ఈ డ్యూయెల్ పర్పస్ బైక్ ఇండియాకు వస్తోంది; పేటెంట్ ఫైల్ చేసిన హోండా!
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్, భారత మార్కెట్‌లో మరో కొత్త మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కంపెనీ హోండా సిఆర్ఎఫ్300ఎల్ కోసం పేటెంట్ కూడా దాఖలు చేసింది.

హోండా సిఆర్ఎఫ్300ఎల్ అనేది డ్యూయల్ పర్పస్ డర్ట్ బైక్, ఇది ప్రస్తుతం వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడుతోంది. భారత మార్కెట్లో ఈ మోటార్‌సైకిల్ కోసం పేటెంట్ దాఖలు కావడాన్ని చూస్తుంటే, త్వరలోనే ఇది దేశీయ విపణిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ప్రియుల కోసం హోండా ప్రస్తుతం భారతదేశంలో రెండు మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. వీటిలో హోండా సిబి500ఎక్స్ మరియు మరింత శక్తివంతమైన హోండా ఆఫ్రికా ట్విన్ బైక్స్ ఉన్నాయి. అయితే, ఈ రెండు మోటార్‌సైకిళ్లు కూడా అత్యధిక ధరను కలిగి ఉండి, ప్రీమియం సెగ్మెంట్లో ఉంచబడ్డాయి.

హోండా నుండి ప్రస్తుతం సరసమైన ఆఫ్-రోడ్ టూవీలర్ క్యాటగిరీలో ఎలాంటి బైక్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో, కెటిఎమ్, హస్క్వార్నా వంటి సంస్థలకు పోటీగా హోండా భారతదేశంలో సిఆర్ఎఫ్300ఎల్ అడ్వెంచర్ బైక్‌ను ప్రారంభించాలని చూస్తోంది.

హోండా సిఆర్ఎఫ్300ఎల్ మోటార్‌సైకిల్‌ను సాధ్యమైనంత తేలికగా ఉంచడం కోసం కంపెనీ దీనిని బేర్-బోన్ బాడీపై నిర్మించింది. ఇది డర్ట్ బైక్ కావడంతో ఇందులో సాధారణ హెడ్‌ల్యాంప్ కౌల్, సింగిల్-పీస్ సీట్, సింగిల్-పీస్ హ్యాండిల్ బార్, బాగా ఎత్తులో ఉంచిన ఫ్రంట్ ఫెండర్ మరియు సీట్ క్రింది భాగంలో ఎత్తులో అమర్చిన సైలెన్సర్ ఉంటాయి.

హోండా సిఆర్ఎఫ్250ఎల్ బైక్‌కి వారసుడిగా వచ్చిన ఈ కొత్త హోండా సిఆర్ఎఫ్300ఎల్ పెద్ద సామర్థ్యం గల ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇందులోని 286సిసి డిఓహెచ్‌సి, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ యూరో 5 / బిఎస్ 6 ప్రమాణాలకు అనువుగా ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 26 బిహెచ్‌పి శక్తిని మరియు 26.6 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా జతచేయబడి ఉంటుంది.

ఆఫ్-రోడ్ బయాస్డ్ సెటప్ కారణంగా, ఈ మోటార్‌సైకిల్ 285 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 880 మిమీ రైడర్ సీట్ ఎత్తును కలిగి ఉంటుంది. హోండా సిఆర్ఎఫ్300ఎల్ సన్నటి 7.8-లీటర్ ఫ్యూయెల్ ట్యాంట్ ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ మొత్తం బరువు 140 కిలోలుగా ఉంటుంది.

ఇక ఈ మోటార్‌సైకిల్‌లోని మెకానికల్స్‌ను గమనిస్తే, దీని ముందు భాగంలో 234 మిమీ ట్రావెల్‌తో కూడిన 43 మిమీ యుఎస్‌డి (అప్ సైడ్ డౌన్) ఫోర్కులు మరియు వెనుక భాగంలో 260 మిమీ ట్రావెల్‌తో కూడిన మోనో-షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటాయి. ఈ రెండు సస్పెన్షన్ యూనిట్లను సర్దుబాటు చేసే వీలు ఉండదు.

హోండా సిఆర్ఎఫ్300ఎల్ డర్ట్ బైక్‌లో బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 256 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇవి రెండూ కూడా డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇందులో ముందు వైపు 21 ఇంచ్ స్పోక్ వీల్ మరియు 100/80 సెక్షన్ టైర్, అలాగే వెనుక వైపు 18 ఇంచ్ స్పోక్ వీల్ మరియు 120/80 సెక్షన్ టైర్ ఉంటాయి.

హోండా సిఆర్ఎఫ్300ఎల్‌ను ప్రత్యేకించి ఆఫ్-రోడ్ ప్రయోజనం కోసం తయారు చేసినట్లుగా ఉంటుంది. అయినప్పటికీ, దీనిని ఆన్-రోడ్‌పై కూడా ఉపయోగించవచ్చు. అయితే, ఈ మోటార్‌సైకిల్ యొక్క ఆన్-రోడ్ ఉపయోగం కోసం ఇది చాలా తక్కువ ఫీచర్లను లేదా అనుకూలతను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








