Honda CB200X బైక్ ఫస్ట్ రైడ్ రివ్వూ వీడియో.. ఇప్పుడు మీ కోసం

ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ అయిన Honda Motorcycle India భారతీయ మార్కెట్లో కొత్త CB200X బైక్ ను ఇటీవల ఏసియా మార్కెట్లో బీవిడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలై కొత్త Honda CB200X బైక్ ప్రారంభ ధర రూ. 1.44 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త బైక్ బ్రాండ్ యొక్క హార్నెట్ 2.0 బైక్ ఆధారంగా రూపొందించబడింది.

Honda CB200X బైక్ పెర్ల్ నైట్‌స్టార్ బ్లాక్, మ్యాట్ సెలీన్ సిల్వర్ మరియు మెటాలిక్ స్పోర్ట్స్ రెడ్ అనే మూడు కలర్ ఆప్సన్స్ లో అన్హుబాటులో ఉంటుంది. ఈ బైక్ చూడటానికి అభూతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ బుకింగ్స్ ప్రారంభించబడ్డాయి. కస్టమర్లు ఆన్‌లైన్ లేదా అధికారిక డీలర్ షిప్ ద్వారా 2,000 రూపాయల టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

Honda CB200X బైక్ ఫస్ట్ రైడ్ రివ్వూ వీడియో

Honda CB200X బైక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఈ బైక్ కి ఎల్ఈడీ హెడ్‌లైట్లు మరియు ఇండికేటర్స్ ఉన్నాయి. అయితే ఇందులోని విండ్‌స్క్రీన్ సాధారణంగా అడ్వెంచర్ బైక్‌లలో కనిపించే దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కావున ఇది గాలి విస్ఫోటనం నుంచి కాపాడుతుంది.

ఈ బైక్ లో సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ సీటు విడిగా ఉంచబడింది. వెనుక ఉన్నవారికి కూడా తగినంత సౌకర్యాన్ని అందించడానికి ఇందులో గ్రాబ్ రైల్ ఇవ్వబడింది. మొత్తానికి ఈ బైక్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటీవల మా బృందం ఈ కొత్త Honda CB200X బైక్ రైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈ కింది వీడియోలో చూడవచ్చు.

కొత్త Honda CB200X బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో కంపెనీ యొక్క హార్నెట్ 2.0 ఇంజిన్ ఉపయోగించబడింది. ఇందులో ఉన్న 184.4 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 16.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో అప్సైడ్ డౌన్ పోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ఉంటుంది. ఈ బైక్ లోని బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 276 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ అమర్చబడి ఉంటుంది. అంతే కాకూండా భద్రతను మరింత మెరుగుపరచడానికి ఇందులో ఎబిఎస్ కూడా అందుబాటులో ఉంటుంది.

Honda Motor Cycle కంపెనీ తన ఎంట్రీ లెవల్ అడ్వెంచర్-టూరర్, CB200X ని ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో తీసుకువచ్చింది. ఇది మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా తక్కువ ధరకు కూడా లభ్యమవుతోంది. అయితే దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలతో ముందుకు సాగుతుందో వేచి చూడాలి. హోండా CB200X భారతీయ మార్కెట్లో హీరో Xpulse 200 మరియు Xpulse 200T వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Honda cb200x review video first riding impressions
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X