ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ గైడ్..

యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలోనే మార్కెట్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో, ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లను స్వీకరించడం కూడా ప్రారంభించింది. కేవలం రూ.499 అడ్వాన్స్ చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ గైడ్..

ప్రస్తుతానికి ఓలా సంస్థకు దేశవ్యాప్తంగా ఎలాంటి డీలర్‌షిప్

కేంద్రాలు లేవు. మరి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవటం ఎలా? అనే సందేహం మీకు రావచ్చు. ఆసక్తిగల వినియోగదారులు ఓలా ఎలక్ట్రిక్ యొక్క అధికారిక వెబ్‌సైట్ (https://olaelectric.com/)ను సందర్శించి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం రండి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ గైడ్..

1. పైన తెలిపినట్లుగా ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు, అక్కడ కుడిచేతి వైపు 'Reserve for ₹499' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మరొక విండో ఓపెన్ అవుతుంది. అందులో ఆసక్తికలిగిన వారు తమ మొబైల్ నెంబరును నమోదు చేయాలి. అనంతరం వారి మొబైల్‌కు ఒక OTP పంపించబడుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ గైడ్..

ఇలా వచ్చిన OTPని ధృవీకరించిన తర్వాత, స్కూటర్ బుకింగ్ కోసం లాగిన్ కావచ్చు. లాగిన్ అయిన తరువాత, వినియోగదారులు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, యుపిఐ, ఇ-వాలెట్ లేదా ఓలామనీ ద్వారా రూ.499 అడ్వాన్సు మొత్తాన్ని చెల్లించి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు ఒకటి కంటే ఎక్కువ ఓలా స్కూటర్లను కూడా బుక్ చేసుకోవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ గైడ్..

2. అంతేకాదు, కస్టమర్లు తమ మనసు మార్చుకుంటే, బుక్ చేసుకున్న ఓలా స్కూటర్‌ను వేరే వ్యక్తి పేరిట బదిలీ కూడా చేయవచ్చు. ఇందుకోసం కోసం కస్టమర్ ఓలా సంస్థ అభ్యర్థించాల్సి ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేయడానికి ఎలాంటి పత్రాలు అవసరం లేదు. ధృవీకరించబడిన మొబైల్ నెంబర్ మాత్రమే సరిపోతుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ గైడ్..

3. ఇలా బుక్ చేసుకున్న స్కూటర్‌ను కస్టమర్ రద్దు చేయాలనుకుంటే, వారు ఎప్పుడైనా తమ బుకింగ్‌ను రద్దు చేసుకోవచ్చు లేదా సవరించుకోవచ్చు. ఇలా రద్దు చేసుకున్న వారికి కంపెనీ బుకింగ్ మొత్తం పూర్తిగా తిరిగి చెల్లిస్తుంది. బుకింగ్ రద్దు చేసిన తరువాత, వినియోగదారులకు 7 నుండి 10 పని దినాలలోపు తమ డబ్బు తిరిగి లభిస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ గైడ్..

4. కొనుగోలుదారులు తరువాత కావాలనుకుంటే, తమ ఓలా స్కూటర్ యొక్క రంగు మరియు వేరియంట్ వివరాలను మార్చుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ పూర్తయిన తర్వాత, ఆర్డర్ ఐడి మరియు ఇతర వివరాలను కంపెనీ వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఎస్ఎమ్ఎస్ ద్వారా లేదా రిజిస్టర్ చేసుకున్న ఇ-మెయిల్ ద్వారా పంపుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ గైడ్..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ ప్రారంభమైన కొంత సమాయానికే ఆ సంస్థ యొక్క వెబ్‌సైట్‌లో సమస్యలు తలెత్తాయి. ఫలితంగా, కొందరు తమ స్కూటర్‌ను బుక్ చేసుకోలేకపోయారు. ఊహించినదాని కంటే ఎక్కువ సంఖ్యలో ఓలా స్కూటర్ కోసం కస్టమర్లు వెబ్‌సైట్‌ను సందర్శించడంతో కొంత సమయం పాటు వెబ్‌సైట్ సర్వర్లు పనిచేయలేదు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ గైడ్..

అయితే, కంపెనీ ఇప్పుడు ఆ సమస్యలను సరిచేసింది. ఈ సంఘటనపై ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్ మరియు గ్రూప్ సిఈఓ భవీష్ అగర్వాల్ ట్వీట్ చేస్తూ, "ప్రారంభంలో సమస్యలు ఎదుర్కొన్నవారు మమ్మల్ని క్షమించండి! మేము ఈ అనూహ్యమైన డిమాండ్‌ను ఊహించలేదు లేదా వెబ్‌సైట్‌లో తగినంత స్కేలబిలిటీని ప్లాన్ చేయలేదు, కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది" అని పేర్కొన్నారు.

Most Read Articles

English summary
How To Book A Ola Electric Scooter: Step By Step Booking Process. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X