'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

భారతదేశపు ద్వితీయ అగ్రగామి టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ), దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన లీజర్ మోటార్‌సైకిల్ 'గోల్డ్ వింగ్'లో బిఎస్6 మోడల్‌ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ ఈ మేరకు ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

ప్రస్తుతం హోండా ప్రీమియం మోటార్‌సైకిళ్లను విక్రయిస్తున్న బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా కంపెనీ ఈ సరికొత్త బిఎస్6 'హోండా గోల్డ్ వింగ్' మోటార్‌సైకిల్‌ను విక్రయించనుంది. హోండా తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన టీజర్‌లో "గోల్డ్ ఫర్ గ్యారేజ్ వింగ్స్ ఫర్ రోడ్, కమింగ్ సూన్" అంటూ టీజ్ చేసింది.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

టీజర్‌లో పేర్కొన్నట్లుగానే ఈ మోటార్‌సైకిల్‌లో గ్యారేజ్‌లో బంగారంలా ఉంటుంది. గతంలో కంపెనీ తమ బిఎస్4 వెర్షన్ హోండా గోల్డ్ వింగ్ మోటార్‌సైకిల్‌ను రూ.28.2 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విక్రయించేంది. అయితే, కొత్తగా వస్తున్న ఈ బిఎస్6 మోడల్ మునుపటి కన్నా ఎక్కువ ధరను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

భారత మార్కెట్లో హోండా గోల్డ్ వింగ్ ఇంతటి అధిక ధరను కలిగి ఉండటానికి ప్రధాన కారణంగా, కంపెనీ ఈ మోడల్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గంలో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తుండటమే. ప్రస్తుతం, దేశంలోని అధిక దిగుమతి సుంఖాల కారణంగా, ఈ మోటార్‌సైకిల్ భారత తీరాలకు చేరుకునేసరికి దాని ధర కూడా రెట్టింపు అవుతోంది.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

ఈ 2021 మోడల్ ఇయర్ హోండా గోల్డ్ వింగ్‌ను కూడా సిబియు రూట్‌లోనే ఇండియాకు దిగుమతి చేసుకోనున్నారు. మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త మోడల్‌లో సరికొత్త బిల్ట్-ఇన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది స్టాండర్డ్ మరియు టూర్ అనే రెండు వేరియంట్లలో విడుదల కానుంది.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

వీటిలో స్టాండర్డ్ వేరియంట్‌లో కొత్త డీప్ పెరల్ గ్రే కలర్ స్కీమ్‌ను కంపెనీ పరిచయం చేసింది. కాగా, టూర్ వేరియంట్ మాత్రం గన్‌మెటల్ బ్లాక్ మెటాలిక్ మరియు కాండీ ఆర్డెంట్ రెడ్ (డిసిటి మాత్రమే) కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మరికొన్ని వారాల్లోనే కొత్త 2021 హోండా గోల్డ్ వింగ్ బిఎస్6 మోటార్‌సైకిల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

కొత్త 2021 హోండా గోల్డ్ వింగ్ మోటార్‌సైకిల్‌లో చేసిన అప్‌గ్రేడ్స్ చాలా తక్కువే అని చెప్పాలి. మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త మోడల్‌లో చెప్పుకోదగిన మార్పులు ఏవీ లేవు. ఈ కొత్త మోడల్‌లో ఇప్పుడు మరియు మెరుగైన ఆడియో క్వాలిటీతో కూడిన 45-వాట్ స్పీకర్ సిస్టమ్‌ను జోడించారు.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

అలాగే, ఇందులోని టూర్ వేరియంట్‌లోని టాప్-బాక్స్ ఇప్పుడు అదనంగా 11-లీటర్ల స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. బెటర్ కంఫర్ట్ కోసం టూర్ వేరియంట్లో మందపాటి ఫోమ్‌తో కూడిన పిలియన్ సీటును రీడిజైన్ చేశారు. హోండా గోల్డ్ వింగ్ టూర్‌లో కొత్తగా కుట్టబడిన సీట్ కవర్‌ ఉంటుంది.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

హోండా గోల్డ్ వింగ్ ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యంత ప్రసిద్ధి లీజర్ మోటార్‌సైకిళ్లలో ఒకటి. డ్యూయల్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లతో ఇది ముందు వైపు నుండి చాలా విశిష్టమైన లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్ హెడ్‌లైట్‌ క్లస్టర్‌లోనే డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా అమర్చబడి ఉంటాయి. రియర్ వ్యూ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్లు ఉంటాయి.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

హై-స్పీడ్‌తో ప్రయాణించేటప్పుడు రైడర్‌ను గాలి నుండి రక్షించడానికి పెద్ద వైజర్ (విండ్‌స్క్రీన్), డిజిటల్ మరియు అనలాగ్ కాంబినేషన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద 7 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్ఫోటైన్‌మెంట్ మరియు అందులోని వివిధ ఫీచర్లను కంట్రోల్ చేయటానికి గుండ్రటి నాబ్, హ్యుండిల్ బార్‌కి ఇరువైపులా మల్టీ ఫంక్షనల్ స్విచ్ గేర్ మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

ఈ మోటార్‌సైకిల్ సైడ్ డిజైన్‌ను గమనిస్తే, ఇది మోటారుసైకిల్ పొడవునా ఉండే పెద్ద ఎగ్జాస్ట్‌లతో లాంగ్-వీల్‌బేస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌కి ఇరువైపులా పన్నీర్స్ మరియు టూర్ వేరియంట్లో వెనుక పిలయన్ రైడర్ కోసం కుర్చీ లాంటి ఆకారపు బ్యాక్‌రెస్ట్ ఉంటాయి. వెనుక భాగంలో ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. టూర్ వేరియంట్లో మొత్తం 61 లీటర్ల స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

హోండా గోల్డ్ వింగ్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లోని 7.0 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బైక్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లో మీడియా స్క్రీన్ ఇరువైపులా రెండు పెద్ద అనలాగ్ డయల్స్ మరియు మరో మూడు చిన్న ఎల్‌సిడి స్క్రీన్‌లు ఉంటాయి. వీటి ద్వారా రైడర్ వివిధ రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

ఇక ఈ బైక్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో ట్యాంక్‌కు అమర్చబడిన ఎయిర్ బ్యాగ్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (హెచ్‌ఎస్‌టిసి) సిస్టమ్, రివర్స్ గేర్, స్మార్ట్ కీ మరియు హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

ఇంజన్ విషయానికి వస్తే, హోండా గోల్డ్ వింగ్ శక్తివంతమైన ఫ్లాట్-సిక్స్ లిక్విడ్-కూల్డ్ 1833సిసి ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 124.7 బిహెచ్‌పి శక్తిని మరియు 4500 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా ఏడు-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

హోండా గోల్డ్ వింగ్ మెకానికల్స్‌ను గమనిస్తే, ఈ బైక్ ముందు భాగంలో డబుల్-విష్బోన్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ ప్రోలింక్ సస్పెన్షన్‌లు ఉంటాయి. టూర్ వేరియంట్‌లో మాత్రం ప్రత్యేకంగా ప్రీ-లోడెడ్ ఎలక్ట్రకల్లీ అడ్జస్టబల్ రియర్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది.

'కమింగ్ సూన్'.. హోండా గోల్డ్ వింగ్ బిఎస్6.. ఇది మోటార్‌సైకిళ్లకే కింగ్..

ఈ మోటారుసైకిల్ ముందు భాగంలో 6-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌లతో కూడిన డ్యూయల్ 320 మిమీ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో 3-పాట్ కాలిపర్‌తో కూడిన సింగిల్ 316 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. స్టాండర్డ్ మరియు టూర్ వేరియంట్‌లు వరుసగా 366 కిలోలు మరియు 385 కిలోల బరువును కలిగి ఉంటాయి కాబట్టి, ఈ మోటారుసైకిల్ హెవీ-డ్యూటీ బ్రేకింగ్‌ను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Honda Gold Wing BS6 Teaser Out, India Launch Expected Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X