Just In
- 31 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
- 17 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
Don't Miss
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- News
తుని ఘటనలో ముద్రగడకు రైల్వేకోర్టు సమన్లు- ఇతర నిందితులకూ- రాష్ట్రం వదిలేసినా
- Sports
'అనుకోకుండా క్రికెటర్ అయ్యా.. టీమిండియా జెర్సీ ధరిస్తానని అసలు ఊహించలేదు'
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దక్షిణ భారతదేశంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన హోండా టూవీలర్స్
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) భారతదేశంలో కార్యకాలాపాలు ప్రారంభించి 20 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో, దక్షిణ భారతదేశం (సౌత్ ఇండియా) తమకెంతో బలమైన మార్కెట్‌గా అవతరించిందని కంపెనీ పేర్కొంది. గత 2001 నుండి ఇప్పటి వరకూ దక్షిణ భారతదేశంలో 1.5 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.

అమ్మకాల పరంగా, హోండా దేశంలోని దక్షిణ ప్రాంతంలో నంబర్ వన్ టూవీలర్ బ్రాండ్‌గా కొనసాగుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి మరియు అండమాన్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

దక్షిణ భారతదేశంలో 1.5 కోట్ల అమ్మకాల మైలురాయిని సాధించడానికి కంపెనీకి 20 సంవత్సరాలు పట్టిందని హోండా టూ-వీలర్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిలో మొదటి 75 లక్షల అమ్మకాలు సాధించడానికి 15 సంవత్సరాలు పట్టిందని (2001 - 2016) హోండా తెలిపింది.

కాగా, తాజా 75 లక్షల అమ్మకాలను కేవలం 5 సంవత్సరాల్లోనే (2017 - 2021) సాధించగలిగామని, ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే దక్షిణ ప్రాంతంలో హోండా ఉత్పత్తుల అమ్మకాలు 3 రెట్లు వేగంగా పెరుగుదలను నమోదు చేశాయని కంపెనీ పేర్కొంది.

దేశంలో హోండా బ్రాండ్ మొత్తం అమ్మకాలకు దక్షిణ భారతదేశపు మార్కెట్లు అతిపెద్ద మార్కెట్‌గా అవతరించాయని, ఈ మార్కెట్లలో హోండా ఆక్టివా మరియు డియో స్కూటర్ మోడళ్లు అత్యధిక డిమాండ్‌ను కలిగి ఉన్నాయని హెచ్ఎమ్ఎస్ఐ ప్రకటించింది.

హోండా బ్రాండ్‌కు ఈ మార్కెట్లలో దేశీయ బైక్ మరియు స్కూటర్ లైనప్‌తో పాటు, ప్రీమియం (బిగ్‌వింగ్) డీలర్‌షిప్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో హోండా బిగ్‌వింగ్ టాప్‌లైన్ షోరూమ్‌ను మరియు 5 బిగ్‌వింగ్ షోరూమ్‌లను నిర్వహిస్తోంది. ఇవి దేశంలో 300 సిసి - 1800 సిసి మధ్యలో ఉన్న ప్రీమియం ద్విచక్ర వాహనాలను ప్రత్యేకంగా విక్రయిస్తున్నాయి.

హోండా టూవీలర్స్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ యాక్టివా స్కూటర్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హోండా యాక్టివా 6జి స్కూటర్ కొనుగోలుపై భారీ ఆఫర్లను మరియు 100 శాతం ఫైనాన్స్ ఆప్షన్‌ను అందిస్తోంది.

అంతేకాకుండా, హోండా ఇప్పుడు ఈ స్కూటర్‌ను అతి తక్కువ డౌన్ పేమెంట్ వద్ద కేవలం రూ.2,499 లకే అందిస్తోంది. యాక్టివా 6 జి కొనుగోలు చేసే వినియోగదారులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఈఎమ్ఐ ద్వారా చెల్లింపులు చేస్తే, కంపెనీ రూ.5,000 వరకూ క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.