పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా గత ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసిన తమ బిఎస్6 గ్రాజియా 125 స్కూటర్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దీని ధరలు రూ.903 నుండి రూ.1,162 మేర పెరిగాయి.

పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?

హోండా గ్రాజియా 125 బిఎస్6 స్కూటర్‌ను స్టాండర్డ్ మరియు డీలక్స్ అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. కాగా, గ్రాజియా 125 బిఎస్6 డ్రమ్ వేరియంట్ ధర రూ.903 మేర పెరిగి రూ.74,815 కి చేరుకుంది. ఇందులో డిస్క్ వేరియంట్ ధర రూ.1,162 మేర పెరిగి రూ.82,140 చేరుకుంది. (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?

ధరల పెరుగుదల మినహా, హోండా గ్రాజియా 125 బిఎస్6 స్కూటర్‌లో వేరే ఏ ఇతర మార్పులు చేయలేదు. ఈ స్కూటర్ మ్యాట్ సైబర్ ఎల్లో, పెరల్ సైరన్ బ్లూ, మ్యాట్ యాక్సిస్ గ్రే మరియు పెరల్ స్పార్టన్ రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Grazia 125 Old Price New Price Price Hike
Drum ₹73,912 ₹74,815 ₹903
Disc ₹80,978 ₹82,140 ₹1,162

MOST READ:కొత్త ఆడి ఎ4 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. పూర్తి వివరాలు

పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?

హోండా గ్రాజియా 125 బిఎస్6 స్కూటర్‌లో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసిజి స్టార్టర్ మోటర్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఎల్‌ఇడి టెయిల్ లైట్లు, స్ప్లిట్ గ్రాబ్ రైల్, సైడ్ ప్యానెల్స్‌పై 3డి లోగో మరియు బ్లాక్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?

కొత్త హోండా గ్రాజియా 125 బిఎస్6 స్కూటర్‌లోని ఇతర ఫీచర్లలో పాస్-స్విచ్, కొత్త ఇంజన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, సీటు కోసం మల్టీ-ఫంక్షనల్ స్విచ్ మరియు ఇంధన-మూత మొదలైనవి ఉన్నాయి.

MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?

ఇంజన్ విషయానికి వస్తే, హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్‌లో 124సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వి-టైప్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?

గ్రాజియా స్కూటర్ ముందు భాగంలో 12 ఇంచ్ మరియు వెనుక భాగంలో 10 ఇంచ్ వీల్స్ ఉంటాయి. అలాగే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు త్రీ-వే అడ్జస్టబల్ స్ప్రింగ్-లోడెడ్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇరువైపులా డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.

MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?

హోండా గ్రాజియా 125సీసీ స్కూటర్ ప్రీమియం స్కూటర్ విభాగంలో అందుబాటులో ఉంటుంది. ఇది ఈ విభాగంలో యమహా ఫాసినో 125, టివిఎస్ ఎన్‌టార్క్ 125 మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Honda Grazia 125 Scooter Price Increased, New Price List. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X