పెరిగిన హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలు; ఇప్పుడు కొత్త ధర ఎంతంటే..?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) లిమిటెడ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలను కంపెనీ మరోసారి పెంచింది. గతేడాది చివర్లో ఈ బైక్ ధరలు పెంచిన హోండా, మరోసారి దీని ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

పెరిగిన హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలు; ఇప్పుడు కొత్త ధర ఎంతంటే..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు కాంపిటీషన్‌గా వచ్చిన ఈ హోండా హైనెస్ సిబి350 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసిన సమయంలో డీలక్స్ వేరియంట్‌ను రూ.1.85 లక్షలు మరియు డీలక్స్ ప్రో వేరియంట్‌ను రూ.1.90 లక్షలకు విక్రయించారు. ఆ తర్వాత బేస్ వేరియంట్ ధరను రూ.1,000 మరియు ప్రీమియం వేరియంట్ ధరను రూ.2,000 మేర పెంచారు.

పెరిగిన హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలు; ఇప్పుడు కొత్త ధర ఎంతంటే..?

మొదటిసారి ధరలను పెంచిన తర్వాత ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.1.86 లక్షలు, రూ.1.92 లక్షలకు పెరిగాయి. కాగా, ఇప్పుడు ఈ మోడల్ ధరలను మరోసారి రూ.4,000 మేర పెంచారు. తాజా పెంపు తర్వాత డీలక్స్ వేరియంట్ ధర రూ.1.90 లక్షలు మరియు డీలక్స్ ప్రో వేరియంట్ ధర రూ.1.96 లక్షలకు పెరిగింది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

MOST READ:మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

పెరిగిన హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలు; ఇప్పుడు కొత్త ధర ఎంతంటే..?

ఈ రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో విడుదలై ఇంకా ఏడాది కాలం కూడా పూర్తవకముందే, ఇప్పటి వరకూ దీని బేస్ వేరియంట్ ధరలు రూ.5,000 మరియు ప్రీమియం వేరియంట్ ధరలు రూ.6,000 మేర పెరగాయి. ప్రస్తుతం, ఇది డీలక్స్ మరియు డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.ప్రతి వేరియంట్ కూడా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

పెరిగిన హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలు; ఇప్పుడు కొత్త ధర ఎంతంటే..?

ఈ ధరల పెరుగుదల తర్వాత హోండా హైనెస్ సిబి350 ధరలు, కంపెనీ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన హోండా సిబి350 ఆర్‌ఎస్ ధరలకు చాలా దగ్గరగా ఉన్నాయి. కెఫే రేసర్ స్టైల్‌లో లభ్యమయ్యే హోండా సిబి 350ఆర్ఎస్ ప్రస్తుత ధరలు రూ.1.96 లక్షలు (మోనోటోన్) మరియు రూ.1.98 లక్షలు (డ్యూయల్ టోన్)గా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్.. కారణం ఇదే

పెరిగిన హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలు; ఇప్పుడు కొత్త ధర ఎంతంటే..?

ఇక హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇందులో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.78 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

పెరిగిన హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలు; ఇప్పుడు కొత్త ధర ఎంతంటే..?

ఫీచర్ల పరంగా చూస్తే, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ మోటార్‌సైకిల్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది. ఇందులో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, ఇది రైడర్‌కు కావల్సిన డేటాను అందిస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌ను స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేయటం కోసం ఇందులో బ్లూటూత్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి 'హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్' కూడా ఉంటుంది. ఇంకా ఇందులో హోండా టార్క్ కంట్రోల్ ఫంక్షన్‌ను కూడా ఉంది.

MOST READ:కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

పెరిగిన హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలు; ఇప్పుడు కొత్త ధర ఎంతంటే..?

ఇంకా ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు ట్విన్-షాక్ సస్పెన్షన్ యూనిట్స్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి, ఇవి డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. అలాగే, ముందు వైపు 19 ఇంచ్, వెనుక వైపు 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి మరియు వాటిపై ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చబడి ఉంటాయి.

పెరిగిన హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలు; ఇప్పుడు కొత్త ధర ఎంతంటే..?

ఈ రెట్రో లుకింగ్ మోటార్‌సైకిల్ లుక్‌ని మరింత అందంగా మార్చడానికి ఇందులో గుండ్రటి ఆకారంలో ఉండే ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్స్ మరియు టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇంకా ఇందులో గుండ్రటి సైడ్ మిర్రర్స్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్‌ ఉంటాయి. ప్రీమియం లుక్ కోసం ఈ మోటారుసైకిల్ సైలెన్సర్‌తో సహా కొన్ని ఇతర భాగాలు క్రోమ్‌తో ఫినిష్ చేయబడి ఉంటాయి.

MOST READ:కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

పెరిగిన హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్ ధరలు; ఇప్పుడు కొత్త ధర ఎంతంటే..?

హోండా హైనెస్ సిబి 350 మొత్తం బరువు 181 కిలోలుగా ఉంటుంది. ఇందులో 15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఇది ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మరియు స్టాండర్డ్ జావా మోటార్‌సైకిల్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌ను మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ రైడ్ చేసింది. - దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Honda H’ness CB530 Motorcycle Price Increased, Details. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X