భారత్‌లో హోండా CB500X అడ్వెంచర్ టూరర్ లాంచ్ ; ధర & వివరాలు

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా తమ కొత్త సిబి 500 ఎక్స్ అడ్వెంచర్-టూరర్‌ బైక్ ని భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హోండా సిబి 500 ఎక్స్ ధర రూ. 6.87 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందించబడుతుంది. హోండా మోటార్‌సైకిల్ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త హోండా సిబి 500 ఎక్స్ దేశవ్యాప్తంగా బ్రాండ్ యొక్క ప్రత్యేకమైన బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్‌షిప్‌ల ద్వారా భారతదేశంలో విక్రయించబడుతుంది. హోండా సిబి 500 ఎక్స్‌ను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్‌గా దేశీయ మార్కెట్లోకి దిగుమతి చేయనున్నారు.

కొత్త హోండా సిబి 500 ఎక్స్ యొక్క బుకింగ్స్ అన్ని ప్రీమియం డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. ఈ మోటారుసైకిల్ డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

కొత్త హోండా సిబి 500 ఎక్స్ బైక్ బ్రాండ్ యొక్క ఆఫ్రికా ట్విన్ యొక్క డిజైన్ ను తీసుకుంటుంది. చుట్టూ ఆల్-ఎల్ఈడి లైటింగ్, అల్లాయ్ వీల్స్, ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సింగిల్-పీస్ జీన్ వంటివి ఉన్నాయి. ఈ మోటారుసైకిల్‌లో డ్యూయల్-ఛానల్ ఎబిఎస్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ మరియు హోండా యొక్క ఇగ్నీషియన్ సేఫ్టీ సిస్టం కూడా ఉన్నాయి.

హోండా సిబి 500 ఎక్స్ 471 సిసి 8 వాల్వ్ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8500 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 43.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అసిస్ట్ మరియు స్లిప్పర్-క్లచ్ మెకానిజంతో స్టాండర్డ్ గా వస్తుంది.

సరికొత్త హోండా సిబి 500 ఎక్స్ రెండు కలర్ ఆప్సన్స్ తో వస్తుంది. అవి గ్రాండ్ ప్రిక్స్ రెడ్ మరియు మాట్టే గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్. ఈ బైక్ సాహసప్రియులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది లాంగ్ డ్రైవ్ లో కూడా వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

హోండా సిబి 500 ఎక్స్ మిడ్-సైజ్ విభాగంలో బ్రాండ్ యొక్క లేటెస్ట్ అడ్వెంచర్-టూరర్ ఆఫర్. కొత్త సిబి 500 ఎక్స్ భారత మార్కెట్లో కవాసకి వెర్సిస్ 650, సుజుకి వి-స్ట్రోమ్ 650 ఎక్స్‌టి మరియు బెనెల్లి టిఆర్‌కె 502 ఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 15, 2021, 18:31 [IST]
English summary
Honda CB500X Adventure-Tourer Launched In India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+