త్వరపడండి.. హోండా యునికార్న్ బైక్‌పై అద్భుతమైన ఆఫర్

ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ ఇండియా ఇటీవల తన హోండా యునికార్న్ బైక్ పై ఒక కొత్త ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ ఆఫర్ ప్రకారం హోండా యునికార్న్ బైక్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. హోండా ప్రకటించిన ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

త్వరపడండి.. హోండా యునికార్న్ బైక్‌పై అద్భుతమైన ఆఫర్

ఇప్పుడు కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం కొత్త హోండా యునికార్న్ బైక్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు 5% వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ లభిస్తుంది. కానీ దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. వినియోగదారుడు దీనిని గమనించాలి. కంపెనీ ఇస్తున్న ఈ ఆఫర్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ లావాదేవీలకు మాత్రమే చెల్లుతుంది. అంతే కాకుండా కనీస లావాదేవీ విలువ రూ. 40,000 అని కూడా కంపెనీ ప్రకటించింది.

త్వరపడండి.. హోండా యునికార్న్ బైక్‌పై అద్భుతమైన ఆఫర్

హోండా కంపెనీ అందిస్తున్న ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ 2021 జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త హోండా యునికార్న్ బైక్‌పై అందించే క్యాష్‌బ్యాక్ ఆఫర్ గురించి మరింత తెలుసుకోవడానికి సమీప హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు.

MOST READ:హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

త్వరపడండి.. హోండా యునికార్న్ బైక్‌పై అద్భుతమైన ఆఫర్

భారత మార్కెట్లో విక్రయించబడుతున్న ఈ కొత్త బిఎస్-6 హోండా యునికార్న్ బైక్ చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది . ఈ కొత్త బైక్‌లో 162.7 సిసి, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్‌ వద్ద 12.5 బిహెచ్‌పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్‌ వద్ద 14 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

త్వరపడండి.. హోండా యునికార్న్ బైక్‌పై అద్భుతమైన ఆఫర్

కొత్త హోండా యునికార్న్ బైక్‌ ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నిస్ బ్లాక్ వంటి కలర్స్ లో దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఈ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్ అమర్చబడి ఉంటుంది.

MOST READ:ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

త్వరపడండి.. హోండా యునికార్న్ బైక్‌పై అద్భుతమైన ఆఫర్

ఈ బైక్ లో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ లోని బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ అమర్చబడి ఉంటుంది. సింగిల్-ఛానల్ ఎబిఎస్ కూడా ఇందులో అందించబడుతుంది. కావున మంచి బ్రేకింగ్ సెటప్ కలిగి ఉంటుంది.

త్వరపడండి.. హోండా యునికార్న్ బైక్‌పై అద్భుతమైన ఆఫర్

హోండా మోటార్ సైకిల్ ఇండియా ఇప్పుడు ఎంపిక చేసిన స్కూటర్స్ మరియు బైక్ మోడళ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడంలో సహాయపడతాయి. తద్వారా ఈ బైక్ మంచి అమ్మకాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సోనాలిక.. ఏంటనుకుంటున్నారా?

త్వరపడండి.. హోండా యునికార్న్ బైక్‌పై అద్భుతమైన ఆఫర్

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే. కావున ఈ బైక్ కొనాలనుకునే వినియోగదారులు ఇప్పుడే మీ సమీపంలోని హోండా మోటార్ సైకిల్ షోరూమ్ సందర్శించి, దీని గురించి మరింత సమాచారం తెలుసుకుని కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles

English summary
Honda Unicorn Available With Five Percent Cashback Offer. Read in Telugu.
Story first published: Monday, May 31, 2021, 19:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X