భారత్‌లో హస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 125 ఉత్పత్తి ప్రారంభం; త్వరలో లాంచ్!

స్వీడన్‌కి చెందిన టూవీలర్ బ్రాండ్ హస్క్వార్నా మోటార్‌సైకిల్ తమ స్వార్ట్‌పిలెన్ మోటార్‌సైకిల్‌లో రేంజ్‌లో సరికొత్తగా ఓ 125సీసీ మోడల్‌ను గడచిన ఫిబ్రవరి నెలలో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 125 బైక్‌ను భారతదేశంలోనే ఉత్పత్తి చేయటం ప్రారంభించింది.

భారత్‌లో హస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 125 ఉత్పత్తి ప్రారంభం; త్వరలో లాంచ్!

బజాజ్ ఆటోకి చెందిన చాకన్ ప్లాంట్‌లో హస్క్వార్నా ఈ కొత్త 125సీసీ వేరియంట్ స్వార్ట్‌పిలెన్ బైక్‌ను తయారు చేస్తోంది. ఇక్కడ తయారైన బైక్‌ను ముందుగా యూరప్ మార్కెట్లలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాతి దశల్లో ఇది భారత మార్కెట్లోకి కూడా విడుదల కానుంది.

భారత్‌లో హస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 125 ఉత్పత్తి ప్రారంభం; త్వరలో లాంచ్!

హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 125 బైక్ యొక్క ఇంజన్ మరియు ఫ్రేమ్‌ను కెటిఎమ్ డ్యూక్ 125 మోడల్ నుండి గ్రహించారు. ఇక ఈ బైక్ ఇంజన్ విషయానికొస్తే, ఇందులో 125సిసి లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 14.3 బిహెచ్‌పి శక్తిని మరియు 12 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:అక్కడ కరోనా లాక్‌డౌన్ మరింత పొడిగింపు.. ఈ సర్వీసులకు మాత్రం మినహాయింపు

భారత్‌లో హస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 125 ఉత్పత్తి ప్రారంభం; త్వరలో లాంచ్!

హస్క్వార్నా నుండి రానున్న ఈ కొత్త స్వార్ట్‌పిలెన్ 125 డిజైన్ పరంగా చూడటానికి దాని బిగ్ బ్రదర్ స్వార్ట్‌పిలెన్ 250 మోడల్ మాదిరిగానే ఉంటుంది. హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 మోడల్ ఇప్పటికే భారత మార్కెట్లో అమ్మడవుతోంది. ఈ మోటార్‌సైకిల్‌లో ఎత్తైన హ్యాండిల్ బార్, నాబ్స్‌తో కూడిన టైర్లు మరియు సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంటాయి.

భారత్‌లో హస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 125 ఉత్పత్తి ప్రారంభం; త్వరలో లాంచ్!

అంతేకాకుండా, ఇందులో గుండ్రటి హెడ్‌ల్యాంప్ సెటప్, విలక్షణమైన ఫ్యూయెల్ ట్యాంక్ విభాగం, పొట్టిగా ఉండే వెనుక డిజైన్ మరియు ఫెండర్లు, అలాగే స్వింగార్మ్‌కి మౌంట్ చేయబడి ఉన్న టైర్ హగ్గర్ (రియర్ మడ్ ఫ్లాప్), ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్, గుండ్రటి ఎల్‌సిడి కన్సోల్ మరియు బాష్ నుండి గ్రహించిన ఏబిఎస్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:నదిలో చెత్తవేసిన మహిళకు సరైన గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఇంతకీ ఏం చేసారంటే?

భారత్‌లో హస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 125 ఉత్పత్తి ప్రారంభం; త్వరలో లాంచ్!

స్వార్ట్‌పిలెన్ 250 అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. అయితే, ఈ కొత్త స్వార్ట్‌పిలెన్ 125 మోడల్ మాత్రం స్పోక్ వీల్స్‌తో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌పై సస్పెన్షన్‌ను గమనిస్తే, ముందు వైపు 43 మిమీ ట్రావెల్‌తో కూడిన డబ్ల్యూపి అపెక్స్ ఫోర్కులు మరియు వెనుకవైపు 142 మిమీ ట్రావెల్‌తో కూడిన ప్రీలోడ్-అడ్జస్టబల్ డబ్ల్యూపి అపెక్స్ మోనో షాక్ అబ్జార్వర్ ఉన్నాయి.

భారత్‌లో హస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 125 ఉత్పత్తి ప్రారంభం; త్వరలో లాంచ్!

హస్క్వార్నా 125 మోడల్ కెటిఎమ్ డ్యూక్ 125 మోడల్ ఆధారంగా తయారవుతున్న నేపథ్యంలో, భారత మార్కెట్లో ఈ కొత్త మోటార్‌సైకిల్ ధర కెటిఎమ్ మోడల్ ధర కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది.టాయి. ఈ నేపథ్యంలో, ఈ కొత్త 125సీసీ బైక్ ధర సుమారు రూ.1.25 లక్షల నుండి రూ.1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండొచ్చని అంచనా.

MOST READ:కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

భారత్‌లో హస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 125 ఉత్పత్తి ప్రారంభం; త్వరలో లాంచ్!

కెటిఎమ్ అనుబంధ సంస్థ అయిన హస్క్వార్నా, తమ కొత్త స్వార్ట్‌పిలెన్ 125సీసీ మోటార్‌సైకిల్‌ను డ్యూక్ 125 మోడల్ ఆధారంగా తయారు చేసింది. కెటిఎమ్ డ్యూక్ 125లో ఉపయోగించిన ఇంజన్‌నే ఇందులోనూ ఉపయోగించారు. భారత టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో కెటిఎమ్ బ్రాండ్ మరియు హస్క్వార్నా బ్రాండ్‌ల కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయం తెలిసినదే.

భారత్‌లో హస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 125 ఉత్పత్తి ప్రారంభం; త్వరలో లాంచ్!

ఇదిలా ఉంటే, హస్క్వార్నా భారతదేశం కోసం ఓ సరసమైన 200సిసి బైక్‌ను మరియు ప్రీమియం విభాగంలో ఓ 400సిసి బైక్‌ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు బైక్‌లు భారతదేశంలో టెస్టింగ్ దశలో ఉన్నాయి. మరికొద్ది నెలల్లోనే కంపెనీ వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

MOST READ:పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే

భారత్‌లో హస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 125 ఉత్పత్తి ప్రారంభం; త్వరలో లాంచ్!

హస్క్వార్నా ప్రస్తుతం భారతదేశంలో 250సిసి మోడళ్లను మాత్రమే విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కొత్తగా రానున్న 125సిసి, 200సిసి మరియు 400సిసి మోడళ్లపై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా, ఈ మూడు మోడళ్లతో పాటుగా కంపెనీ గ్లోబల్ మార్కెట్ కోసం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా ప్లాన్ చేస్తోంది.

Most Read Articles

English summary
Husqvarna Svartpilen 125 Production Begins At Bajaj’s Chakan Plant; India Launch Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X