కరోనా ఎఫెక్ట్; వారంటీ & ఫ్రీ సర్వీస్ వ్యవధి పొడిగించిన హోండా మోటార్‌సైకిల్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ యొక్క తీవ్రత రోజురోజుకి చాలా ఎక్కువవుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎంతోమంది ప్రజలు మరణించారు. అయితే లెక్కకుమించిన జనం ఈ వైరస్ బారినపడి కొట్టుమిట్టాడుతున్నారు. ఈ మహమ్మరి ప్రభావం వల్ల దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించబడింది.

కరోనా ఎఫెక్ట్; వారంటీ & ఫ్రీ సర్వీస్ వ్యవధి పొడిగించిన హోండా మోటార్‌సైకిల్

ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులుపడుతున్నారు. ఈ కరోనా వైరస్ ప్రభావం కేవలం ప్రజలమీద మాత్రమే కాకుండా ఆటో పరిశ్రమపై కూడా పడింది.ఈ కారణంగా వాహనాల అమ్మకాలు భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా చాలా కంపెనీలు తమ వినియోగదారులకు అందుబాటులో ఉండటానికి ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వంటి వాటి సమయాన్ని పొడిగించాయి.

కరోనా ఎఫెక్ట్; వారంటీ & ఫ్రీ సర్వీస్ వ్యవధి పొడిగించిన హోండా మోటార్‌సైకిల్

ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల హోండా మోటార్ సైకిల్ ఇండియా కూడా ఫ్రీ సర్వీస్ వ్యవధిని పొడిగించినట్లు తెలిపింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం హోండా మోటార్‌సైకిల్ వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వ్యవధి ఇప్పుడు 2021 జూలై 31 వరకు పొడిగించింది.

MOST READ:కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

కరోనా ఎఫెక్ట్; వారంటీ & ఫ్రీ సర్వీస్ వ్యవధి పొడిగించిన హోండా మోటార్‌సైకిల్

దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలోని వినియోగదారులందరికీ ఇది వర్తిస్తుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మునుపటి నివేదికల ప్రకారం ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ ఇప్పుడు 2021 ఏప్రిల్ 01 నుంచి 31 మే 2021 వరకు ఉంది. కానీ ఈ కరోనా వల్ల ఈ ఫ్రీ సర్వీస్ టైమ్ మరియు వారంటీ పొడిగించింది.

కరోనా ఎఫెక్ట్; వారంటీ & ఫ్రీ సర్వీస్ వ్యవధి పొడిగించిన హోండా మోటార్‌సైకిల్

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశంలో దాదాపు అత్యవసర సేవలు మినహా అన్ని సర్వీసులు మూసివేయబడతాయి. ఇందులో భాగంగానే ఆటోమొబైల్ కంపెనీలు తమ డీలర్‌షిప్‌లను మూసివేసాయి. ఈ కారణంగా వినియోగదారులు అవసరాలను దృషిలో ఉంచుకుని హోండా మోటార్‌సైకిల్ దీనిని జూలై 31 వరకు పొడిగించింది.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించిన మరో కొత్త కార్ 'మేబ్యాక్ ఎస్680'; పూర్తి వివరాలు

కరోనా ఎఫెక్ట్; వారంటీ & ఫ్రీ సర్వీస్ వ్యవధి పొడిగించిన హోండా మోటార్‌సైకిల్

కరోనా వ్యాపించడం వల్ల ఏర్పాటైన ఈ క్లిష్ట పరిస్థితి వల్ల, కస్టమర్ సెంట్రిక్ విధానాన్ని అవలంబించడం ద్వారా, అనేక రాష్ట్రాల్లోని హోండా కస్టమర్ల ఇబ్బందుల తీర్చడానికి లాక్ డౌన్ సడలింపు తర్వాత, అందుబాటులో ఉన్న సర్వీసులన్నింటిని పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఇవన్నీ కూడా 2021 జూలై 31 లోపు వినియోగించుకోవాలి.

కరోనా ఎఫెక్ట్; వారంటీ & ఫ్రీ సర్వీస్ వ్యవధి పొడిగించిన హోండా మోటార్‌సైకిల్

ప్రస్తుతం చాలా కంపెనీలు కరోనా లాక్ డౌన్ కారణంగా ఉత్పత్తి మరియు ఎగుమతులు వంటి వాటిని పూర్తిగా నిలిపివేశాయి. మరికొన్ని కంపెనీలు ప్రభుత్వాలకు సహకరించడానికి కంపెనీలలో ఆక్సిజన్ తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నాయి. కరోనా కారణంగా హోండా మోటార్‌సైకిల్ గత నెలలో తన ప్లాంట్‌ను 15 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది, కానీ కంపెనీ ఇప్పటివరకు కూడా తెరుచుకోలేదు.

MOST READ:కోవిడ్‌పై పోరుకు 100 హెక్టర్ అంబులెన్సులను అందించనున్న ఎమ్‌జి మోటార్

Most Read Articles

English summary
Honda Motorcycle Extended Warranty & Free Service Til 31st July. Read in Telugu.
Story first published: Monday, May 17, 2021, 15:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X