హోండా టూవీలర్స్‌కి కొత్త సంవత్సరంలోనైనా కలిసొచ్చేనా? నవంబర్‌లో 30 శాతం తగ్గుదల!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటంతో, పెట్రోల్ తో నడిచే టూవీలర్లకు డిమాండ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో, జపనీస్ టూవీలర్ బ్రాండ్ అయిన హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda Motorcycle and Scooter India) అమ్మకాలు కూడా దేశంలోని ఇతర ద్విచక్ర వాహన తయారీదారుల మాదిరిగానే, గడచిన నవంబర్ 2021లో గణనీయంగా తగ్గాయి.

హోండా టూవీలర్స్‌కి కొత్త సంవత్సరంలోనైనా కలిసొచ్చేనా? నవంబర్‌లో 30 శాతం తగ్గుదల!

గత నవంబర్‌ 2021 నెలలో హోండా టూవీలర్స్ భారత మార్కెట్లో మొత్తం 2,56,174 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్య నవంబర్ 2020 నెలలో విక్రయించిన దాని కంటే దాదాపు 37.92 శాతం తక్కువ. నవంబర్ 2020 ఆ నెలలో హోండా టూవీలర్స్ మొత్తం భారతదేశంలో 4,12,642 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అయితే, ఇదే సమయంలో హోండా టూవీలర్స్ ఎగుమతులు మాత్రం సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి.

హోండా టూవీలర్స్‌కి కొత్త సంవత్సరంలోనైనా కలిసొచ్చేనా? నవంబర్‌లో 30 శాతం తగ్గుదల!

నవంబర్ 2021 నెలలో దాదాపు అన్ని రకాల హోండా మోటార్‌సైకిళ్లు గత ఏడాది నవంబర్‌(2020)తో పోలిస్తే ప్రతికూల విక్రయాల సంఖ్యను నమోదు చేశాయి. అయితే, ఈ జాబితాలో ఎప్పటిలాగే, హోండా యాక్టివా స్కూటర్ అత్యధిక అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది. గత నెలలో మొత్తం 1,24,082 యాక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య నవంబర్ 2020 కంటే దాదాపు 1 లక్ష యూనిట్లు తక్కువ. ఈ సమయంలో హోండా యాక్టివా స్కూటర్ అమ్మకాలు 45.05 శాతం క్షీణించాయి.

హోండా టూవీలర్స్‌కి కొత్త సంవత్సరంలోనైనా కలిసొచ్చేనా? నవంబర్‌లో 30 శాతం తగ్గుదల!

భారతదేశంలోని మొత్తం హోండా టూవీలర్ అమ్మకాలలో హోండా యాక్టివా 125 దాదాపు 48.44 శాతం వాటాను కలిగి ఉంది. ఇదిలా ఉంటే కంపెనీ ఇందులో ఇటీవలే ఓ ప్రీమియం ఎడిషన్ కూడా విడుదల చేసింది. మార్కెట్లో ఈ ప్రీమియం ఎడిషన్ ధర రూ. 78,725 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ కొత్త ఎడిషన్ విడుదలతో రాబోయే నెలల్లో హోండా యాక్టివా స్కూటర్ల విక్రయాలను మరింత మెరుగుపడవచ్చని కంపెనీ భావిస్తోంది.

హోండా టూవీలర్స్‌కి కొత్త సంవత్సరంలోనైనా కలిసొచ్చేనా? నవంబర్‌లో 30 శాతం తగ్గుదల!

గత నెలలో హోండా నుండి అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో హోండా సిబి షైన్ 83,622 యూనిట్ల అమ్మకాలతో ద్వితీయ స్థానంలో ఉంది. కాగా, నవంబర్ 2020 నెలలో కంపెనీ మొత్తం 94,413 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ సమయంతో పోలిస్తే, గత నెలలో షైన్ అమ్మకాలు 11.43 శాతం తగ్గాయి. అయితే, వాస్తవానికి ఇతర హోండా టూవీలర్లతో పోల్చుకుంటే, సిబి షైన్ మోడల్ దేశీయ విక్రయాలు పెద్దగా తగ్గలేదని చెప్పవచ్చు.

హోండా టూవీలర్స్‌కి కొత్త సంవత్సరంలోనైనా కలిసొచ్చేనా? నవంబర్‌లో 30 శాతం తగ్గుదల!

హోండా యొక్క పాపులర్ మోటార్‌సైకిల్ యునికార్న్ 160 గత నెలలో 15,555 యూనిట్ల విక్రయాలతో మూడవ స్థానంలో ఉంది. నవంబర్ 2020లో విక్రయించబడిన 21,796 యూనిట్ల హోండా యునికార్న్ 160 బైక్‌లతో పోల్చుకుంటే, గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు 28.63 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. యవతను లక్ష్యంగా చేసుకొని హోండా విక్రయిస్తున్న స్పోర్టీ స్కూటర్ డియో ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. గత నెలలో డియో స్కూటర్ల విక్రయాలు 8,522 యూనిట్లుగా ఉన్నాయి.

హోండా టూవీలర్స్‌కి కొత్త సంవత్సరంలోనైనా కలిసొచ్చేనా? నవంబర్‌లో 30 శాతం తగ్గుదల!

స్పోర్టీ స్కూటర్ విభాగంలో పెరిగిన పోటీ, అందుబాటులోకి వచ్చిన ఇతర కొత్త మోడళ్ల కారణంగా హోండా డియో అమ్మకాలు ఇటీవలి కాలంలో తగ్గుతూ వస్తున్నాయి. నవంబర్ 2020 నెలలో హోండా విక్రయించిన 34,812 యూనిట్ల డియో స్కూటర్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 75.52 శాతం క్షీణించాయి. దీన్నిబట్టి చూస్తుంటే, యువ తరంలో హోండా డియో స్కూటర్లకు ఆదరణ తగ్గుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

హోండా టూవీలర్స్‌కి కొత్త సంవత్సరంలోనైనా కలిసొచ్చేనా? నవంబర్‌లో 30 శాతం తగ్గుదల!

గత నెలలో హోండా డ్రీమ్ బైక్ 7,956 యూనిట్ల విక్రయాలతో ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఉంది. నవంబర్ 2020లో మొత్తం 10,875 యూనిట్ల హోండా డ్రీమ్ బైక్‌లు అమ్ముడయ్యాయి. కాగా, గత నెలలో హోండా లివో బైక్‌ల విక్రయాలు 7,416 యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈ జాబితాలో 5,448 యూనిట్ల అమ్మకాలతో హోండా గ్రాజియా స్కూటర్ 7వ స్థానంలో నిలిచింది. నవంబర్ 2020 నెలతో పోల్చితే గత నవంబర్‌లో సానుకూల విక్రయాల సంఖ్యను నమోదు చేసిన ఏకైక హోండా టూవీలర్ మోడల్ గ్రాజియా

హోండా టూవీలర్స్‌కి కొత్త సంవత్సరంలోనైనా కలిసొచ్చేనా? నవంబర్‌లో 30 శాతం తగ్గుదల!

నవంబర్ 2020లో హోండా కేవలం 4,675 యూనిట్ల గ్రాజియా స్కూటర్లను మాత్రమే విక్రయించింది. ఈ సమయంలో హోండా స్టైలిష్ స్కూటర్‌గా అభివర్ణించబడిన గ్రాజియా విక్రయాలు 16.53 శాతం వృద్ధిని సాధించాయి. ఇకపోతే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350కి పోటీగా కంపెనీ విడుదల చేసిన హోండా హైనెస్ సిబి350 గత నెలలో 2,322 యూనిట్లను విక్రయించగా, హోండా యొక్క లేటెస్ట్ అడ్వెంచర్ బైక్ హోండా సిబి200ఎక్స్ 1,247 యూనిట్లను విక్రయించి, జాబితాలో వరుసగా 8వ మరియు 9వ స్థానంలో నిలిచాయి.

హోండా టూవీలర్స్‌కి కొత్త సంవత్సరంలోనైనా కలిసొచ్చేనా? నవంబర్‌లో 30 శాతం తగ్గుదల!

Honda Activa125 Premium Edition విడుదల, ధర ఫీచర్లు

ఇదిలా ఉంటే, హోండా టూవీలర్స్ తాజాగా భారత మార్కెట్లో కొత్త హోండా యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్ ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 78,725 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ పెర్ల్ అమేజింగ్ వైట్/మ్యాట్ మాగ్నిఫిసెంట్ కాపర్ మెటాలిక్ మరియు మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్/మ్యాట్ ఎర్ల్ సిల్వర్ మెటాలిక్ అనే రెండు డ్యూయెల్ టోన్ కలర్లలో లభిస్తుంది. కంపెనీ ఈ స్కూటర్ ను డ్రమ్ బ్రేక్స్ మరియు డిస్క్ బ్రేక్స్ ఫీచర్లతో విక్రయిస్తోంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Honda motorcycle and scooter india domestic sales declined by nearly 38 percent on yoy basis details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X