ఒక్క ఛార్జ్‌తో 40 కి.మీ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్: రూ. 27,000 మాత్రమే

ప్రపంచం అభివృద్ధి వైపు చాలా వేగంగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రతి రోజు ప్రపంచంలో ఏదో ఒక మూల కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ Huawei ఒక కొత్త ఎలక్ట్రిక్ షూటర్ విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒక్క ఛార్జ్‌తో 40 కిమీ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్: రూ. 27,000 మాత్రమే

Huawei కంపెనీ మార్కెట్లో హార్మొనీ OS మద్దతుతో LQI స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ అధికారికంగా విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 375 డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 27,000. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు మరియు వెనుక 9 ఇంచెస్ ఆటోమోటివ్-గ్రేడ్ హై-ఎలాస్టిక్ వాక్యూమ్ ఎక్స్ప్లోషన్-ప్రూఫ్ టైర్‌లతో అమర్చబడి ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 40 కిమీ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్: రూ. 27,000 మాత్రమే

Huawei కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 630 వాట్ పవర్ అవుట్‌పుట్ ఇవ్వగల 350 వాట్ హై-పవర్ మోటార్‌ను అమర్చారు. ఇది IPX7 గ్రేడ్ వాటర్‌ప్రూఫ్ 10.4 Ah టెర్నరీ లిథియం బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జింగ్‌తో 40 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 75 కిలోల బరువును కూడా సులభంగా మోయగలదు. 75 కేజీల బరువుతో ఈ స్కూటర్ గరిష్టంగా 25 కిమీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. అంతే కాకూండా రోడ్డుపై ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క విజిబిలిటీని పెంచడానికి, దాని చుట్టూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయబడ్డాయి. అంతే కాకుండా దీని వెనుక భాగంలో రెడ్ కలర్ ఎల్ఈడీ లైట్ ఇవ్వబడింది. కావున చూడటానికి చాలా సింపుల్ గా మరియు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 40 కిమీ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్: రూ. 27,000 మాత్రమే

కంపెనీ ఈ ఏడాది చివరిలో ఆర్క్‌ఫాక్స్ ఆల్ఫా ఎస్ ఎలక్ట్రిక్ వాహనాల చిన్న బ్యాచ్ ఉత్పత్తి మరియు డెలివరీని ప్రారంభిస్తామని ఇటీవల ప్రకటించింది. రాష్ట్ర నియంత్రణలో ఉన్న ఆటోమేకర్ BAIC గ్రూప్ యొక్క యూనిట్ భాగస్వామ్యంతో Alpha S అభివృద్ధి చేయబడింది. ఇది వినియోగదారులకు తక్కువ దూరాలకు ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 40 కిమీ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్: రూ. 27,000 మాత్రమే

Huawei సంస్థ యొక్క 'Huawei ఇన్‌సైడ్' సిస్టమ్‌తో కూడిన కొత్త ఎలక్ట్రిక్ కారుపై కూడా పని చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తిగా ఆటోమేటిక్‌గా ఉంటుంది మరియు డ్రైవ్ చేయడానికి డ్రైవర్ అవసరం ఉండదు. ఇది మొత్తం ఆటోమాటిక్ గా జరుగుతుంది. దీనికి కావాల్సిన టెక్నాలజీలు ఇందులో ఉపయోగించబడి ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే, Huawei కంపెనీ యొక్క డ్రైవర్ లెస్ కార్లు త్వరలో రానున్నట్లు తెలుస్తుంది.

అంతే కాకూండా చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ షియోమీ కంపెనీ గత ఏడాది చైనీస్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ మోపెడ్స్ A1 మరియు A1 ప్రోలను విడుదల చేసింది. ఈ మోపెడ్‌లో రిమూవబుల్ బ్యాటరీ ఉంది, కావున ఈ రిమూవబుల్ బ్యాటరీని తొలగించి ఇంట్లో ఛార్జ్ చేయవచ్చు, కావున ఇది కూడా వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 40 కిమీ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్: రూ. 27,000 మాత్రమే

చైనీస్ మార్కెట్లో విడుదలైన ఈ షియోమీ యొక్క రెండు మోపెడ్‌లకు ఎల్ఈడీ లైట్లు మరియు TFT కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి వాటిని కలిగి ఉంటాయి. A1 గరిష్టంగా 60 కి.మీల రేంజ్‌ను అందించగలదని Xiaomi పేర్కొంది, అయితే A1 ప్రో ఒక్కసారి ఛార్జ్‌పై 70 కి.మీ. రెండు మోపెడ్‌ల గరిష్ట వేగం గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.

ఒక్క ఛార్జ్‌తో 40 కిమీ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్: రూ. 27,000 మాత్రమే

ప్రస్తుతం, షియోమీ కంపెనీ యొక్క రెండు వేరియంట్లు కూడా కేతాలం చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ ఇక భారతీయ మార్కెట్లో అడుగుపెట్టలేదు. అయితే ఇప్పుడు విడుదలైన ఈ కొత్త Huawei చూడటానికి చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ మంచి పరిధిని అందిస్తుంది, కావున మార్కెట్లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 40 కిమీ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్: రూ. 27,000 మాత్రమే

ప్రపంచ మార్కెట్లో మాత్రమే కాకుండా భారతీయ మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం రోజురోజుకి అమాంతం పెరుగుతున్న ఇంధన ధరలు. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 100 రూపాయలు దాటేశాయి. పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

ఈ కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు, అంతే కాకుండా ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలను అందిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే రానున్న కాలంలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉంటాయి, అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.

Most Read Articles

English summary
Huawei lqi smart electric scooter launched price range features details
Story first published: Saturday, November 13, 2021, 10:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X