ఓలా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేస్తారు? ఆన్‌లైన్ ద్వారానా లేక డీలర్‌షిప్ ద్వారానా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారత మార్కెట్‌లో భారీ హైప్ నెలకొంది. ఈ స్కూటర్ ఫీచర్ల గురించి కంపెనీ ఒక్కొక్కటిగా వివరాలను వెల్లడిస్తూ వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించబడ్డాయి. కేవలం రూ.499 లకే కంపెనీ బుకింగ్స్‌ను స్వీకరిస్తోంది.

ఓలా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేస్తారు? ఆన్‌లైన్ ద్వారానా లేక డీలర్‌షిప్ ద్వారానా?

తాజాగా, ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తమ స్కూటర్ డెలివరీల గురించి కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా డెలివరీ పొందాలనుకుంటున్నారని ఆయన ప్రజలను కోరారు. ఇందుకోసం ట్విట్టర్‌లో ఆయన పోల్ కూడా నిర్వహించారు. ఇందులో ఆన్‌లైన్, డీలర్‌షిప్ అనే రెండు ఆప్షన్లను ఇచ్చారు.

ఓలా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేస్తారు? ఆన్‌లైన్ ద్వారానా లేక డీలర్‌షిప్ ద్వారానా?

ఈ పోల్‌కి వచ్చిన స్పందనను గమనించినట్లయితే, 60 శాతం మంది కస్టమర్లు తాము ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఆన్‌లైన్ ద్వారా డెలివరీ పొందాలని కోరుకోగా, 40 శాతం మంది డీలర్‌షిప్‌ల ద్వారా డెలివరీ కావాలని వోట్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్‌లైన్ మరియు డీలర్‌షిప్స్ రెండింటి ద్వారా డెలివరీ అవుతుందని తెలుస్తోంది.

ఓలా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేస్తారు? ఆన్‌లైన్ ద్వారానా లేక డీలర్‌షిప్ ద్వారానా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీపై ట్విట్టర్‌లో ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో, ఆన్‌లైన్ ద్వారా స్కూటర్లను డెలివరీ చేయటం మంచిదని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, డీలర్‌షిప్‌ను సందర్శించి స్కూటర్‌ను నేరుగా చూడకుండా, సర్వీస్ వివరాలు తెలియకుండా డెలివరీ తీసుకోవటం ఎలా అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఓలా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేస్తారు? ఆన్‌లైన్ ద్వారానా లేక డీలర్‌షిప్ ద్వారానా?

డీలర్‌షిప్ ద్వారా డెలివరీ తీసుకోవడానికి ఇష్టపడే కస్టమర్లు తాము స్కూటర్ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్‌ను పొందాలనుకుంటున్నామని, స్కూటర్‌ను డీలర్‌షిప్‌లో పరీక్షించిన తర్వాత డెలివరీ తీసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా, ఈ స్కూటర్ డెలివరీ చిన్న నగరాల్లో అందుబాటులో ఉంటుందా అని కూడా కొందరు ప్రశ్నించారు. మరికొందరు ఏయే నగరాల్లో, డీలర్‌షిప్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయని కూడా ప్రశ్నించారు.

ఓలా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేస్తారు? ఆన్‌లైన్ ద్వారానా లేక డీలర్‌షిప్ ద్వారానా?

ఈ ప్రశ్నలన్నింటినీ ఓలా ఎలక్ట్రిక్ త్వరలోనే సమాధానాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ ఇటీవలే అన్ని కలర్ ఆప్షన్లను కూడా వెల్లడించింది. ఇందులో 10 ఆకర్షణీయమైన రంగులను ఓలా వెల్లడి చేసింది. ఈ స్కూటర్ కోసం బుకింగ్‌లు ప్రారంభించిన 24 గంటల్లోనే కంపెనీ లక్ష యూనిట్లకు పైగా ఆర్డర్లను అందుకుంది.

ఓలా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేస్తారు? ఆన్‌లైన్ ద్వారానా లేక డీలర్‌షిప్ ద్వారానా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై 100-150 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని అంచనా. దీని గరిష్ట వేగం గంటకు 90 కిమీ వరకు ఉంటుందని సమాచారం. సూపర్ ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 నుండి 2.5 గంటల సమయం పడుతుంది. ఈ స్పెసిఫికేషన్‌తో, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగం యొక్క విస్తృత శ్రేణిలో చేరే అవకాశం ఉంది.

ఓలా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేస్తారు? ఆన్‌లైన్ ద్వారానా లేక డీలర్‌షిప్ ద్వారానా?

ఈ స్కూటర్ హోమ్ ఛార్జర్‌తో వస్తుంది, దీనిని సాధారణ వాల్ సాకెట్‌లోకి ప్లగ్ చేయడం ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లతో కూడా పోటీపడుతుంది.

ఓలా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేస్తారు? ఆన్‌లైన్ ద్వారానా లేక డీలర్‌షిప్ ద్వారానా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక హైటెక్ ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో డ్యూయెల్ పాడ్ ఎల్ఈడి హెడ్‌లైట్, కలర్ ఎల్‌సిడి డిస్‌ప్లే, క్లౌడ్ కనెక్టివిటీ, నావిగేషన్ టెక్నాలజీ, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ మరియు అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

ఓలా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేస్తారు? ఆన్‌లైన్ ద్వారానా లేక డీలర్‌షిప్ ద్వారానా?

ఈ మేడ్ ఇన్ ఇండియా స్కూటర్‌ను భారతదేశంలో మాత్రమే కాకుండా యూరప్, యుకె, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర చాలా పోటీగా ఉంటుందని, ఇది మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీని ఇస్తుందని ఓలా గతంలో తెలిపింది.

Most Read Articles

English summary
How Do You Want To Buy Your Ola Scooter Online Or Through Dealership? Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X