హోండా నుండి కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్; ఫిబ్రవరి 16న లాంచ్

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌ను ఢీకొట్టేందుకు జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా భారీ కసరత్తులు చేస్తోంది. ఇప్పటేకీ 350సీసీ బైక్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, క్లాసిక్ 350 మోడళ్లకు పోటీగా ప్రవేశపెట్టిన కొత్త హోండా హైనెస్ సిబి350 మార్కెట్లో మంచి విజయాన్ని సాధించడంతో కంపెనీ మరో కొత్త ఉత్పత్తిని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

హోండా నుండి కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్; ఫిబ్రవరి 16న లాంచ్

హోండా విక్రయిస్తున్న హైనెస్ సిబి350 మోడల్ ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో ఓ కెఫే రేసర్ స్టైల్ మోడల్‌ను ఈనెల 16వ తేదీ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి కంపెనీ తాజాగా మరో కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో కొత్త హోండా మోటార్‌సైకిల్ యొక్క రియర్ హాఫ్ డిజైన్ వెల్లడవుతుంది.

హోండా నుండి కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్; ఫిబ్రవరి 16న లాంచ్

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయిస్తున్న ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోడళ్ల మాదిరిగానే ఈ కొత్త హోండా మోటార్‌సైకిల్ కూడా అర్బన్ స్క్రాంబ్లర్ డిజైన్‌ను కలిగి ఉంటుందని ఈ టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. ఈ కొత్త మోడల్‌ను 'హోండా సిబి350 ఆర్ఎస్'గా విడుదల చేయవచ్చని సమాచారం.

MOST READ:ఇది చూసారా.. ఆడి కార్ గుర్రపు బండిగా మారింది, ఎందుకో తెలుసా

హోండా నుండి కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్; ఫిబ్రవరి 16న లాంచ్

హోండా విక్రయిస్తున్న హైనెస్ సిబి350 మోడల్‌కి ఎగువన ఈ కొత్త కెఫే రేసర్ బైక్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్కెట్ అంచనా ప్రకారం, దీని ధర సుమారు రూ.2.10 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కొత్త హోండా మోటార్‌సైకిల్‌ను కూడా 'బిగ్‌వింగ్' ప్రీమియం డీలర్‌షిప్ ద్వారా విక్రయించనున్నారు.

హోండా నుండి కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్; ఫిబ్రవరి 16న లాంచ్

హోండా నుండి వస్తున్న ఈ కొత్త మోటార్‌సైకిల్‌కు సంబంధించి ప్రస్తుతానికి ఈ టీజర్ ఫొటో మినహా వేరే ఏ ఇతర సమాచారం లేకపోయినప్పటికీ, ఈ ఫొటోను బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది కెఫే రేసర్ స్టైల్ మోడల్ అని చెప్పొచ్చు. హైనెస్ సిబి350లో ఉపయోగించిన ఇంజన్‌నే ఇందులోనూ ఉపయోగించవచ్చు.

MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

హోండా నుండి కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్; ఫిబ్రవరి 16న లాంచ్

హోండా హైనెస్ సిబి350 మోటార్‌సైకిల్‌లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 21 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది. కొత్త హోండా బైక్‌లోని ఇంజన్ కూడా ఇదేరకమైన పనితీరును కలిగి ఉంటుందని అంచనా.

హోండా నుండి కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్; ఫిబ్రవరి 16న లాంచ్

హోండా విడుదల చేసిన ఈ టీజర్‌లో బైక్ వెనుక వైపు సగం డిజైన్‌ను వెల్లడి చేసింది. ఇందులో సన్నటి ఎల్ఈడి టెయిల్ లైట్ మరియు టర్న్ ఇండికేటర్స్, క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన సస్పెన్షన్, ఎత్తుగా ఉండే బ్లాక్ కలర్ సైలెన్సర్, సింగిల్ పీస్ సీట్ మరియు వెడల్పాటి వెనుక టైర్ వంటి వివరాలను గమనించవచ్చు.

MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

హోండా నుండి కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్; ఫిబ్రవరి 16న లాంచ్

జపనీస్ బ్రాండ్ నుండి కొత్తగా వస్తున్న ఈ కొత్త మోటార్‌సైకిల్ సిబి హైనెస్ 350 మోడల్ మాదిరిగానే మంచి సక్సెస్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోండా సిబి హైనెస్ 350 మార్కెట్లో విడుదలైన కొద్ది రోజుల్లోనే మంచి బ్రాండ్ ఇమేజ్‌ను సంపాధించుకుంది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన కేవలం 3 నెలల్లోనే 10,000 మందికి పైగా కస్టమర్లకు చేరువయ్యింది.

హోండా నుండి కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్; ఫిబ్రవరి 16న లాంచ్

హోండా సిబి హైనెస్ 350 ఈ విభాగంలో నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350 మరియు మీటియోర్ 350 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. అంతేకాకుండా, 300సిసి సెగ్మెంట్‌లో లభించే ఇతర మోటార్‌సైకిళ్లతో పోలిస్తే, ఇందులోని బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు కూడా లభిస్తాయి.

MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

Most Read Articles

English summary
Honda Two-wheelers To Launch New Cafe Racer Motorcycle On 16th February, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X