హోండా రెబల్ 1100 బైక్ భారత మార్కెట్లో విడుదల కానుందా?

జపాన్‌ లెజండరీ మోటార్‌సైకిల్ సంస్థ హోండా, తన బ్రాండ్ నుంచి పవర్ పుల్ క్రూయిజర్ బైక్‌ను తీసుకురావడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. విడుదలకు సిద్దమవుతున్న ఈ కొత్త హోండా రెబల్ బైక్, హోండా రెబల్ 500 యొక్క పవర్ పుల్ వెర్షన్ అవుతుంది. హోండా ప్రవేశపెట్టనున్న ఈ కొత్త బైక్ రెబల్ 1100 పేరుతో మార్కెట్లో విడుదల చేయనున్నారు.

హోండా రెబల్ 1100 బైక్ భారత మార్కెట్లో విడుదల కానుందా?

హోండా రానున్న ఈ కొత్త బైక్‌ 1,100 సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఈ కొత్త బైక్ స్టైలింగ్ మరియు డిజైన్ మొత్తం దాదాపు దాని 500 సిసి రెబల్ క్రూయిజర్ నుండి తీసుకోబడుతుంది. దాదాపు ఇది చూడటానికి కూడా రెబల్ 500 బైక్ మాదిరిగానే కనిపిస్తుంది.

హోండా రెబల్ 1100 బైక్ భారత మార్కెట్లో విడుదల కానుందా?

హోండా రెబల్ 1100 బైక్ లో రౌండ్ హెడ్‌ల్యాంప్స్, రౌండ్ మిర్రర్స్, టైర్-డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్ మరియు బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో విలాసవంతమైన రెట్రో డిజైన్‌ కలిగి ఉంటుంది. ఈ క్రూయిజర్ బైక్‌కు పుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ లభిస్తుంది. అంతే కాకుండా ఈ బైక్‌లో పుల్ ఎల్‌ఈడీ లైటింగ్ కూడా ఉంటుంది.

MOST READ:మానవత్వం చాటుకున్న మంచి పోలీస్ & బైక్ రైడర్.. వీడియో చూస్తే మీరు కూడా మెచ్చుకుంటారు

హోండా రెబల్ 1100 బైక్ భారత మార్కెట్లో విడుదల కానుందా?

హోండా రెబల్ 1100 క్రూయిజర్ బైక్ లో 1,100 సిసి, ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజిన్ హోండా యొక్క సిఆర్ఎఫ్ 1100 ఎల్ ఆఫ్రికా ట్విన్‌లో ఇవ్వబడింది. ఈ ఇంజిన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 102 బిహెచ్‌పి శక్తిని మరియు 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 105 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా రెబల్ 1100 బైక్ భారత మార్కెట్లో విడుదల కానుందా?

హోండా క్రూయిజర్ బైక్ రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇందులో ఇంకా మంచి పర్ఫామెన్స్ కోసం ఎబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు రైడింగ్ మోడ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త క్రూయిజర్ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్ యూనిట్ సస్పెన్షన్ లభిస్తుంది.

MOST READ:గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

హోండా రెబల్ 1100 బైక్ భారత మార్కెట్లో విడుదల కానుందా?

హోండా కంపెనీ ఈ బైక్ విడుదల గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కొత్త క్రూయిజర్ బైక్ మొదట 2020 నవంబర్‌లో ఇకామా మోటార్‌సైకిల్ షోలో విడుదల చేయవలసి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. నివేదికల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాదశం ఉంది.

హోండా రెబల్ 1100 బైక్ భారత మార్కెట్లో విడుదల కానుందా?

హోండా రెబల్ 1100 ఇటీవల థాయ్‌లాండ్‌లో లాంచ్ అయింది. థాయ్‌లాండ్‌లో లాంచ్ అయింది కావున, భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ బైక్ యొక్క రెండు వేరియంట్లు థాయిలాండ్ లో ప్రారంభించబడ్డాయి. వీటి ధర రూ .9.29 లక్షలు మరియు రూ .10 లక్షలు.

MOST READ:తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

హోండా రెబల్ 1100 బైక్ భారత మార్కెట్లో విడుదల కానుందా?

ఈ బైక్స్ 300 సిసి మరియు 500 సిసిలతో రెండు ఇంజన్ ఆప్షన్లలో అంతర్జాతీయ మార్కెట్లో లభిస్తుంది. రెబల్ 300 భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం రెబల్ 500 కూడా భారతదేశంలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్, జావా మోటార్‌సైకిళ్లకు సమానమైన హోండా రెబల్ 300 ధర రూ. 2.5 లక్షలు. రెబల్ 500 భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క 650 సిసి బైక్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Honda Rebel 1100 India Launch Plan. Read in Telugu.
Story first published: Friday, March 26, 2021, 13:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X