హోండా షైన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా..

ప్రముఖ బైక్ తయారీదారు హోండా 2 వీలర్స్ ఇండియా ఇటీవల ఒక కొత్త ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క వాహనాలను గోనుగోలు చేస్తే దానిపై క్యాష్ బ్యాక్ అందిస్తుంది. కొంతకాలం క్రితం హోండా యాక్టివా 6 జి, గ్రాజియా 125 మరియు డియో బిఎస్ 6 వంటి వాటిపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందించింది. అయితే ఇప్పుడు కంపెనీ యొక్క హోండా షైన్ బిఎస్ 6 పై ఈ అఫర్ అమలులో ఉంది.

హోండా షైన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా..

హోండా కంపెనీ విడుదల చేసిన ఈ ప్రకటన ప్రకారం హోండా షైన్ బిఎస్ 6 యొక్క వినియోగదారులకు 5% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు, అంటే కార్డుపై రూ. 3,500 వరకు వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఈఎమ్ఐ లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

హోండా షైన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా..

వినియోగదారులు ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ పొందటానికి కనీస లావాదేవీ రూ. 40,000 వరకు ఉండాలి. కంపెనీ యొక్క ఈ ఆఫర్ కేవలం 2021 మే 01 నుండి 2021 జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.

హోండా షైన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా..

హోండా కంపెనీ యొక్క ప్రసిద్ధి చెందిన బైకులలో హోండా షైన్ బిఎస్ 6 ఒకటి. ఇది కంపెనీకి చాలా పెద్ద అమ్మకాలను సాధించడానికి సహాయపడింది. హోండా షైన్ విడుదలైనప్పటి నుంచి దాదాపు 9 మిలియన్ యూనిట్ల అమ్మకాలను దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

హోండా షైన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా..

హోండా మోటార్‌సైకిల్ ఇండియా ప్రకారం, షైన్ గత కొన్ని దశాబ్దాలుగా మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తుంది. ఈ బైక్ మార్కెట్లో ప్రారంభమైన కేవలం రెండు సంవత్సరాలలో అత్యధికంగా అమ్ముడైన 125 సిసి మోటార్‌సైకిల్‌గా నిలిచింది. ఇది మాత్రమే కాకుండా 54 నెలల్లో 1 మిలియన్ కస్టమర్లను పొందగలిగింది.

హోండా షైన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా..

హోండా షైన్ బిఎస్ 6 ప్రస్తుతం డ్రమ్ బ్రేక్ మరియు డిస్క్ బ్రేక్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ తన బేస్ డ్రమ్ బ్రేక్ వేరియంట్‌ను రూ. 71,550, ఎక్స్‌షోరూమ్ ధరలతో విక్రయిస్తుండగా, హై-స్పెక్ డిస్క్ బ్రేక్ వేరియంట్‌ను ఎక్స్‌-షోరూమ్ ధర ప్రకారం రూ. 76,346 కు విక్రయిస్తోంది.

హోండా షైన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా..

లేటెస్ట్ బిఎస్ 6 హోండా షైన్‌ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 124 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.59 బిహెచ్‌పి పవర్, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, May 15, 2021, 12:46 [IST]
English summary
Honda Shine BS6 Gets Cashback Offer Worth Rs 3,500 Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+