విడుదలకు సిద్దమవుతున్న హోండా సిబి500 ఎక్స్ బైక్ : పూర్తి వివరాలు

భారత మార్కెట్లో ప్రముఖ బైక్ & స్కూటర్ తయారీదారు హోండా మోటార్ సైకిల్ ఇండియా ఇటీవల తన కొత్త హోండా సిబి 350 ఆర్ఎస్ బైక్ ను విడుదల చేసిన విషయం అందిరికి తెలిసిందే. ఇప్పుడు ఈ కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను దేశీయ, మార్కెట్లో మరింత బలోపేతం చేయడానికి కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే, కంపెనీ ఇప్పుడు కొత్త బైక్ ను విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

విడుదలకు సిద్దమవుతున్న హోండా సిబి500 ఎక్స్ బైక్ : పూర్తి వివరాలు

హోండా మోటార్ సైకిల్ ఇండియా యొక్క లేటెస్ట్ సమాచారం ప్రకారం భారత మార్కెట్లో మరో కొత్త బైక్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అంతే కాదు ఇది ఒక అడ్వెంచర్ బైక్ కూడా. హోండా విడుదల చేయనున్న ఆ కొత్త బైక్ పేరే సిబి 500 ఎక్స్ అడ్వెంచర్ టూరర్‌.

విడుదలకు సిద్దమవుతున్న హోండా సిబి500 ఎక్స్ బైక్ : పూర్తి వివరాలు

కంపెనీ అందించిన సమాచార ప్రకారం,హోండా సిబి 500 ఎక్స్ అడ్వెంచర్ యొక్క లాంచ్ టైమ్ లైన్ వెల్లడైంది. దీని ప్రకారం హోండా సిబి 500 ఎక్స్ అడ్వెంచర్ బైక్ 2021 ఏప్రిల్ నాటికి మార్కెట్లో విడుదల కానుంది.

MOST READ:తండ్రికి నచ్చినదానిని సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. ఆ గిఫ్ట్ ఏంటో చూసారా..!

విడుదలకు సిద్దమవుతున్న హోండా సిబి500 ఎక్స్ బైక్ : పూర్తి వివరాలు

హోండా సిబి 500 ఎక్స్ అడ్వెంచర్ బైక్‌లో 500 సిసి సమాంతర ట్విన్ ఇంజిన్‌ను ఇన్‌స్టాల్ చేయబోతోంది. ఈ ఇంజన్ 47 బిహెచ్‌పి శక్తిని, 43 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతే కాదు ఇది మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కూడా కల్గి ఉంటుంది.

విడుదలకు సిద్దమవుతున్న హోండా సిబి500 ఎక్స్ బైక్ : పూర్తి వివరాలు

ఈ కొత్త బైక్ యొక్క డిజై విషయానికి వస్తే, ఇందులో పుల్ ఎల్ఈడి లైటింగ్, డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ మరియు పుల్ డిజిటల్ ఎల్సిడి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ లో డ్యూయల్ ట్రిప్‌మీటర్, ఫ్యూయెల్ స్టేటస్ మరియు గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటివి ఉన్నాయి.

MOST READ:కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము.. చివరికి ఎం జరిగిందంటే ?

విడుదలకు సిద్దమవుతున్న హోండా సిబి500 ఎక్స్ బైక్ : పూర్తి వివరాలు

కంపెనీ ఈ బైక్ ధర యొక్క ధరను ఇంకా వెల్లడించలేదు, అయితే ఈ బైక్ లాంచ్ అయ్యే సమయంలో అధికారికంగా వెల్లడవుతుంది. హోండా మోటార్‌సైకిల్ ఇండియా ఈ బైక్‌ను రూ. 6 లక్షల ఎక్స్‌-షోరూమ్‌తో విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంపెనీ బిగ్‌వింగ్ డీలర్‌షిప్ ద్వారా హోండా సిబి 500 ఎక్స్ అడ్వెంచర్ విక్రయించబడే అవకాశం ఉంది.

విడుదలకు సిద్దమవుతున్న హోండా సిబి500 ఎక్స్ బైక్ : పూర్తి వివరాలు

హోండా తన బిగ్‌వింగ్ ప్లాట్‌ఫామ్ కోసం ఇటీవల హోండా సిబి 350 ఆర్‌ఎస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర భారత మార్కెట్లో ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ. 1.96 లక్షలు. ఈ బైక్ రెండు వేరియంట్లలో మార్కెట్లో అమ్మబడుతుంది.

MOST READ:భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య

విడుదలకు సిద్దమవుతున్న హోండా సిబి500 ఎక్స్ బైక్ : పూర్తి వివరాలు

హోండా సిబి 350 ఆర్‌ఎస్ బైక్ 350 సిసి, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 20.78 బిహెచ్‌పి శక్తిని మరియు 3,000 ఆర్‌పిఎమ్ వద్ద 30 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.దీనికి పిజిఎం-ఎఫ్‌ఐ సిస్టమ్, ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది కూడా చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

Most Read Articles

English summary
Honda CB500X India Launch Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X