గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతున్న కారణంగా చాలామంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదలచేస్తున్నాయి. ఇటీవల ఐఐటి ఢిల్లీ ఇంక్యుబేటెడ్ స్టార్టప్, గెలియోస్ మొబిలిటీ హోప్ అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. గెలియోస్ హోప్ ప్రారంభ ధర రూ .46,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

కంపెనీ అందించిన నివేదికల ప్రకారం, ఈ కొత్త హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి కేవలం 20 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ స్కూటర్ యొక్క గరిష్ట వేగం 25 కిలోమీటర్లు వరకు ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

గెలియోస్ మొబిలిటీ హోప్ స్కూటర్ 250-వాట్స్ హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును పోర్టబుల్ లి-అయాన్ బ్యాటరీతో జతచేయబడి ఉంటుంది. అయితే ఇందులో వినియోగదారులు రెండు వేర్వేరు బ్యాటరీ కెపాసిటీ ఆప్సన్స్ కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది.

MOST READ:తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

లోయర్-స్పెక్ పవర్‌ట్రెయిన్ సెటప్ ఒక సరి బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌ చేస్తే, ఇది గరిష్టంగా 50 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో ఉన్న టాప్-స్పెక్ బ్యాటరీ ప్యాక్ గరిష్టంగా 75 కిలోమీటర్ల రైడింగ్ పరిధిని అందిస్తుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

ఈ స్కూటర్‌లో పోర్టబుల్ లి-అయాన్ బ్యాటరీ, సాధారణ సాకెట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. స్కూటర్‌తో పాటు అందించిన ఆన్‌బోర్డ్ పోర్టబుల్ ఛార్జర్‌ను ఉపయోగించి కేవలం నాలుగు గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ పెడల్-అసిస్ట్‌తో కూడా వస్తుంది, దీనిని మెరుగైన రైడింగ్ రేంజ్ కోసం ఉపయోగించవచ్చు. పార్కింగ్ సహాయం కోసం వాహనంలో స్పెషల్ రివర్స్ మోడ్ ఉంది.

MOST READ:ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో రెండు చివర్లలో టెలిస్కోపిక్ యూనిట్లు ఉన్నాయి. ఇరువైపులా డ్రమ్ బ్రేక్ సెటప్ ద్వారా బ్రేకింగ్ సిస్టం ఉంటుంది. స్కూటర్‌లో ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్‌తో పాటు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.

గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

ఈ స్కూటర్ వాహనదారునికి నగర పరిస్థితుల్లో రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఫ్రేమ్‌ బేర్-బోన్స్ డిజైన్ ఉంటుంది. ఇది రైడర్స్ అవసరాన్ని బట్టి లోడ్-మోయడానికి అవసరమైన యాక్ససరీస్ లేదా వెనుక సీటును అటాచ్ చేయడానికి అనుమతిస్తుంది.

MOST READ:మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల జాతర.. రోజుకు రూ. 100 కోట్లు వసూల్

గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్స్ త్వరలో ప్రారంభమవుతాయి. ఈ స్కూటర్ అతి తక్కువ ధర కలిగి ఉండటం వల్ల మరియు డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ అవసరం లేదు కావున మార్కెట్లో ఎక్కువ అమ్మకాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ లో వాహనదారుని అవసరాన్ని బట్టి బ్యాటరీ ప్యాక్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Geliose Hope Electric Moped Launched In India Priced At Rs 46,999. Read in Telugu.
Story first published: Friday, March 26, 2021, 9:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X