హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) లిమిటెడ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ గ్రాజియా 125 ప్రీమియం స్కూటర్‌లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది.

హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ పేరుతో మార్కెట్లో విడుదలైన ఈ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.82,564 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. స్టాండర్డ్ గ్రాజియా 125 స్కూటర్‌తో పోల్చుకుంటే ఈ స్పోర్ట్స్ ఎడిషన్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉంటాయి.

హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు

కొత్త గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్‌లో లేటెస్ట్ బాడీ గ్రాఫిక్స్‌తో రెండు కొత్త పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఇందులో పెరల్ నైట్‌స్టార్ బ్లాక్ మరియు స్పోర్ట్స్ రెడ్ అనే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ ఎడిషన్‌లో కాస్మెటిక్ అప్‌డేట్స్ మినహా, వేరే ఏ ఇతర మార్పులు లేవు.

స్టాండర్డ్ హోండా గ్రాజియా 125 స్కూటర్‌లో లభించే అన్ని ఫీచర్లు, పరికరాలు ఈ కొత్త స్పోర్ట్స్ ఎడిషన్‌లో కూడా లభిస్తాయి. ఇంజన్ మరియు మెకానికల్స్ పరంగా కూడా ఇందులో ఎలాంటి మార్పులు లేవు.

హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు

హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్‌లో ఇదివరకటి 124సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 8.14 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు

ఈ స్కూటర్ హోండా యొక్క హెచ్ఇటి (హోండా ఎకో టెక్నాలజీ, ఇఎస్‌పి (ఎన్‌హాన్సెడ్ స్మార్ట్ పవర్) మరియు ఏసిజి (ఆల్టర్నేట్ కరెంట్ జనరేటర్) టెక్నాలజీలను ఉపయోగించారు. వీటి సాయంతో మైలేజ్ పెరగడమే కాకుండా, ఇంజన్ చాలా నిశ్సబ్ధంగా స్టార్ట్ అవుతుంది.

హోండా గ్రాజియా 125 స్కూటర్‌లో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్లు, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, స్ప్లిట్ గ్రాబ్ రైల్, సైడ్ ప్యానెల్స్‌పై 3డి లోగో మరియు బ్లాక్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా ఇందులో పాస్-స్విచ్, కొత్త ఇంజన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, సీటు కోసం మల్టీ-ఫంక్షనల్ స్విచ్ మరియు బయటవైపు అమర్చిన ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు

మెకానికల్స్ విషయానికి వస్తే, హోండా గ్రాజియా 125 స్కూటర్ ముందు భాగంలో 12 ఇంచ్ మరియు వెనుక భాగంలో 10 ఇంచ్ వీల్స్ ఉంటాయి. అలాగే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు త్రీ-వే అడ్జస్టబల్ స్ప్రింగ్-లోడెడ్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇరువైపులా డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.

హోండా ఇటీవలే తమ గ్రాజియా 125సీసీ స్కూటర్ ధరలను కూడా సవరించింది. గ్రాజియాలో ఈ స్పోర్ట్స్ ఎడిషన్ కాకుండా స్టాండర్డ్ మరియు డీలక్స్ అనే రెండు ఇతర వేరియంట్లు కూడా లభిస్తున్నాయి. వీటి ధరలను కంపెనీ రూ.903 నుండి రూ.1,162 మేర పెంచింది.

MOST READ:ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు

తాజా ధరల పెంపు తర్వాత హోండా గ్రాజియా 125 బిఎస్6 డ్రమ్ వేరియంట్ ధర రూ.903 మేర పెరిగి రూ.74,815 కి చేరుకుంది. ఇందులో డిస్క్ వేరియంట్ ధర రూ.1,162 మేర పెరిగి రూ.82,140 చేరుకుంది. (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

హోండా గ్రాజియా 125 ప్రీమియం స్కూటర్ విభాగంలో అందుబాటులో ఉంటుంది. ఇది ఈ విభాగంలో యమహా ఫాసినో 125, టివిఎస్ ఎన్‌టార్క్ 125 మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Honda Grazia 125 Sports Edition Launched In India: Price, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X