ఆగస్ట్ 19న సరికొత్త హోండా అడ్వెంచర్ బైక్ విడుదల; వివరాలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్, భారత మార్కెట్లో తమ సరికొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ 'హోండా ఎన్ఎక్స్200'ను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేయబోతోంది. తాజా సమాచారం ప్రకారం, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ ఆగస్టు 19న ఈ కొత్త బైక్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. భారతీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త హోండా అడ్వెంచర్ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఆగస్ట్ 19న సరికొత్త హోండా అడ్వెంచర్ బైక్ విడుదల; వివరాలు

ఇటీవలే, హోండా ఈ కొత్త బైక్‌కు సంబంధించి ఓ టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హోండా మోటార్‌సైకిల్ ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న నేక్డ్ బైక్ హోండా హార్నెట్ 2.0 మోడల్ ఆధారంగా ఈ కొత్త అడ్వెంచర్ బైక్ హోండా ఎన్ఎక్స్200 మోడల్‌ను తయారు చేస్తున్నారు.

ఆగస్ట్ 19న సరికొత్త హోండా అడ్వెంచర్ బైక్ విడుదల; వివరాలు

ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో కొన్ని పోలికలు ఒకేలా ఉండే అవకాశం ఉంది. ఇందులోని ఇంజన్ కూడా హార్నెట్ 2.0 మోడల్ లోనిదే కానుంది. అలాగే, హార్నెట్ యొక్క ఫ్రేమ్ మరియు బ్రేకింగ్ హార్డ్‌వేర్ కూడా ఈ కొత్త బైక్‌లో కనిపిస్తుంది. హార్నెట్ యొక్క 184 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ కొత్త హోండా ఎన్ఎక్స్200 బైక్‌లో ఉపయోగించనున్నారు.

ఆగస్ట్ 19న సరికొత్త హోండా అడ్వెంచర్ బైక్ విడుదల; వివరాలు

ఇంజన్:

హార్నెట్ 2.0లో ఉపయోగించిన 184.5సిసి 2-వాల్వ్, ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 17.26 పిఎస్ పవర్‌ను మరియు 16.1 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అయితే, ఇందులో సవరించిన గేర్ నిష్పత్తికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఆగస్ట్ 19న సరికొత్త హోండా అడ్వెంచర్ బైక్ విడుదల; వివరాలు

డిజైన్:

హోండా మోటార్‌సైకిల్ విడుదల చేసిన టీజర్ వీడియో ప్రకారం, కొత్త ఎన్ఎక్స్200 మోడల్ యొక్క ఫ్రంట్ ఎండ్ మరియు ఓవరాల్ మోటార్‌సైకిల్ డిజైన్ సిల్హౌట్ చూడటానికి హోండా సిబి500ఎక్స్ మోడల్ నుండి స్పూర్తి పొంది తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. దీని హెడ్‌ల్యాంప్ యూనిట్ హార్నెట్ మోడల్‌లో మాదిరిగానే కనిపిస్తుంది.

ఆగస్ట్ 19న సరికొత్త హోండా అడ్వెంచర్ బైక్ విడుదల; వివరాలు

హోండా ఎన్ఎక్స్200 బైక్‌ను ఆఫ్-రోడ్ ప్రయోజనార్థం అడ్వెంచర్ మోటార్‌సైకిల్ రూపంలో డిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో, హార్నెట్ 2.0లో కనిపించిన అల్లాయ్ వీల్స్ స్థానంలో ఈ కొత్త బైక్‌లో స్పోక్ వీల్స్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఓవరాల్‌గా చూడటానికి ఇది ఇది హార్నెట్ 2.0 బైక్ యొక్క నేక్డ్ మోటార్‌సైకిల్‌గా ఉంటుందని తెలుస్తోంది.

హోండా ఇటీవల విడుదల చేసిన టీజర్ వీడియోలో బైక్ యొక్క హెడ్‌ల్యాంప్ యూనిట్, హ్యాండిల్ బార్ నకల్ గార్డ్స్‌పై అమర్చిన టర్న్ ఇండికేటర్స్, సైడ్ స్టాండ్ వంటి డిజైన్ అంశాలను కంపెనీ హైలైట్ చేసింది. ఇందులోని పొడవైన విండ్‌స్క్రీన్ మరియు షార్ప్ ఎల్ఈడి హెడ్‌లైట్ కారణంగా ఇది ముందు వైపు నుండి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఆగస్ట్ 19న సరికొత్త హోండా అడ్వెంచర్ బైక్ విడుదల; వివరాలు

ఫీచర్లు:

హోండా నుండి వస్తున్న ఈ ఎంట్రీ లెవల్ ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, సీట్ హైట్, స్ప్లిట్ సీట్, వెడల్పాటి హ్యాండిల్‌బార్, ఎల్ఈడి లైటింగ్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, సింగిల్-ఛానల్ ఏబిఎస్ మరియు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను ఆశించవచ్చు.

ఆగస్ట్ 19న సరికొత్త హోండా అడ్వెంచర్ బైక్ విడుదల; వివరాలు

ధర:

హోండా ఎన్ఎక్స్200 ధర విషయానికి వస్తే, కంపెనీ ఈ ఎంట్రీ-లెవల్ అడ్వెంచర్ బైక్‌ను హోండా హార్నెట్ కంటే సుమారు రూ.10,000 అధిక ధరతో విక్రయించే అవకాశం ఉంది. భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర సుమారు రూ.1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.

ఆగస్ట్ 19న సరికొత్త హోండా అడ్వెంచర్ బైక్ విడుదల; వివరాలు

లాంచ్ మరియు డెలివరీ:

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ ఈ కొత్త అడ్వెంచర్ బైక్‌ను ఆగస్టు 19, 2021వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. హోండా ఎన్ఎక్స్200 యొక్క మొదటి బ్యాచ్ డెలివరీలు సెప్టెంబర్ రెండవ వారం నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

హోండా మోటార్ సైకిల్ త్వరలో విడుదల చేయనున్న ఈ కొత్త హోండా అడ్వెంచర్ బైక్ చాలా స్టైలిష్ గా ఉండనుంది. కంపెనీ విడుదల చేసిన ఈ టీజర్ వీడియోలో గమనిస్తే రాబోయే ఈ కొత్త బైక్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఈ బైక్ దేశీయమార్కెట్లో విడుదలైన తర్వాత కంపెనీ యొక్క అమ్మకాలను మెరుగుపరచడానికి దోహదపడే అవకాశం ఉంది. అయితే ఈ బైక్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి స్పందన పొందుతుందో తెలుసుకోవడానికి కొంత కాలం వేచి చూడాలి.లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Honda nx200 adventure bike india launch scheduled on 19th august details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X