కొత్త పేరు, సరికొత్త కలర్ ఆప్షన్లలో హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా భారత మార్కెట్లో తయారు చేసి, విక్రయిస్తున్న హైనెస్ సిబి350 మరియు సిబి350 ఆర్ఎస్ మోడల్‌ను పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. తాజాగా ఈ మోడల్ హోండా స్వస్థలమైన జపాన్ మార్కెట్లో కూడా విడుదలైంది.

కొత్త పేరు, సరికొత్త కలర్ ఆప్షన్లలో హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్

జపాన్ మార్కెట్లో హోండా తమ హైనెస్ సిబి350ని వేరొక పేరు మరియు కొత్త కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టింది. జపాన్ మార్కెట్లో ఈ రెండు మోడళ్లను జిబి350 మరియు జిబి350 ఎస్ అనే పేర్లతో హోండా విక్రయిస్తోంది. ఇండియన్ వెర్షన్ సిబి350 మోడల్‌కు మరియు జపనీస్ వెర్షన్ జిబి350 మోడల్‌కు డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు.

కొత్త పేరు, సరికొత్త కలర్ ఆప్షన్లలో హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్

కానీ, ఈ రెండు వెర్షన్లలో పెయింట్ ఆప్షన్లు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అక్కడి మార్కెట్లో హోండా జిబి350 మూడు కలర్ షేడ్స్‌లో లభిస్తుంది. అవి: మ్యాట్ పెరల్ మోరియన్ బ్లాక్, మ్యాట్ జీన్స్ బ్లూ మెటాలిక్, క్యాండీ క్రోమోస్పియర్ రెడ్.

MOST READ:కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

కొత్త పేరు, సరికొత్త కలర్ ఆప్షన్లలో హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్

ఇకపోతే, హోండా జిబి 350 ఎస్ మోడల్ మాత్రం రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి: గన్‌మెటల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ డీప్ మడ్ గ్రే. జపాన్‌లో కాలుష్య నియంత్రణ నిబంధనల కారణంగా, ఈ రెండు మోటార్‌సైకిళ్ల బరువు వాటి భారతీయ వెర్షన్ బరువు కంటే 1 కిలో తక్కువగా ఉంటాయి.

కొత్త పేరు, సరికొత్త కలర్ ఆప్షన్లలో హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్

పైన పేర్కొన్న మార్పుల మినహా జపనీస్ వెర్షన్ జిబి350 మోడళ్లకు మరియు ఇండియన్ వెర్షన్ సిబి350 మోడళ్లకు ఎలాంటి వ్యత్యాసం లేదు. డిజైన్, ఇంజన్ మరియు మెకానికల్స్ పరంగా ఇవి ప్రస్తుతం మన మార్కెట్లో లభిస్తున్న మోడళ్ల మాదిరిగానే ఉంటాయి.

MOST READ:మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

కొత్త పేరు, సరికొత్త కలర్ ఆప్షన్లలో హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్

హోండా హైనెస్ సిబి350 లేదా జిబి350 మోటార్‌సైకిల్‌లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.78 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

కొత్త పేరు, సరికొత్త కలర్ ఆప్షన్లలో హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్

ప్రస్తుతం భారత మార్కెట్లో హోండా హైనెస్ సిబి350 డీలక్స్ మరియు డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రతి వేరియంట్ కూడా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో వీటి ధరలు రూ.1.86 లక్షల నుండి రూ.1.92 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. భారత్‌లో వీటిని హోండా బిగ్‌వింగ్ ప్రీమియం డీలర్‌షిప్ కేంద్రాల్లో విక్రయిస్తున్నారు.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

కొత్త పేరు, సరికొత్త కలర్ ఆప్షన్లలో హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్

హోండా సిబి350 మోటార్‌సైకిల్‌లోని కీలకమైన మెకానికల్స్‌ను గమనిస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్-షాక్ సస్పెన్షన్ యూనిట్స్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి, ఇవి డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

కొత్త పేరు, సరికొత్త కలర్ ఆప్షన్లలో హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్

ఈ మోటార్‌సైకిల్‌లో గుండ్రటి ఆకారంలో ఉండే ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్స్, టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్, గుండ్రటి సైడ్ మిర్రర్స్ మరియు పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్‌ ఉంటాయి. ఇవి ఈ రెట్రో లుకింగ్ మోటార్‌సైకిల్ లుక్‌ని మరింత అందంగా మార్చడంలో సహకరిస్తాయి.

MOST READ:అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

Most Read Articles

English summary
Honda Introduced New Colour Options For H’ness CB350 In Japan, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X