హోండా నుండి మరో సరికొత్త మోటార్‌సైకిల్; ఫిబ్రవరి 16న విడుదల
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ భారత మార్కెట్లో మరో సరికొత్త ప్రీమియం బైక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 16న ఓ కొత్త బైక్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ మేరకు ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

హోండా ఇటీవల విడుదల చేసిన సిబి హైనెస్ 350 మోడల్ మార్కెట్లో మంచి విజయం సాధించడంతో కంపెనీ అదే కోవలో మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. సిబి హైనెస్ 350 మోడల్ మాదిరిగానే, కొత్తగా రానున్న హోండా మోటార్‌సైకిల్‌ను కూడా హోండా ప్రీమియం డీలర్‌షిప్ 'బిగ్‌వింగ్' ద్వారా విక్రయించనున్నారు.

ఈ కొత్త మోటార్‌సైకిల్‌కు సంబంధించి హోండా ప్రస్తుతానికి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే, కంపెనీ విడుదల చేసిన టీజర్‌ను గమనిస్తుంటే, ఇదొక రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ మాదిరిగా, కెఫే రేసర్ మోడల్ మాదిరిగా ఉండొచ్చని తెలుస్తోంది. దీనిని హోండా సిబి హైనెస్ 350కి ఎగువన ఆఫర్ చేసే అవకాశం ఉంది.

మార్కెట్ సమాచారం ప్రకారం, హోండా నుండి కొత్తగా రానున్న ఈ మోటార్‌సైకిల్ సిబి హైనెస్ 350 సిసి యొక్క పెద్ద ఇంజన్ వేరియంట్ (500 సిసి) కావచ్చని తెలుస్తోంది. హోండా భారతదేశంలో మరింత శక్తివంతమైన క్రూయిజర్ బైక్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోందని మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన విషయం విదితమే.

హోండా ప్రస్తుతం తమ బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా అనేక ప్రీమియం మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. వీటిలో కొన్ని దేశీయ మార్కెట్లో ఉత్పత్తి అవుతుండగా మరికొన్ని మోడళ్లను విదేశాల నుండి దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. రానున్న రోజుల్లో ఈ కొత్త మోడల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఒకవేళ హోండా నుండి రాబోయేది కొత్త 500సీసీ మోటార్‌సైకిల్ అయితే, ఇది ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయిస్తున్న 650 ట్విన్ మోటార్‌సైకిళ్లకు (కాంటినెంటల్ జిటి మరియు ఇంటర్‌సెప్టర్) పోటీగా ఉంటుంది. అలాగే, బజాజ్ డొమినార్ 400 వంటి మోడళ్లతో కూడా ఇది పోటీ పడే అవకాశం ఉంది.

హోండా విడుదల చేసిన ఈ టీజర్‌లో బైక్ వెనుక డిజైన్‌ను వెల్లడి చేసింది. ఇందులో స్లిమ్ ఎల్ఈడి టెయిల్ లైట్ మరియు టర్న్ ఇండికేటర్స్, క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన సస్పెన్షన్, ఎత్తుగా ఉండే బ్లాక్ కలర్ సైలెన్సర్, సింగిల్ పీస్ సీట్ మరియు వెడల్పాటి వెనుక టైర్ వంటి వివరాలను గమనించవచ్చు.

జపనీస్ బ్రాండ్ నుండి కొత్తగా వస్తున్న ఈ కొత్త మోటార్‌సైకిల్ సిబి హైనెస్ 350 మోడల్ మాదిరిగానే మంచి సక్సెస్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోండా సిబి హైనెస్ 350 మార్కెట్లో విడుదలైన కొద్ది రోజుల్లోనే మంచి బ్రాండ్ ఇమేజ్‌ను సంపాధించుకుంది.

హోండా సిబి హైనెస్ 350 ఈ విభాగంలో నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350 మరియు మీటియోర్ 350 వంటి మోడళ్లతో పోటీ పడుతుంది. అయితే, ఇది 300 సిసి సెగ్మెంట్‌లో లభించే ఇతర మోటార్‌సైకిళ్ల కంటే కూడా భిన్నంగా ఉండే అనేక ఫీచర్లను కలిగి ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌తో పోల్చుకుంటే హోండా సిబి హైనెస్ 350 మోడల్ ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఈ బైక్‌లోని ఇంజన్ చాలా స్మూత్‌గా ఉంటుంది మరియు అధిక ఆర్‌పిఎమ్ వద్ద కూడా తక్కువ వైబ్రేషన్‌ను కలిగి ఉంటుంది. కానీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు బుల్లెట్ 350 మోడళ్లలో ఇంజన్ వైబ్రేషన్ పెద్ద సమస్యగా ఉంటుంది.


Click it and Unblock the Notifications