హస్క్వార్నా వెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ; డిజైన్ అద్భుతహః..

స్వీడన్‌కి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ హస్క్వార్నా, ఇటీవలే ఓ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా, ఈ కంపెనీ ఇప్పుడు ఓ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కాన్సెప్ట్‌ను కూడా పరిచయం చేసింది. ఈ రెండు వాహనాలతో హస్క్వార్నా త్వరలోనే ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించనుంది.

హస్క్వార్నా వెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ; డిజైన్ అద్భుతహః..

వెక్టర్ అనే పేరుతో హస్క్వార్నా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్‌ను తయారు చేసింది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూల మోడల్ అని హస్క్వార్నా పేర్కొంది. ఇది భవిష్యత్తులో వ్యక్తిగత పట్టణ రవాణాకు అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. హస్క్వార్నా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్‌కు సంబంధించి ప్రస్తుతం కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ దశలోనే ఉంది.

హస్క్వార్నా వెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ; డిజైన్ అద్భుతహః..

హస్క్వార్నా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో కంపెనీ దాని బ్యాటరీ గురించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించకపోయినప్పటికీ, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 95 కిలోమీటర్ల రేంజ్ మరియు గంటకు 45 కిమీ వేగంతో తీసుకువస్తామని కంపెనీ తెలిపింది. మరి ప్రొడక్షన్ వెర్షన్‌లో ఈ గణాంకాలు మారుతాయో లేదో చూడాలి.

MOST READ:మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

హస్క్వార్నా వెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ; డిజైన్ అద్భుతహః..

వెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హస్క్వార్నా యొక్క ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాంగ్వేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. పెప్పీగా కనిపించే ఈ స్కూటర్ ముందు భాగంలో గుండ్రటి ఎల్ఈడి లైట్ మరియు అందులోనే అమర్చిన డేటైమ్ ఎల్ఈడి రన్నింగ్ లైట్ ఉంటుంది. ఈ హైడ్‌లైట్ మధ్యలో బ్లాక్ కలర్ బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది.

హస్క్వార్నా వెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ; డిజైన్ అద్భుతహః..

హస్క్వార్నా వెక్టర్ కాన్సెప్ట్ ఈ కంపెనీ నుండి రానున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కానుంది. ప్రత్యేకించి పట్టణ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని రూపొందించింది. ఇది ప్రజల జీవనశైలికి సరిపోయే కాంపాక్ట్, స్టైలిష్ మరియు సమర్థవంతమైన వ్యక్తిగత రవాణా పరిష్కారంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇందులో పొడవైన మరియు వెడల్పాటి సీట్ ఉంటుంది. ఇది రైడర్ మరియు పిలియన్ రైడర్లకు మంచి సౌకర్యాన్ని ఇస్తుంది.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్.. కారణం ఇదే

హస్క్వార్నా వెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ; డిజైన్ అద్భుతహః..

ఈ స్కూటర్‌లోని మెకానికల్స్‌ను గమనిస్తే, దీని ముందు మరియు వెనుక భాగంలో సింగిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుంది. ఇది మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ మాదిరిగానే పనిచేస్తుంది. అయితే, ఈ సస్పెన్షన్ మాత్రం సెంటర్‌లో కాకుండా వీల్‌కు పక్కన అమర్చబడి ఉంటుంది. ఇందులో ఇరువైపులా మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించారు. బ్రేకింగ్ విషాయనికి వస్తే, ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

హస్క్వార్నా వెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ; డిజైన్ అద్భుతహః..

భారతదేశంలో హస్క్వార్నా కార్యకలాపాలను బజాజ్ ఆటో నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉపయోగించే అనేక భాగాలను ఈ హస్క్వార్నా వెక్టర్ స్కూటర్‌లోనూ ఉపయోగించే అవకాశం ఉంది. బజాజ్ చేతక్‌లో స్వాప్ చేయగల బ్యాటరీ లేదు, ఇది 95 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

MOST READ:కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

హస్క్వార్నా వెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ; డిజైన్ అద్భుతహః..

హస్క్వార్నా వెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ బజాజ్ ఆటో తమ చాకన్ ప్లాంట్‌లోనే తయారు చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని ప్రారంభం కావచ్చని సమాచారం. బజాజ్ ప్రస్తుతం తమ సబ్-బ్రాండ్స్ అయిన కెటిఎమ్, హస్క్వార్నా, చేతక్ ఈవీ బ్రాండ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో నిమగ్నమై ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఏటా 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి సామర్థ్యం వైపు అడుగులు వేస్తోంది.

హస్క్వార్నా వెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ; డిజైన్ అద్భుతహః..

హస్క్వార్నా బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ స్వార్ట్‌పిలెన్ మోటార్‌సైకిల్‌లో రేంజ్‌లో సరికొత్తగా ఓ 125సీసీ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఇప్పటికే తమ కొత్త హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 125 బైక్‌ను భారతదేశంలోనే ఉత్పత్తి చేయటం ప్రారంభించింది.

MOST READ:కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

హస్క్వార్నా వెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ; డిజైన్ అద్భుతహః..

హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 125 బైక్ యొక్క ఇంజన్ మరియు ఫ్రేమ్‌ను కెటిఎమ్ డ్యూక్ 125 మోడల్ నుండి గ్రహించారు. ఇక ఈ బైక్ ఇంజన్ విషయానికొస్తే, ఇందులో 125సిసి లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 14.3 బిహెచ్‌పి శక్తిని మరియు 12 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Husqvarna Unveils Vektorr Electric Scooter Concept, Details. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X