Hot Wheels ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్; ఇది చాలా స్పెషల్.. ఎందుకంటే?

ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం సైకిల్స్ నుంచి విమానాల దాకా దాదాపు అన్ని కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ Hot Wheels (హాట్ వీల్స్) కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించింది. Hot Wheels కంపెనీ ఇప్పుడు మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Hot Wheels ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్; ఇది చాలా స్పెషల్.. ఎందుకంటే?

Hot Wheels కంపెనీ అనేది ప్రముఖ ఆటోమొబైల్ బొమ్మల తయారీ కంపెనీ. కానీ ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి శ్రీకారం చుట్టింది. దీని కోసం, కంపెనీ అమెరికన్ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీదారు Super73 తో చేతులు కలిపింది. ఫ్లాగ్‌షిప్ మోడల్ Super73-RX యొక్క రియర్ లైఫ్ మోడల్ చేయడానికి కంపెనీ ఈ భాగస్వామ్యాన్ని చేసింది.

Hot Wheels ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్; ఇది చాలా స్పెషల్.. ఎందుకంటే?

Hot Wheels X Super73-RX ఇప్పుడు కేవలం 24 యూనిట్ల ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ మాత్రమే తయారుచేసింది. అయితే ప్రస్తుతం ఈ 24 యూనిట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధరను US $ 5,000 వద్ద నిర్ణయించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 3.71 లక్షలు.

Hot Wheels ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్; ఇది చాలా స్పెషల్.. ఎందుకంటే?

ఈ కొత్త Hot Wheels ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ మంచి డిజైన్ మరియు మంచి స్టైల్ లో ఉంటుంది. ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. Hot Wheels X Super73-RX మోటార్ సైకిల్ కొత్త లైవరీని పొందుతుంది, ఇది బ్లూ మరియు ఆరెంజ్ ట్యాంకులపై Hot Wheels బ్రాండింగ్‌తో పాటు ఫ్రేమ్‌పై అదే రంగు చారలను కలిగి ఉంటుంది.

Hot Wheels ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్; ఇది చాలా స్పెషల్.. ఎందుకంటే?

ఈ మోటార్ సైకిల్ స్పెషల్ కలర్ స్కీమ్ బ్లాక్ కలర్ ప్యానెల్స్‌తో జత చేయబడింది. ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ Hot Wheels బ్రాండ్ లోగోను కలిగి ఉన్న హ్యాండిల్‌బార్‌లో ఫోమ్ మరియు సీటును పొందుతుంది. బైక్ యొక్క ఆల్-బ్లాక్ థీమ్‌తో కొనసాగింపు కోసం, కంపెనీ బ్యాటరీ ట్యాంక్ ప్యాడ్, చైన్ మరియు ఫ్రేమ్ మధ్యలో ఉన్న పెద్ద స్టెయిన్‌లెస్ స్టీల్ ప్యానెల్‌ను బ్లాక్ చేసింది.

Hot Wheels ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్; ఇది చాలా స్పెషల్.. ఎందుకంటే?

కొత్త Hot Wheels X Super73-RX మోటార్ సైకిల్ యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 960-వాట్-హవర్ బ్యాటరీని కలిగి ఉండి, దాని వెనుక చక్రంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్‌కు శక్తినిస్తుంది. దీనిలోని 2 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 2.7 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది.

Hot Wheels ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్; ఇది చాలా స్పెషల్.. ఎందుకంటే?

ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 32 కిలోమీటర్ల వేగంతో 65 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ బైక్ ని రైడర్ ఎకో పెడల్ అసిస్ట్ మోడ్‌లో ఉపయోగిస్తే, ఇది 120 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది. Hot Wheels X Super73-RX బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు.

Hot Wheels ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్; ఇది చాలా స్పెషల్.. ఎందుకంటే?

Hot Wheels X Super73-RX బైక్ యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది 5-ఆంపియర్ ఛార్జర్‌తో బ్యాటరీని 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3-4 గంటలు పడుతుంది. అదేవిధంగా 3-ఆంపియర్ ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేయడానికి పట్టే సమయం 6 గంటల నుంచి 7 గంటలు. ఈ బ్యాటరీ ప్యాక్ ఉన్న కొత్త Hot Wheels X Super73-RX బైక్ బరువు 36 కేజీలు మాత్రమే అని కంపెనీ నిర్దారించింది.

ఈ కొత్త Hot Wheels X Super73-RX బైక్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు ఉంటాయి. కావున బైక్ రైడర్లకు చాల అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలా త్వరగా ఈ కొత్త బైక్ అమ్ముడయ్యాయి.

Hot Wheels ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్; ఇది చాలా స్పెషల్.. ఎందుకంటే?

ఇక రానున్న కాలంలో డీజిల్ మరియు పెట్రోల్ వాహనాల విక్రయాలు బాగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలామంది వినియోగదారులు ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను వాడటానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. రానున్న కాలంలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు కొన్ని కంపెనీలు ఇప్పటికే స్పష్టం చేశాయి.ఏది ఏమైనా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన శకం ప్రారంభమయిపోయింది.

More from DriveSpark

Article Published On: Monday, August 23, 2021, 12:41 [IST]
English summary
Hot wheels electric motorcycle debuts range upto 120 kms details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+