డిసెంబర్ 4 న విడుదల కానున్న 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్': వివరాలు

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) లిమిటెడ్ యొక్క 'హోండా హైనెస్ సిబి350' (Honda H'ness CB350) భారతీయ మార్కెట్లో విడుదలై ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. అయితే ఈ సందర్భంగా కంపెనీ 2021 డిసెంబర్ 04 న 2021 ఇండియా బైక్ వీక్‌లో హైనెస్ CB350 యొక్క 'యానివర్సరీ ఎడిషన్'ని ప్రదర్శించనుంది. ఈ కొత్త 'హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' కొత్త కలర్స్ మరియు బాడీ డిజైన్ పొందే అవకాశం ఉంటుంది.

డిసెంబర్ 4 న విడుదల కానున్న 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్': వివరాలు

కొత్త 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' బైక్ లో ఎలాంటి సాంకేతిక మార్పులు ఉండే అవకాశం లేదు. సాధారణంగా కంపెనీ యొక్క హోండా హైనెస్ సిబి350 బైక్ రూ. 1,92,411 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ DLX మరియు DLX ప్రో అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

డిసెంబర్ 4 న విడుదల కానున్న 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్': వివరాలు

హోండా హైనెస్ అనేక కొత్త మరియు ఆకర్షణీయమైన లక్షణాలతో కంపెనీ ప్రారంభించింది, దీని కారణంగా ఇది 350 సిసి శ్రేణిలోని ఇతర బైకుల నుండి చాలా భిన్నంగా నవీకరించబడింది. హోండా హైనెస్ డిజైన్ పరంగా ఇది క్రూయిజర్ బైక్. ఇందులో డ్యూయల్ టోన్ బాడీ పెయింట్, డ్యూయల్ క్రోమ్ ఫినిష్ హార్న్, స్ప్లిట్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, క్రోమ్ ఫినిష్ ఫ్రంట్ అండ్ రియర్ మడ్‌గార్డ్స్, క్రోమ్ ఫినిష్ సైలెన్సర్ ఉన్నాయి.

డిసెంబర్ 4 న విడుదల కానున్న 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్': వివరాలు

ఈ బైక్ లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ సహాయంతో కంట్రోల్ చేయగల, స్పెషల్ మొబైల్ అప్లికేషన్ కూడా అందించబడింది. బ్లూటూత్ హెడ్‌సెట్‌లతో కూడిన హెల్మెట్‌లను బైక్ యొక్క బ్లూటూత్‌కు కూడా కనెక్ట్ చేయవచ్చు. మ్యూజిక్ ప్లేబ్యాక్, ఇన్‌కమింగ్ కాల్స్, మెసేజ్‌లు మరియు నావిగేషన్ వంటి ఫీచర్‌లను ఈ ఫీచర్‌తో పొందవచ్చు.

డిసెంబర్ 4 న విడుదల కానున్న 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్': వివరాలు

ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఫ్రంట్ వీల్‌లో హబ్‌కు బదులుగా రిమ్‌పై డిస్క్ బ్రేక్ అమర్చబడి ఉంటుంది. హోండా హైనెస్ సిబి 350 లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ 20.8 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది.

డిసెంబర్ 4 న విడుదల కానున్న 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్': వివరాలు

ఇదిలా ఉండగా ఇటీవల హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) 2021 నవంబర్ అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ మొత్తం 2,80,381 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగలిగింది. ఇందులో 2,56,170 యూనిట్లు దేశీయ మార్కెట్లో విక్రయించగా, 24,211 యూనిట్లు ఎగుమతులు చేయబడ్డాయి.

డిసెంబర్ 4 న విడుదల కానున్న 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్': వివరాలు

2021 నవంబర్ అమ్మకాలు 2020 నవంబర్ అమ్మకాలతో పోలిస్తే ఎగుమతుల్లో 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. కానీ దేశీయ అమ్మకాలలో మాత్రమే 38% తగ్గుదలను నమోదు చేసింది. 2020 నవంబర్ లో కంపెనీ అమమకాలు 4,12,641 యూనిట్లు. అయితే 2021 నవంబర్ నెలలో అమ్మకాలు చాలా తగ్గాయి.

డిసెంబర్ 4 న విడుదల కానున్న 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్': వివరాలు

కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో హోండా గ్రాజియా 125 యొక్క రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్‌ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ స్పెషల్ ఎడిషన్‌ను రూ. 86,714 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో విడుదల చేసింది. ఇది ఆధునిక డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది.

డిసెంబర్ 4 న విడుదల కానున్న 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్': వివరాలు

హోండా గ్రాజియా 125 రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఈ కొత్త స్కూటర్ 123.97 సిసి, ఫ్యాన్-కూల్డ్, 4-స్ట్రోక్, PGM-FI ఇంజన్‌ని కలిగి ఉంటుంది. 8.14 బిహెచ్‌పి పవర్ మరియు 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా, ఈ స్కూటర్‌లో ఐడిల్ స్టాప్ సిస్టమ్ ఉపయోగించబడింది. ఇది స్కూటర్ ఎక్కడైనా కొద్దిసేపు ఆగినప్పుడు, అది ఇంజిన్‌ను ఆపివేస్తుంది. ఈ స్కూటర్‌లో సైలెంట్ ఇంజిన్ స్టార్ట్ కోసం కంపెనీ ACG స్టార్టర్‌ను కూడా ఉపయోగించింది.

డిసెంబర్ 4 న విడుదల కానున్న 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్': వివరాలు

హోండా మోటార్ సైకిల్ కంపెనీ దేశీయ మార్కెట్లో కొత్త హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్ ప్రారంభించిన తరువాత మరింత మంది కొత్త కస్టమర్లను ఆకర్శించే అవకాశం ఉంటుంది. కావున డిసెంబర్ నెల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Friday, December 3, 2021, 18:23 [IST]
English summary
Honda hness cb350 anniversary edition launch 4 december details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+