త్వరలో రానున్న హోండా సిబి300ఆర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్

జపనీస్ టూవీల్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్, ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో మరో కొత్త ఎంట్రీ లెవల్ మోడల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ బిఎస్6 యుగంలో కంపెనీ ఇప్పటికే హైనెస్ సిబి350 మరియు సిబి350ఆర్ఎస్ అనే రెండు ప్రీమయం మోటార్‌సైకిళ్లను విడుదల చేసిన సంగతి తెలిసినదే.

త్వరలో రానున్న హోండా సిబి300ఆర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్

కాగా, ఇప్పుడు ఈ కంపెనీ కొత్తగా హోండా సిబి300ఆర్ అనే ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా రష్‌లేన్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం, కంపెనీ ఏప్రిల్ 2021లో సిబి300ఆర్ యొక్క 8 యూనిట్లను భారతదేశానికి రవాణా చేసినట్లు సమాచారం.

త్వరలో రానున్న హోండా సిబి300ఆర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్

భారత రోడ్లపై ఈ బైక్‌ను టెస్టింగ్ చేయటానికే కంపెనీ వీటిని దిగుమతి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ హోండా తమ సిబి300ఆఱ్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో ప్రారంభించాలని నిర్ణయించుకుంటే, అది బ్రాండ్ యొక్క ప్రీమియం బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారానే విక్రయించబడనుంది.

MOST READ:కస్టమైజ్ ఫోర్డ్ పిక్-అప్ ట్రక్కు డ్రైవ్ చేస్తూ కనిపించిన 'సద్గురు జగ్గీ వాసుదేవ్' [వీడియో]

త్వరలో రానున్న హోండా సిబి300ఆర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్

హోండా యొక్క బిఎస్4 వెర్షన్‌లో ఉపయోగించిన అదే ఇంజన్‌ను కంపెనీ బిఎస్6 కాలుష్య నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఇందులో ఉపయోగించనుంది. ఈ అప్‌గ్రేడెడ్ ఇంజన్ యొక్క పవర్ మరియు టార్క్ గణాంకాల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

త్వరలో రానున్న హోండా సిబి300ఆర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్

బిఎస్ 4 మోటార్‌సైకిల్‌లో 286సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 31.4 బిహెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

త్వరలో రానున్న హోండా సిబి300ఆర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్

ఈ కొత్త బిఎస్6 మోడల్‌లో ఆశించదగిన అప్‌గ్రేడ్స్‌లో ఒకి స్లిప్-అసిస్ట్ క్లచ్. కొత్త 2021 హోండా సిబి300ఆర్‌లో ఈ ఫీచర్ రావచ్చని భావిస్తున్నారు. అలాగే, ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, హోండా యొక్క రోడ్‌సింక్ వాయిస్ అసిస్టెంట్ మరియు కనెక్ట్ చేయబడిన టెక్నాలజీలు కూడా ఇందులో ఉంటాయని సమాచారం.

త్వరలో రానున్న హోండా సిబి300ఆర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్

ఇకపోతే, బిఎస్4 మోడల్‌కి మరియు బిఎస్6 మోడల్‌కి మధ్య మెకానిల్‌గా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. హోండా సిబి300ఆర్ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో ఐకానిక్ క్లాసిక్ రౌండ్ షేప్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. కాకపోతే, ఇది ఎల్ఈడి సాంకేతిక పరిజ్ఞానంతో రానుంది మరియు హెడ్‌ల్యాంప్ మధ్యలోనే డేటైమ్ రన్నింగ్ లైట్ కూడా ఉంటుంది.

MOST READ:లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

త్వరలో రానున్న హోండా సిబి300ఆర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్

ఈ మోటారుసైకిల్ అప్-రైట్ రైడర్ ఎర్గోనామిక్స్‌తో చాలా సరళమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యుఎస్‌డి ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మరియు పెద్ద ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

త్వరలో రానున్న హోండా సిబి300ఆర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్

హోండా సిబి300ఆర్ భారత మార్కెట్లో మొట్టమొదటి నియో-రెట్రో స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిళ్ళలో ఒకటిగా ఉంటుంది. హోండా దీనిని కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (సికెడి) యూనిటర్ రూపంలో విదేశాల నుండి విడిభాగాలుగా దిగుమతి చేసుకొని, భారత మార్కెట్లోనే అసెంబుల్ చేసే అవకాశం ఉంది.

MOST READ:ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

త్వరలో రానున్న హోండా సిబి300ఆర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్

ఇలా చేయటం వలన మార్కెట్లోని పోటీదారులతో పోల్చుకుంటే, కంపెనీ ఈ మోడల్ ధరను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ 300సీసీ మోటారుసైకిల్ ధర సుమారు రూ.2.41 లక్షలు, (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంటుందని అంచనా.

త్వరలో రానున్న హోండా సిబి300ఆర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్

హోండా సిబి300ఆర్ భారత మార్కెట్లో విడుదలైతే, ఇది హోండా ప్రీమియం బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా లభ్యమయ్యే అత్యంత చౌకైన మోటార్‌సైకిల్‌గా మారే అవకాశం ఉంది. హోండా సిబి300ఆర్ ఈ విభాగంలో మహీంద్రా మోజో 300, బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్, టివిఎస్ 310ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Honda CB300R BS6 India Launch Expected Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X