హోండా యాక్టివా 6జి, లివో మరియు షైన్ 125 మోడళ్లపై స్పెషల్ డిస్కౌంట్స్

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) మార్చి 2021 నెలలో భాగంగా, తమ ప్రోడక్ట్ లైనప్‌లో ఎంపిక చేసిన ద్విచక్ర వాహనాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.

హోండా యాక్టివా 6జి, లివో మరియు షైన్ 125 మోడళ్లపై స్పెషల్ డిస్కౌంట్స్

ఈ నెలలో యాక్టివా 6జి, లివో మరియు షైన్ 125 మోడళ్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అయితే, ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కేవలం క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఈఎమ్ఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

హోండా యాక్టివా 6జి, లివో మరియు షైన్ 125 మోడళ్లపై స్పెషల్ డిస్కౌంట్స్

క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ స్కీమ్ కోసం కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టెడ్, ఫెడరల్ బ్యాంక్‌లతో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఆర్థిక సంస్థలు అందించే డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నుండి ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది.

MOST READ:2021 హోండా సన్‌చాసర్స్ రైడ్ స్టార్ట్.. వివరాలు కోసం ఇక్కడ చూడండి

హోండా యాక్టివా 6జి, లివో మరియు షైన్ 125 మోడళ్లపై స్పెషల్ డిస్కౌంట్స్

ఇలా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ విధానం ద్వారా, తమ ఉత్పత్తులను కొనుగోలు చేయటం వలన ఎలాంటి ముందస్తు చెల్లింపు (డౌన్‌పేమెంట్) చేయాల్సిన అవసరం ఉండదని, అంతేకాకుండా ఇందుకోసం ఎటువంటి డాక్యుమెంటేషన్ మరియు హైపోథెకేషన్ కూడా అవసరం ఉండదని కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది.

హోండా యాక్టివా 6జి, లివో మరియు షైన్ 125 మోడళ్లపై స్పెషల్ డిస్కౌంట్స్

హోండా తమ ద్విచక్ర వాహనాల కొనుగోలుపై 100 శాతం ఫైనాన్స్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. దీంతో కస్టమర్లు ఇప్పుడు హోండా ద్విచక్ర వాహనాలను కనిష్టంగా 6.5 శాతం వడ్డీ రేటుతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కీమ్ క్రింద డౌన్‌పేమెంట్ కేవలం రూ.2,500 మాత్రమే ఉంటుందని కంపెనీ వివరించింది.

MOST READ:బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి

హోండా యాక్టివా 6జి, లివో మరియు షైన్ 125 మోడళ్లపై స్పెషల్ డిస్కౌంట్స్

హోండా టూవీలర్ కంపెనీ, భారత మార్కెట్లో తమ స్కూటర్ మరియు మోటార్‌సైకిల్ లైనప్‌ను నిరంతరం పెంచుతూ వస్తోంది. గతేడాది ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, కంపెనీ అనేక కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. హోండా కొత్తగా ప్రవేశపెట్టిన మోడళ్లలో హార్నెట్ 2.0, హైనెస్ సిబి 350 మరియు సిబి 350 ఆర్ఎస్‌లు ఉన్నాయి.

హోండా యాక్టివా 6జి, లివో మరియు షైన్ 125 మోడళ్లపై స్పెషల్ డిస్కౌంట్స్

భారతదేశపు టూవీలర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్ తరువాత దేశంలో రెండవ అతిపెద్ద టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొనసాగుతోంది. గత నెలలో ఈ కంపెనీ మొత్తం 4,11,578 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో మొత్తం అమ్మకాలు 3,15,285 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో అమ్మకాలు 31 శాతం పెరిగాయి.

MOST READ:కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

హోండా యాక్టివా 6జి, లివో మరియు షైన్ 125 మోడళ్లపై స్పెషల్ డిస్కౌంట్స్

ఇదే సమయంలో హోండా టూవీలర్స్ ఎగుమతులు 16 శాతం పెరిగి 31,118 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తంగా చూసుకుంటే, ఫిబ్రవరి 2020తో పోలిస్తే ఫిబ్రవరి 2021లో హోండా టూవీలర్స్ అమ్మకాలు సుమారు 1,00,000 యూనిట్లు పెరిగాయి.

హోండా యాక్టివా 6జి, లివో మరియు షైన్ 125 మోడళ్లపై స్పెషల్ డిస్కౌంట్స్

గతేడాది హోండా విడుదల చేసిన హైనెస్ సిబి350 ఆధారంగా కంపెనీ ఓ కెఫే రేసర్ స్టైల్ సిబి350 ఆర్ఎస్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 2021లో విడుదల చేసింది. మార్కెట్లో హోండా సిబి350 ఆర్ఎస్ ధర రూ.1,96,000 గా (ఎక్స్‌షోరూమ్) ఉంది. హోండా హైనెస్ సిబి350 మోడల్‌ను డిసెంబర్ 2020లో విడుదల చేశారు. ఈ మోడల్‌ని విడుదల చేసిన కేవలం మూడు నెలల్లోనే కంపెనీ 10,000 యూనిట్లను విక్రయించింది.

MOST READ:అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

Most Read Articles

English summary
Honda March Month Offers; Special Discounts On Livo, Activa 6G And Shine 125, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X