలకు ముందే కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. కొనుగోలుదారులు రూ. 2,000 చెల్లింది ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ లలో బుక్ చేసుకోవచ్చు.

అయితే ఇటీవల మాకు Honda డీలర్‌షిప్‌లో ఈ కొత్త CB200X బైక్ తనిఖీ చేసే అవకాశం లభించింది. ఈ కొత్త అడ్వెంచర్ టూరర్‌ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

Honda CB200X బైక్ డిజైన్ అండ్ స్టైల్:

కొత్త CB200X బైక్ చూడగానే దాని CB500X బైక్ ను గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఈ కొత్త బైక్ డిజైన్ CB500X నుంచి తీసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇది Horner 2.0 ఆధారంగా రూపొందించబడింది. ఈ కొత్త బైక్ డైమండ్-టైప్ ఫ్రేమ్‌ని కలిగి ఉంటుంది. ఈ బైక్ వాహనదారునికి మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

కొత్త CB200X బైక్ ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్‌ ఉంటుంది, ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. హోండా CB200X లోని అన్ని లైట్లు కూడా LED యూనిట్లు. మోటారుసైకిల్ రైడర్‌ని విండ్‌బ్లాస్ట్ నుండి రక్షించడానికి పొడవైన విండ్‌స్క్రీన్‌ అమర్చబడి ఉంటుంది. మోటార్‌సైకిల్ అప్‌సైడ్ డౌన్(యుఎస్‌డి) ఫ్రంట్ ఫోర్క్‌లను పొందుతుంది, కావున అద్భుతమైన కుషనింగ్‌ను అందిస్తాయి. అంతే కాకుండా ఇవి గోల్డ్ షేడ్‌లో చాలా స్పోర్టివ్‌గా కనిపిస్తాయి.

ఫీచర్స్:

Honda CB200X బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది ఫుల్లీ డిజిటల్, నెగటివ్ LCD ఇన్‌స్ట్రుమెంటేషన్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా గేర్ పొజిషన్ ఇండికేటర్, డిజిటల్ క్లాక్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ మరియు బ్యాటరీ వోల్టమీటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు LCD కి స్పష్టమైన రీడౌట్‌లు ఉన్నాయి, మరింత ఎర్గోనామిక్ డిజైన్ కోసం ఇగ్నిషన్ కీహోల్ యూనిట్ ట్యాంక్‌పై ఉంచబడింది.

ఈ మోటార్‌సైకిల్ అద్భుతంగా కనిపించడానికి ఇంటిగ్రేటెడ్ LED బ్లింకర్‌లతో (Knuckle) నకిల్ గార్డ్స్ పొందుతుంది. దానితో పాటుగా, మరింత అనుకూలమైన హ్యాండిల్‌బార్‌ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే CB200X బైక్ అద్భుతంగా ఉంటుంది. దీనికోసం ఒక ఎగ్జాస్ట్‌ను కూడా కలిగి ఉంది.

ఈ బైక్ లోని బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 276 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ అమర్చబడి ఉంటుంది. అంతే కాకూండా భద్రతను మరింత మెరుగుపరచడానికి ఇందులో ఎబిఎస్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఇంజిన్ స్పెసిఫికేషన్స్:

Honda CB200X బైక్ 184 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 16.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ మంచి రైడింగ్ పొజిషన్ అందిస్తుంది. కావున లాంగ్ డ్రైవ్ లో కూడా రైడర్ కి ఎలాంటి అలసట లేకుండా చేస్తుంది.

ఈ కొత్త CB200X బైక్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో స్ప్లిట్ సీటు ఉంటుంది. మొత్తానికి ఇది మంచి రైడింగ్ అనిభావాన్ని ఇస్తుంది. మేము త్వరలో ఈ బైక్ రోడ్ టెస్ట్ రివ్యూ చేస్తాము. అప్పుడు ఈ బైక్ గురించి పూర్తహి సమాచారం అందుబాటులో ఉంటుంది. అప్పటి వరకు వేచి ఉండాలి. ఎప్పటికప్పుడు మరింత సమాచారం కోసం మా DriveSpark ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

Honda Motor Cycle India కొత్త CB200X బైక్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడం ద్వారా తన ఎంట్రీ లెవల్ అడ్వెంచర్-టూరర్‌ను తీసుకువచ్చింది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో కేవలం రూ. 1.44 లక్షలు మాత్రమే.Honda CB200X బైక్ డెలివరీ సెప్టెంబర్ రెండవ వారం నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నాము. భారతీయ మార్కెట్లో Honda CB200X బైక్, Hero Xpulse 200 మరియు Xpulse 200T వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 6, 2021, 12:00 [IST]
English summary
Honda cb200x first look review telugu design features specs price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+