బిఎస్ 6 హోండా లివాపై సరికొత్త ఆఫర్.. కేవలం 2021 జులై 30 వరకు మాత్రమే

కరోనా అధికంగా ప్రబలుతున్న ఈ సమయంలో కూడా చాలా కంపెనీలు తమ వాహనాలపై చాలా డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఈ విధంగా డిస్కౌంట్స్ ప్రకటించిన కంపెనీలలో హోండా మోటార్ సైకిల్ కంపెనీ ముందంజలో ఉంది. ఇప్పుడు కూడా ఈ బైక్ తయారీదారు తమ వాహనాలపై మంచి డిస్కౌంట్స్ ప్రకటించింది.

బిఎస్ 6 హోండా లివాపై సరికొత్త ఆఫర్.. కేవలం 2021 జులై 30 వరకు మాత్రమే

ప్రముఖ జపాన్ బైక్ తయారీదారు హోండా తన ద్విచక్ర వాహనాలపై ఇప్పుడు అదిరిపోయే డిస్కౌంట్స్ అందిస్తోంది. కంపెనీ ఇంతకు ముందు హోండా యాక్టివా, హోండా గ్రాజియా మరియు హోండా ఎక్స్-బ్లేడ్‌ వంటి వాటిపై డిస్కౌంట్ ఇచ్చింది. ఇదే నేపథ్యంలో కంపెనీ ఇప్పుడు తన 110 సిసి బైక్ హోండా లివో బైక్ పై కూడా ఇటీవల మంచి డిస్కౌంట్ ఆఫర్ ప్రవేశపెట్టింది.

బిఎస్ 6 హోండా లివాపై సరికొత్త ఆఫర్.. కేవలం 2021 జులై 30 వరకు మాత్రమే

కంపెనీ ఇప్పుడు 2021 జూన్ నెలలో హోండా లివా కొనుగోలుదారుల కోసం రూ. 3,500 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఎస్బిఐ యొక్క క్రెడిట్ కార్డుతో ఈఎమ్ఐ ద్వారా బైక్ కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. అంతే కాకూండా మీరు క్రెడిట్ కార్డు ద్వారా కనీస రూ. 40,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

బిఎస్ 6 హోండా లివాపై సరికొత్త ఆఫర్.. కేవలం 2021 జులై 30 వరకు మాత్రమే

హోండా లివా బైక్ కొనుగోలు చేసినప్పుడు, దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ డిజిటల్ మాధ్యమం ద్వారా పూర్తవుతుంది మరియు డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు డీలర్‌షిప్‌ను లేదా ఆన్‌లైన్‌ను సందర్శించడం ద్వారా దీన్ని పూర్తి చేయవచ్చు.

బిఎస్ 6 హోండా లివాపై సరికొత్త ఆఫర్.. కేవలం 2021 జులై 30 వరకు మాత్రమే

హోండా కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ 30 జూన్ 2021 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కావున ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు 2021 జూన్ 30 లోపు కొనుగోలు చేసుకోవాలి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మీరు సమీపంలో ఉన్న హోండా డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

బిఎస్ 6 హోండా లివాపై సరికొత్త ఆఫర్.. కేవలం 2021 జులై 30 వరకు మాత్రమే

హోండా లివో 110 సిసి మార్కెట్లో ఉన్న అత్యంత సరసమైన ప్యాసింజర్ బైక్, ఇది 2015 లో దేశీయ మార్కెట్లో ప్రారంభించబడింది. ఈ బైక్ స్పోర్టి మరియు స్టైలిష్ లుక్‌కు ప్రసిద్ది చెందింది. మంచి మైలేజ్ అందించడమే కాకుండా మంచి పర్ఫెమెన్స్ కూడా అందిస్తుంది. కావున ఎక్కువమంది కస్టమర్లు ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తుంటారు.

బిఎస్ 6 హోండా లివాపై సరికొత్త ఆఫర్.. కేవలం 2021 జులై 30 వరకు మాత్రమే

బిఎస్ 6 హోండా లివో బైక్ డిస్క్ మరియు డ్రమ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. బిఎస్ 6 లివో డ్రమ్ వేరియంట్‌ ధర. 69,971 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) కాగా, డిస్క్ వేరియంట్‌ ధర రూ. 74,171 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది.

బిఎస్ 6 హోండా లివాపై సరికొత్త ఆఫర్.. కేవలం 2021 జులై 30 వరకు మాత్రమే

బిఎస్ 6 హోండా లివా బైక్ లో 110 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 8.8 బిహెచ్‌పి పవర్ మరియు 9.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా కంపెనీ ఇందులో కొత్త ఎసిజి స్టార్టర్ మోటారును కూడా ఉపయోగించింది. దీనివల్ల స్టార్ట్ చేసినప్పుడు సౌండ్ రాకుండా చేస్తుంది.

బిఎస్ 6 హోండా లివాపై సరికొత్త ఆఫర్.. కేవలం 2021 జులై 30 వరకు మాత్రమే

హోండా లివో బిఎస్ 6 బైక్ లో కొత్త డిసి హెడ్‌ల్యాంప్‌లు, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, పాస్ స్విచ్, సర్వీస్ ఇండికేటర్, 5 స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ లభిస్తుంది. అంతే కాకుండా ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్ కౌల్, కొత్తగా రూపొందించిన ఫ్యూయల్ ట్యాంక్ మరియు ట్యాంక్ కౌల్‌ వంటివి ఉన్నాయి. ఈ బైక్ కొత్త సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సౌకర్యవంతమైన పొడవైన సీటును కలిగి ఉంటుంది.

బిఎస్ 6 హోండా లివాపై సరికొత్త ఆఫర్.. కేవలం 2021 జులై 30 వరకు మాత్రమే

బిఎస్ 6 హోండా లివా బైక్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులోని అన్ని వేరియంట్లలో కాంబి బ్రేక్ సిస్టమ్ స్టాండర్డ్ గా లభిస్తుంది. ఈ బైక్ నాలుగు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి బ్లూ మెటాలిక్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ రెడ్ మరియు మెటాలిక్ బ్లాక్ కలర్స్.

Most Read Articles

English summary
Honda Livo June 2021 Cashback And Offers. Read in Telugu.
Story first published: Friday, June 11, 2021, 19:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X