Just In
- 8 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 18 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 20 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
కేసీఆర్ సర్కార్‌కు షర్మిల పార్టీ నేతల ఫస్ట్ అల్టిమేటం: రోడ్డెక్కి..నిరసనలు
- Sports
అక్కడ గెలిస్తేనే టీమిండియా అత్యుత్తమ జట్టు: మైకేల్ వాన్
- Movies
చిలికి చిలికి గాలివానలా.. సారంగ దరియాపై సుద్దాల అలా.. కోమలి ఇలా!
- Finance
బ్యాంకుల హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: వారికి ఇలా ప్రయోజనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా గత ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసిన తమ బిఎస్6 గ్రాజియా 125 స్కూటర్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దీని ధరలు రూ.903 నుండి రూ.1,162 మేర పెరిగాయి.

హోండా గ్రాజియా 125 బిఎస్6 స్కూటర్‌ను స్టాండర్డ్ మరియు డీలక్స్ అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. కాగా, గ్రాజియా 125 బిఎస్6 డ్రమ్ వేరియంట్ ధర రూ.903 మేర పెరిగి రూ.74,815 కి చేరుకుంది. ఇందులో డిస్క్ వేరియంట్ ధర రూ.1,162 మేర పెరిగి రూ.82,140 చేరుకుంది. (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

ధరల పెరుగుదల మినహా, హోండా గ్రాజియా 125 బిఎస్6 స్కూటర్లో వేరే ఏ ఇతర మార్పులు చేయలేదు. ఈ స్కూటర్ మ్యాట్ సైబర్ ఎల్లో, పెరల్ సైరన్ బ్లూ, మ్యాట్ యాక్సిస్ గ్రే మరియు పెరల్ స్పార్టన్ రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Grazia 125 | Old Price | New Price | Price Hike |
Drum | ₹73,912 | ₹74,815 | ₹903 |
Disc | ₹80,978 | ₹82,140 | ₹1,162 |
MOST READ:కొత్త ఆడి ఎ4 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. పూర్తి వివరాలు

హోండా గ్రాజియా 125 బిఎస్6 స్కూటర్లో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసిజి స్టార్టర్ మోటర్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఎల్ఇడి టెయిల్ లైట్లు, స్ప్లిట్ గ్రాబ్ రైల్, సైడ్ ప్యానెల్స్‌పై 3డి లోగో మరియు బ్లాక్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త హోండా గ్రాజియా 125 బిఎస్6 స్కూటర్లోని ఇతర ఫీచర్లలో పాస్-స్విచ్, కొత్త ఇంజన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, సీటు కోసం మల్టీ-ఫంక్షనల్ స్విచ్ మరియు ఇంధన-మూత మొదలైనవి ఉన్నాయి.
MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

ఇంజన్ విషయానికి వస్తే, హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్లో 124సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్పి పవర్‌ను మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వి-టైప్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

గ్రాజియా స్కూటర్ ముందు భాగంలో 12 ఇంచ్ మరియు వెనుక భాగంలో 10 ఇంచ్ వీల్స్ ఉంటాయి. అలాగే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు త్రీ-వే అడ్జస్టబల్ స్ప్రింగ్-లోడెడ్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇరువైపులా డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.
MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

హోండా గ్రాజియా 125సీసీ స్కూటర్ ప్రీమియం స్కూటర్ విభాగంలో అందుబాటులో ఉంటుంది. ఇది ఈ విభాగంలో యమహా ఫాసినో 125, టివిఎస్ ఎన్‌టార్క్ 125 మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.