2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన బైకులు: వివరాలు

2021 ఇండియా బైక్ వీక్ డిసెంబర్ 4 మరియు 5 వ తేదీలలో మహారాష్ట్రలోని అంబా వ్యాలీలో ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ సమయంలో అక్కడ అనేక ఆధునిక బైక్స్ కనులవిందు చేశాయి. ఈ సందర్భంగా అనేక కొత్త బైక్స్ కూడా విడుదలయ్యాయి. ఇందులో ప్రపంచ మార్కెటు అత్యంత ఆదరణ పొందిన హార్లే-డేవిడ్‌సన్ బ్రాండ్ యొక్క స్పోర్ట్‌స్టర్ ఎస్ విడుదలయింది.

అంతే కాకుండా హోండా కంపెనీ కూడా CB300R BS6 మరియు H'ness CB350 యానివర్సరీ ఎడిషన్ వంటి వాటిని కూడా విడుదల చేసింది. ఈ కొత్త బైక్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన బైకులు: వివరాలు

హోండా హైనెస్ సిబి350 యానివర్సరీ ఎడిషన్ (Honda H'ness CB350 Anniversary Edition):

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) లిమిటెడ్ '2021 ఇండియా బైక్ వీక్'లో హైనెస్ CB350 యొక్క 'యానివర్సరీ ఎడిషన్' విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' ధర రూ. 2.03 లక్షలు (ఎక్స్-షోరూమ్). హోండా హైనెస్ CB350 బైక్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కారణంగా కంపెనీ ఈ యానివర్సరీ ఎడిషన్ విడుదల చేసింది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన బైకులు: వివరాలు

కొత్త హోండా హైనెస్ CB 350 యానివర్సరీ ఎడిషన్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఇగ్నియస్ బ్లాక్ మరియు మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్ కలర్స్. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ మరియు సైడ్ ప్యానెల్‌లపై గోల్డ్ కలర్ లో హోండా మరియు హైనెస్ అనే చిహ్నాలు చూడవచ్చు. ఇవి బైక్ కి మంచి దూకుడు రూపాన్ని అందిస్తాయి.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన బైకులు: వివరాలు

హోండా హైనెస్ సిబి350 బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఫ్రంట్ వీల్‌లో హబ్‌కు బదులుగా రిమ్‌పై డిస్క్ బ్రేక్ అమర్చబడి ఉంటుంది. హోండా హైనెస్ సిబి 350 లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ 20.8 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది. ఇది మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది, అంతే కాకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి కూడా ఈ బైక్ చాలా అనుకూలంగా ఉంటుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన బైకులు: వివరాలు

సాధారణంగా కంపెనీ యొక్క హోండా హైనెస్ సిబి350 బైక్ రూ. 1,92,411 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ DLX మరియు DLX ప్రో అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. హోండా హైనెస్ అనేక కొత్త మరియు ఆకర్షణీయమైన లక్షణాలతో కంపెనీ ప్రారంభించింది, దీని కారణంగా ఇది 350 సిసి శ్రేణిలోని ఇతర బైకుల నుండి చాలా భిన్నంగా అప్డేట్ చేయబడింది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన బైకులు: వివరాలు

హోండా సిబి300ఆర్ బిఎస్6 (Honda CB300R BS6):

'2021 ఇండియా బైక్ వీక్ లో హోండా కంపెనీ యొక్క కొత్త హోండా CB300R బిఎస్ 6 ఆవిష్కరించబడింది. ఈ కొత్త బైక్ ఇప్పుడు అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ మరియు అప్డేటెడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ 2022 జనవరి 22 న ప్రారంభమవుతాయి.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన బైకులు: వివరాలు

హోండా మోటార్ సైకిల్ ఆవిష్కరించిన ఈ కొత్త బైక్ కొత్త BS6 ఇంజన్ తో అప్డేట్ చేయబడింది. ఇది ఈ బైక్ లో అతి పెద్ద అప్డేట్ అని చెప్పవచ్చు. కొత్త హోండా CB300R బైక్ 286 సిసి సింగిల్ సిలిండర్ బిఎస్ 6 ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 30.4 బిహెచ్‌పి పవర్ మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 27.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జాతః చేయబడి ఉంటుంది. ఈ బైక్ స్టాండర్డ్‌గా స్లిప్పర్ క్లచ్‌తో డ్యూయల్ ఛానెల్ ABS ఫీచర్‌ను కూడా పొందుతుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన బైకులు: వివరాలు

ప్రస్తుత మోడల్‌లోని ట్రెల్లిస్ ఫ్రేమ్‌ను ఈ కొత్త బైక్‌లో ఉపయోగించారు. ఇది కాకుండా, ముందు వైపున అప్‌సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత మోడల్‌లోని డిస్క్ బ్రేక్‌లను బైక్‌లో ఉపయోగించారు. అయితే, కంపెనీ బైక్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అప్‌డేట్ చేయలేదు. ఇది మునుపటి వలె అదే LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది, దీనిలో బ్లూటూత్ ఫీచర్ లేదు. హోండా సిబి300ఆర్ భారతదేశంలోని కెటిఎమ్ 390 డ్యూక్, బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ మరియు బజాజ్ డామినార్ 400 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన బైకులు: వివరాలు

హార్లే-డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ (Harley-Davidson Sportster S):

2021 ఇండియా బైక్ వీక్ లో అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హార్లే డేవిడ్‌సన్ తమ సరికొత్త స్పోర్ట్‌స్టర్ ఎస్ (Harley-Davidson Sportster S) మోటార్‌సైకిల్ ను విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ కొత్త హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ ధర రూ. 15.51 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన బైకులు: వివరాలు

హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ కు శక్తినిచ్చే ఇంజన్ ఆర్కిటెక్చర్‌ ను కౌంటర్ బ్యాలెన్స్డ్ రివల్యూషన్ మ్యాక్స్ 1250 లిక్విడ్-కూల్డ్ వి-ట్విన్ ఇంజన్‌గా ఉపయోగిస్తుంది. ఇది కంపెనీ ఇటీవల భారతదేశంలో విడుదల చేసిన హార్లే డేవిడ్సన్ యొక్క మొట్టమొదటి ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ పాన్ అమెరికా 1250 అడ్వెంచర్ టూరర్‌ (Pan America 1250 Adventure Tourer) లో కూడా కనిపిస్తుంది. అయితే, ఈ కొత్త స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ లోని 60-డిగ్రీల వి-ట్విన్ ఇంజన్ చిన్న వాల్వ్‌లు మరియు పోర్ట్‌లతో విభిన్నమైన ఇంటర్నల్‌లతో పాటు వివిధ కంబషన్ చాంబర్ మరియు పిస్టన్ ఆకారాలను కలిగి ఉంటుంది.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన బైకులు: వివరాలు

హార్లే డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ కోసం రీట్యూన్ చేయబడిన ఈ ఇంజన్‌కి రివల్యూషన్ మ్యాక్స్ 1250 టి అనే పేరు పెట్టారు మరియు ఈ ఇంజన్ గరిష్టంగా 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 121 బిహెచ్‌పి శక్తిని మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో సున్నితమైన గేర్‌షిఫ్ట్ అనుభూతి కోసం అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్‌ను కూడా అందిస్తున్నారు.

2021 ఇండియా బైక్ వీక్‌లో విడుదలైన బైకులు: వివరాలు

హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ బైక్ లో స్పోర్ట్, రోడ్ మరియు రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రైడర్ ఎంచుకునే విభిన్న రైడింగ్ మోడ్‌లను బట్టి సైక్లింగ్ థ్రోటల్ రెస్పాన్స్, టార్క్ డెలివరీ మరియు ఇంజన్ బ్రేకింగ్‌లు అడ్జస్టబుల్ అవుతాయి. ఈ రైడింగ్ మోడ్‌లు ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఏబిఎస్ సెటప్‌లను కూడా సర్దుబాటు చేస్తాయి. మొత్తానికి ఇది ఆధునిక డిజైన్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
India bike week new bikes launched details
Story first published: Tuesday, December 7, 2021, 11:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X