ఆగస్ట్ 19న హోండా నుండి రానున్న ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ 'ఎన్ఎక్స్200' !

హోండా 2 వీలర్స్ ఇండియా గతంలో 'హోండా ఎన్ఎక్స్200' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. కాగా, ఇప్పుడు కంపెనీ ఓ సరికొత్త మోటార్‌సైకిల్‌ను ఆగస్ట్ 19, 2021వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఆగస్ట్ 19న హోండా నుండి రానున్న ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ 'ఎన్ఎక్స్200' !

ఈ మేరకు హోండా ఎన్ఎక్స్200 బైక్‌కి సంబంధించి కంపెనీ ఓ టీజర్ వీడియోని కూడా రిలీజ్ చేసింది. హోండా ఎన్ఎక్స్200 ఈ జపనీస్ బ్రాండ్ నుండి రానున్న ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్‌గా ఉంటుంది.

ఆగస్ట్ 19న హోండా నుండి రానున్న ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ 'ఎన్ఎక్స్200' !

హోండా ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న హార్నెట్ 2.0 మోటార్‌సైకిల్ ఆధారంగా ఈ సరసమైన అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో అనేక భాగాలు ఒకేలా ఉండే అవకాశం ఉంది.

ఆగస్ట్ 19న హోండా నుండి రానున్న ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ 'ఎన్ఎక్స్200' !

ఈ టీజర్‌లో కంపెనీ తమ కొత్త మోటార్‌సైకిల్‌కు సంబంధించి ఎక్కువ సమాచారాన్ని పంచుకోలేదు కానీ, ఈ బైక్‌ను హోండా ఎన్ఎక్స్200 అని పిలిచే అవకాశం ఉంది. ఈ టీజర్ వీడియోలో బైక్ యొక్క హెడ్‌ల్యాంప్ యూనిట్, హ్యాండిల్ బార్ నకల్ గార్డ్స్‌పై అమర్చిన టర్న్ ఇండికేటర్స్, సైడ్ స్టాండ్ వంటి విషయాలను మాత్రమే కంపెనీ హైలైట్ చేసింది.

ఆగస్ట్ 19న హోండా నుండి రానున్న ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ 'ఎన్ఎక్స్200' !

హోండా ఎన్ఎక్స్200 బైక్‌లోని హెడ్‌లైట్ చూడటానికి హార్నెట్ 2.0 లోని ఎల్ఈడి యూనిట్‌తో సమానంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్నిబట్టి చూస్తుంటే, ఇది హార్నెట్ 2.0 బైక్ యొక్క నేక్డ్ మోటార్‌సైకిల్‌గా ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ కొత్త బైక్‌లో హెడ్‌ల్యాంప్ ఫెయిరింగ్‌పై అమర్చబడి ఉంది.

ఇంజన్ విషయానికి వస్తే, హార్నెట్ 2.0లో ఉపయోగించిన ఇంజన్‌నే ఈ కొత్త బైక్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇందులోని 184.5 సీసీ 2-వాల్వ్, ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 17.26 పిఎస్ పవర్‌ను మరియు 16.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఆగస్ట్ 19న హోండా నుండి రానున్న ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ 'ఎన్ఎక్స్200' !

అంతేకాకుండా, ఈ ఎంట్రీ లెవల్ ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, సీట్ హైట్, వెడల్పాటి హ్యాండిల్‌బార్, ఎల్ఈడి లైటింగ్, సింగిల్-ఛానల్ ఏబిఎస్ మరియు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను ఆశించవచ్చు.

ఆగస్ట్ 19న హోండా నుండి రానున్న ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ 'ఎన్ఎక్స్200' !

మెరుగైన ఆఫ్-రోడ్ రైడింగ్ సామర్థ్యం కోసం ఈ కొత్త హోండా ఎన్ఎక్స్200 మోటార్‌సైకిల్‌లో బెటర్ రోడ్ గ్రిప్ కోసం నాబీ ఆఫ్-రోడ్ టైర్లను కూడా ఉపయోగించే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ మోటార్‌సైకిల్ ధర సుమారు రూ.1.30 లక్షల నుండి రూ.1.80 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

ఆగస్ట్ 19న హోండా నుండి రానున్న ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ 'ఎన్ఎక్స్200' !

కొత్త 2021 హోండా గోల్డ్‌వింగ్ విడుదల

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ గడచిన జూన్ నెలలో తమ బిఎస్6 వెర్షన్ 2021 మోడల్ హోండా గోల్డ్‌వింగ్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ బైక్ ధర రూ.37.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. - హోండా గోల్డ్‌వింగ్ బైక్‌కి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Honda To Launch New Entry Level Adventure Bike In India On August 19, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X