Honda Motorcycle సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: పూర్తి వివరాలు

2021 సెప్టెంబర్ నెల ముగియడంతో భారతీయ మార్కెట్లోని వాహన తయారీదారులందరూ కూడా సెప్టెంబర్ నెల అమ్మకాల నివేదికను విడుదల చేసారు. ఇందులో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Honda Motorcycle (హోండా మోటార్ సైకిల్) కూడా తన నివేదికను విడుదల చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Honda Motorcycle సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: పూర్తి వివరాలు

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ గడిచిన 2021 సెప్టెంబర్ నెలలో మొత్తం 4,82,756 యూనిట్లు బైకులు మరియు స్కూటర్లను విక్రయించినట్లు తెలిపింది. కంపెనీ గత సంవత్సరం ఇదే నెలలో 5,26,866 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అంటే మునుపటి కంటే కూడా ఈ సంవత్సరం అమ్మకాలు 08 శాతం తక్కువ.

Honda Motorcycle సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: పూర్తి వివరాలు

కంపెనీ దేశీయ మార్కెట్లో 4,63,679 యూనిట్లను విక్రయించగా, 19,077 యూనిట్లను ఎగుమతి చేసినట్లు తెలిపింది. 2020 సెప్టెంబర్ నెలతో పోలిస్తే, 2021 సెప్టెంబర్ నెలలో హోండా మోటార్ సైకిల్ అమ్మకాలు 37,000 తక్కువ. ఇదే సమయంలో 2020 ఆగస్టు నెలతో పోల్చితే 62,210 యూనిట్ల వాహనాలను విక్రయించి 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే ఎగుమతులు మాత్రం కొంత మందగించినట్లు తెలుస్తుంది.

Honda Motorcycle సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: పూర్తి వివరాలు

కంపెనీ సెప్టెంబర్ 2021 లో కేవలం 19,077 యూనిట్ల వాహనాలను మాత్రమే ఎగుమతి చేయగలిగింది. అదే 2020 సెప్టెంబర్ నెలలో 25,978 యూనిట్లను ఎగుమతి చేసింది. కానీ ఈ నెలలో మాత్రం కొంత వరకు తగ్గుముఖం పట్టాయని స్పష్టం అవుతుంది.

Honda Motorcycle సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: పూర్తి వివరాలు

అమ్మకాల విషయంపై కంపెనీ డైరెక్టర్ మరియు సేల్స్ & మార్కెటింగ్ ఆఫీసర్ యద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, ప్రతి నెలా కస్టమర్ కొనుగోలుతో చాలా వరకు అభివృద్ధివైపు సాగుతున్నాము. అయితే ఇక రాబోయే నెలల్లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది, అని ఆయన తెలిపారు.

Honda Motorcycle సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: పూర్తి వివరాలు

భారదేశంలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది, కావున ఎక్కువమంది కొనుగోలుదారులు పండుగ సమయంలో ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కావున దాదాపు అన్ని కంపెనీలు కూడా దీనికోసం తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కావున రానున్న రోజుల్లో వాహనాల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

Honda Motorcycle సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: పూర్తి వివరాలు

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ భారతదేశంలో 20 సంవత్సరాల వ్యాపారాన్ని నిరాఘాటంగా పూర్తి చేసుకుంది. ఈ సమయంలో, కంపెనీ భారతీయ వినియోగదారుల కోసం అనేక కొత్త బైకులు మరియు స్కూటర్లను ప్రవేశపెట్టింది. హోండా మోటార్‌సైకిల్స్ రెండు దశాబ్దాలలో భారతదేశంలో 50 మిలియన్ ద్విచక్ర వాహనాలను విక్రయించగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క వాహనాలపై కస్టమర్లకు ఎంత నమ్మకం ఉందొ తెలుస్తుంది.

Honda Motorcycle సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: పూర్తి వివరాలు

కంపెనీ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, కంపెనీ 16 సంవత్సరాల వ్యాపారంలో 25 మిలియన్ వాహనాలను విక్రయించగా, మరో 5 మిలియన్ వాహనాలు కేవలం 5 సంవత్సరాలలో విక్రయించగలిగింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.

Honda Motorcycle సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: పూర్తి వివరాలు

హోండా మోటార్‌సైకిల్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఒకటి హోండా యాక్టివా. కొత్త హోండా యాక్టివా ఆధునిక ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా మరియు మంచి మైలేజ్ అందిస్తున్న కారణంగా అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది.

Honda Motorcycle సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: పూర్తి వివరాలు

హోండా యాక్టివా తరువాత, కంపెనీ యొక్క షైన్, యునికార్న్, డ్రీమ్ నియో వంటి వాటికి మంచి డిమాండ్ ఉంది. అంతే కాకుండా కంపెనీ CBR 150R ని తన కమ్యూటర్ రేంజ్‌లో లాంచ్ చేసింది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి.

Honda Motorcycle సెప్టెంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: పూర్తి వివరాలు

హోండా మోటార్ సైకిళ్ల జాబితాలో తాజాగా చేర్చబడిన బైక్ హోండా సిబి 200 ఎక్స్. ఇది హార్నెట్ 2.0 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఆఫ్-రోడ్ బైక్. ఇది హోండా హార్నెట్ 2.0 యొక్క 184.4 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజిన్, 17 బిహెచ్‌పి పవర్ మరియు 16.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ కి జత చేయబడి ఉంటుంది.

హోండా సిబి 200 ఎక్స్ బైక్ యొక్క మైలేజీని మెరుగుపరచడానికి, ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో పనిచేసే దాని ఇంజిన్‌లో 8 సెన్సార్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ బైక్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధర మరియు స్పెసిఫికేషన్ల పరంగా, ఇది హీరో ఎక్స్‌ప్లస్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Honda motorcycle sales september 482756 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X