దుమ్మురేపుతున్న హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ వీడియో

ప్రముఖ ద్విచక్ర వాహనతయారీదారు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ కంపెనీ తన హోండా సిబి 500 ఎక్స్ బైక్ ను మొట్టమొదటిసారిగా 2013 లో దేశీయ మార్కెట్లో ప్రారంభించింది. కంపెనీ ఈ బైక్ ను ప్రారంభించిన వెంటనే దాని డిజైన్ మరియు ప్రాక్టికాలిటీ వంటి వాటితో వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత కంపెనీ ఈ బైక్ ని 2016 లో ఒకసారి అప్‌డేట్ చేసింది, తిరిగి 2019 లో కూడా ఈ బైక్ మరోసారి అప్డేట్ చేయబడింది. కొన్ని సంవత్సరాల పాటు భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని ఎదురుచూస్తున్న కొత్త హోండా సిబి 500 ఎక్స్ చివరకు భారత మార్కెట్లో అడుగుపెట్టింది.

ఇటీవల ఈ కొత్త హోండా సిబి 500 ఎక్స్ బైక్ రైడ్ చేసే అవకాశం మాకు లభించింది. ఇది నగరంలో మరియు హైవేపై మంచి పర్ఫామెన్స్ చూపించింది. అయితే ఇప్పుడు ఈ బైక్ యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ వంటి విషయాలను గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూడండి.

హోండా సిబి 500 ఎక్స్ లేయర్డ్ డిజైన్‌తో బాడీవర్క్ కలిగి ఉంది. ఇది చూడటానికి ఆఫ్రికా ట్విన్ బైక్ లాగా కనిపిస్తుంది. ఇందులో ఫ్లోయింగ్ ప్యానెల్స్‌తో పాటు షార్ప్ డిజైన్ లైన్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఆప్ ఫ్రంట్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, దాని పైనే పొడవైన అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్ ఉంది.

హోండా సిబి 500 ఎక్స్ బైక్ లిక్విడ్-కూల్డ్, 471 సిసి ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 46.93 బిహెచ్‌పి మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 43.2 ఎన్ఎమ్‌ టార్క్ విడుదల చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ తో వెనుక చక్రంను స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ ద్వారా నడుస్తుంది.

హోండా సిబి 500 ఎక్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది రూ. 6.87 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందించబడుతుంది. భారత మార్కెట్లో హోండా సిబి 500 ఎక్స్ బైక్ సుజుకి వి-స్ట్రోమ్ 650 మరియు బెనెల్లి టిఆర్‌కె 502 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ వీడియో.. అదుర్స్
Most Read Articles

English summary
Honda CB500X Review Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X