భారత్‌లో అడుగెట్టనున్న కొత్త ఎలక్ట్రిక్ బైక్.. మంచి స్టైలిష్ & మంచి ఫీచర్స్
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన యుగం ఇప్పటికే పరుగులు తీస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దీనిని ద్రుస్తిలో ఉంచుకుని చాలా కంపెనీలు భారతీయ మార్కెట్లో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలు అమాంతం పెరుగుతున్న కారణంగా ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పుడు దేశీయ మార్కెట్లో కోసం ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ (Ignitron Motocorp) ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ పరిచయం చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో సైబోర్గ్ (CYBORG) పేరుతో ఒక బైక్ పరిచయం చేసింది. ఈ విభగంలో కంపెనీ అనేక ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకురాబోతోంది. ప్రస్తుతం కస్టమర్లు కోరుకునే ఫీచర్స్ మరియు పరికరాలను ఇందులో అందించడమే కాకుండా, పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా కొత్త టెక్నాలజీలను ఈ బైక్ లో తీసుకురానుంది.
కంపెనీ సైబోర్గ్ బ్రాండ్ క్రింద అనేక కొత్త బైక్‌లను తీసుకురావడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇవి వినియోగదారులకు ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటాయి. రానున్న కాలంలో బ్యాటరీ టెక్నాలజీ మరియు తయారీ ప్రక్రియను మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషిస్తూనే, సురక్షితమైన బైక్‌లను తయారు చేయడంపై కంపెనీ దృష్టి సారిస్తోంది.
దీని గురించి ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు 'రాఘవ్ కల్రా' మాట్లాడుతూ, మా కొత్త బ్రాండ్ CYBORGతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మోటార్‌బైక్ విభాగంలోకి మా ప్రవేశాన్ని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఎలక్ట్రిక్ మొబిలిటీ రవాణా అనేది భవిష్యత్ లో వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. కావున త్వరలో దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు.
ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ కంపెనీ తన మానేసర్ ప్లాంట్‌లో తయారీ వంటి పనులను ఇప్పటికి ప్రారంభించింది. 2022 మరియు 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్లాంట్‌లో కంపెనీ 40,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సైబోర్గ్ మిడ్ మరియు హై స్పీడ్ సెగ్మెంట్లో మూడు ఉత్పత్తులను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే కంపెనీ తీసుకురానున్న మొదటి మోడల్ క్రూయిజర్ బైక్ యోడా (Yoda). యోడా అనేది భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన క్రూయిజర్ బైక్. కావున భారతదేశంలోని అన్ని రకాల భూభాగాల్లో పరీక్షిస్తోంది. కావున ఇది తప్పకుండా భారతీయ వినియోగదారులకు మన్నికైన బైక్ కానుంది.
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, యోడా అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి 'మేడ్ ఇన్ ఇండియా' ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్. ఎలక్ట్రిక్ బైక్‌ను దాని పూర్తి సామర్థ్యాన్ని పరీక్షించాలనుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఇది రూపొందించబడింది. అంతే కాకూండా దేశీయ మార్కెట్లో ఈ కొత్త బైక్ ను సరసమైన ధరకు అందించడానికి కంపెనీ యోచిస్తోంది. ఈ కొత్త బైక్ మంచి పరిధిని కూడా అందించే విధంగా రూపొందినబడుతుంది. కావున వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతి అందిస్తుంది.
భారతదేశంలో ఉత్తర, దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలలో సేల్స్ మరియు సర్వీస్ నెట్‌వర్క్‌ను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కోసం కూడా భాగస్వామి కానుంది. అంతే కాకూండా ప్రతి 1 కిలోమీటరుకు అందుబాటులో ఉండే బ్యాటరీ ఎక్స్చేంజ్ స్టేషన్లను కూడా కలిగి ఉండటానికి ఆ దిశగా అడుగులు వేస్తోంది.
సైబోర్గ్ యోడా బైక్ కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు వేగంగా ఛార్జ్ చేయగల కాంపాక్ట్ హోమ్ ఛార్జర్ కూడా పొందుతుంది. కావున వాహనదారుల యొక్క సమయం కూడా చాలా వరకు ఆదా అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ త్వరలోనే భారతదేశంలో విడుదలవుతుంది.
ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ CYBORG బ్రాండ్ పేరుతో భారతదేశంలో 2021 లో స్థాపించబడింది. మార్చి 2021లో కంపెనీ భారతదేశంలో ఖచ్చితమైన హై స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌లను అభివృద్ధి చేయడానికి అనుకూల నిర్మాణ వాహనాల్లోకి ప్రవేశించడం ద్వారా ముందుకు వచ్చింది. ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ యొక్క లక్ష్యం భారతదేశంలో సురక్షితమైన మోటార్‌బైక్‌లను తయారు చేయడం.


Click it and Unblock the Notifications








