కొత్త హోండా CB300R బైక్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

'2021 ఇండియా బైక్ వీక్' ప్రారంభమైన మొదటి రోజే హోండా కంపెనీ యొక్క కొత్త హోండా CB300R బిఎస్ 6 ఆవిష్కరించబడింది. ఈ కొత్త బైక్ ఇప్పుడు అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ మరియు అప్డేటెడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ 2022 జనవరి 22 న ప్రారంభమవుతాయి. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త హోండా CB300R బైక్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

హోండా మోటార్ సైకిల్ ఆవిష్కరించిన ఈ కొత్త బైక్ కొత్త BS6 ఇంజన్ తో అప్డేట్ చేయబడింది. ఇది ఈ బైక్ లో అతి పెద్ద అప్డేట్ అని చెప్పవచ్చు. కొత్త హోండా CB300R బైక్ 286 సిసి సింగిల్ సిలిండర్ బిఎస్ 6 ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 30.4 బిహెచ్‌పి పవర్ మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 27.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జాతః చేయబడి ఉంటుంది. ఈ బైక్ స్టాండర్డ్‌గా స్లిప్పర్ క్లచ్‌తో డ్యూయల్ ఛానెల్ ABS ఫీచర్‌ను కూడా పొందుతుంది.

కొత్త హోండా CB300R బైక్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్‌లోని డిస్క్ బ్రేక్‌లను ఈ బైక్‌లో ఉపయోగించారు.

కంపెనీ ఈ బైక్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అప్‌డేట్ చేయలేదు. ఇది మునుపటి వలె అదే LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. అయితే ఈ కొత్త బైక్ లో బ్లూటూత్ ఫీచర్ లేదు. భారతీయ మార్కెట్లో కొత్త హోండా సిబి300ఆర్ బైక్, కెటిఎమ్ 390 డ్యూక్, బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ మరియు బజాజ్ డామినార్ 400 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

కొత్త హోండా CB300R బైక్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

హోండా CB300R బైక్ భారతదేశంలో 2019 ఫిబ్రవరి మరియు 2020 ఏప్రిల్ మధ్య విక్రయించబడింది. అయితే బిఎస్ 6 ప్రమాణాలు అమలులోకి వచ్చిన తరువాత ఇది నిలిపివేయబడింది. అయితే ఇప్పుడు భారతదేశంలో CKD గా తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఇప్పుడు వెల్లడించింది.

కొత్త హోండా CB300R బైక్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

హోండా కంపెనీ ఈ కొత్త హోండా CB300R బిఎస్ 6 బైకు యొక్క ధరకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు, అయితే ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా భారతదేశానికి దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. కావున ధర అధికంగా ఉంటుందని భావిస్తున్నాము.

కొత్త హోండా CB300R బైక్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా కంపెనీ '2021 ఇండియా బైక్ వీక్'లోనే కొత్త 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' విడుదల చేసింది. ఈ కొత్త యానివర్సరీ ఎడిషన్ ధర రూ. రూ. 2.03 లక్షలు (ఎక్స్-షోరూమ్). హోండా హైనెస్ CB350 బైక్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కారణంగా కంపెనీ ఈ యానివర్సరీ ఎడిషన్ విడుదల చేసింది.

కొత్త హోండా CB300R బైక్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

హోండా హైనెస్ CB350 బైక్ భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటికి 35,000 యూనిట్లను విక్రయించింది. అయితే కంపెనీ ఇప్పుడు విడుదల చేసిన ఈ కొత్త యానివర్సరీ ఎడిషన్ బుకింగ్స్ ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు ఈ బైక్ కోసం హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు.

కొత్త హోండా CB300R బైక్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కొత్త హోండా హైనెస్ CB 350 యానివర్సరీ ఎడిషన్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఇగ్నియస్ బ్లాక్ మరియు మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్ కలర్స్. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ మరియు సైడ్ ప్యానెల్‌లపై గోల్డ్ కలర్ లో హోండా మరియు హైనెస్ అనే చిహ్నాలు చూడవచ్చు. ఇవి బైక్ కి మంచి దూకుడు రూపాన్ని అందిస్తాయి.

కొత్త హోండా CB300R బైక్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఈ బైక్ బ్రౌన్ స్ప్లిట్ సీటు, క్రోమ్ సైడ్ స్టాండ్ మరియు ఫ్యూయెల్ ట్యాంక్‌పై యానివర్సరీ ఎడిషన్ లోగోను పొందుతుంది. అయితే ఈ కొత్త బైక్ లో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయలేదు. దీనిని గమనించాలి. మొత్తానికి ఇది ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త హోండా CB300R బైక్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

సాధారణంగా కంపెనీ యొక్క హోండా హైనెస్ సిబి350 బైక్ రూ. 1,92,411 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ DLX మరియు DLX ప్రో అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. హోండా హైనెస్ అనేక కొత్త మరియు ఆకర్షణీయమైన లక్షణాలతో కంపెనీ ప్రారంభించింది, దీని కారణంగా ఇది 350 సిసి శ్రేణిలోని ఇతర బైకుల నుండి చాలా భిన్నంగా అప్డేట్ చేయబడింది.

కొత్త హోండా CB300R బైక్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

హోండా హైనెస్ సిబి350 బైక్ యొక్క స్టాండర్డ్ వేరియంట్లలో డ్యూయల్ టోన్ బాడీ పెయింట్, డ్యూయల్ క్రోమ్ ఫినిష్ హార్న్, స్ప్లిట్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, క్రోమ్ ఫినిష్ ఫ్రంట్ అండ్ రియర్ మడ్‌గార్డ్స్, క్రోమ్ ఫినిష్ సైలెన్సర్ ఉన్నాయి.

ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ అందుబాటులో ఉంది, దీని సహాయంతో బైక్‌ను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. బైక్‌లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. మ్యూజిక్ ప్లేబ్యాక్, ఇన్‌కమింగ్ కాల్స్, మెసేజ్‌లు మరియు నావిగేషన్ వంటి ఫీచర్‌లను ఈ ఫీచర్‌తో పొందవచ్చు. ఇది ఫీచర్స్ పరంగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ ఫీచర్స్ అన్ని కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కొత్త హోండా CB300R బైక్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

హోండా హైనెస్ సిబి350 బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఫ్రంట్ వీల్‌లో హబ్‌కు బదులుగా రిమ్‌పై డిస్క్ బ్రేక్ అమర్చబడి ఉంటుంది. హోండా హైనెస్ సిబి 350 లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ 20.8 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది. ఇది మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది, అంతే కాకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి కూడా ఈ బైక్ చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Honda cb300r bs 6 unveiled features updates details
Story first published: Saturday, December 4, 2021, 21:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X