Triumph Tiger Sport 660 ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ (Triumph) తమ సరికొత్త మిడిల్-వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ టైగర్ స్పోర్ట్ 600 (Tiger Sport 660) ని ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ సరికొత్త ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 అడ్వెంచర్ బైక్ వచ్చే ఏడాది నాటికి భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది.

Triumph Tiger Sport 660 ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ట్రైయంప్ గతంలో ఆవిష్కరించిన ట్రైడెంట్ 660 నేక్డ్ బైక్ యొక్క అడ్వెంచర్ వెర్షన్ గా టైగర్ స్పోర్ట్ 660 ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్, పరికరాలు మరియు ప్లాట్‌ఫామ్ దాదాపుగా ఒకేలా ఉండే అవకాశం ఉంది.

Triumph Tiger Sport 660 ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 అనేది అడ్వెంచర్ స్పోర్ట్స్ టూరింగ్ మోటార్‌సైకిల్, ఇది ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ అడ్వెంచర్ బైక్ మాదిరిగా కాకుండా స్పోర్ట్స్ టూరిజం కోసం ఉద్దేశించి రూపొందిచబడింది. ఈ లేటెస్ట్ ట్రైయంప్ అడ్వెంచర్ బైక్ ఈ విభాగంలో యమహా ట్రేసర్ 7, కవాసకి వర్సెస్ 650, హోండా సిబి500ఎక్స్ మరియు సుజుకి వి-స్టార్మ్ 650 వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

Triumph Tiger Sport 660 ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

టైగర్ స్పోర్ట్ 660 బైక్ ట్రైడెంట్ 660 యొక్క ప్లాట్‌ఫామ్‌ను విస్తరిస్తుంది. ట్రైడెంట్ 660 ఆధారంగా రూపొందినప్పటికీ, ఇదొక పర్‌ఫెక్ట్ టూరింగ్ మెషీన్ అని చెప్పొచ్చు. స్పోర్టివ్ లుక్, హాఫ్ ఫెయిరింగ్, నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్, ఎక్కువ సస్పెన్షన్ ట్రావెల్, హై సీట్, మెరుగైన టూరింగ్ సామర్ధ్యాలు, లగేజ్ కోసం ధృడమైన ఫ్రేమ్ మరియు పిలియన్ రైడర్ సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ వంటి ఫీచర్లు ఈ బైక్ సొంతం.

Triumph Tiger Sport 660 ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

డిజైన్ విశేషాలు

కొత్త ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 బైక్ డిజైన్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఇది ట్రైయంప్ టైగర్ 900 యొక్క పెద్ద వెర్షన్‌తో సమానంగా ఉండదు. ఈ బైక్ ముందు భాగంలో డ్యూయల్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు ఎత్తు సర్దుబాటు చేయగల విండ్‌షీల్డ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

Triumph Tiger Sport 660 ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఈ బైక్ ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని 17 లీటర్లకు పెంచారు. ఇది ట్రైడెంట్ 660 యొక్క 14 లీటర్ల ఇంధన ట్యాంక్ కంటే మెరుగైనది. టైగర్ స్పోర్ట్ 660 కొత్త కాక్‌పిట్ మరియు కొత్త ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందుతుంది. బైక్ యొక్క విశిష్టమైన ఏరోడైనమిక్స్ మరియు మరింత నిటారుగా రైడింగ్ పొజిషన్ వలన గంటల సమయం పాటు ఈ బైక్ నడిపినా అలసట అనిపించదు.

Triumph Tiger Sport 660 ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఈ బైక్ యొక్క ఫీచర్ జాబితాను గమనిస్తే, టైగర్ స్పోర్ట్ 660 లో రోడ్ మరియు రెయిన్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఇంకా ఇందులో మార్చుకోగలిగిన ట్రాక్షన్ కంట్రోల్ మరియు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి: లుసెర్న్ బ్లూ, సఫైర్ బ్లాక్, కరోసి రెడ్ అండ్ గ్రాఫైట్ మరియు గ్రాఫైట్ అండ్ బ్లాక్. ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ టిఎఫ్‌టి డిస్‌ప్లే రూపంలో వస్తుంది మరియు ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. దీని సీటు ఎత్తు 835 మిమీ మరియు బరువు 206 కిలోలుగా ఉంటుంది.

Triumph Tiger Sport 660 ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఇంజన్

ట్రైయంప్ ట్రైడెంట్ 660 నేక్డ్ మోటార్‌సైకిల్ లో ఉపయోగించిన అదే 660 సిసి ఇన్‌లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్‌నే ఈ కొత్త ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 అడ్వెంచర్ బైక్‌లో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ 10,250 ఆర్‌పిఎమ్ వద్ద 79 బిహెచ్ శక్తిని మరియు 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 64 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ట్రైడెంట్ 660 మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు.

Triumph Tiger Sport 660 ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

మెకానికల్స్

ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 పూర్తిగా ఆఫ్-రోడ్ ప్రయోజనాన్ని ఉద్దేశించి రూపొందించిన బైక్ కాదు, ఇదొక అడ్వెంచర్ మోటార్‌సైకిల్ అని ట్రైయంప్ తెలిపింది. కాబట్టి, ట్రైడెంట్ 660 మాదిరిగా కాకుండా ఇది 17 ఇంచ్ వీల్స్ మరియు మిష్లిన్ రోడ్-5 టైర్లతో అందుబాటులో ఉంటుంది. ఇవి అన్ని రకాల రోడ్లపై మంచి గ్రిప్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది.

Triumph Tiger Sport 660 ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ఇందులో ముందు వైపు 150 మిమీ ట్రావెల్‌తో కూడిన ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇవి రెండూ కూడా షోవా బ్రాండ్ నుండి గ్రహించబడ్డాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 310 మిమీ ట్విన్ ఫ్రంట్ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో సింగిల్ పిస్టన్ కాలిపర్ 255 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

Triumph Tiger Sport 660 ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ధర

ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 ముందుగా యూరోపియన్ మార్కెట్లో విడుదల కానుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది నాటికి ఇది భారతదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఇది ట్రైయంప్ టైగర్ సిరీస్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ మోడల్ గా లభ్యమవుతుంది. దీని ధర గురించి ప్రస్తుతానికి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, మా అంచనా ప్రకారం, ఇది ట్రైయంప్ ట్రైడెంట్ 660 ధర కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాము. ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 లాంచ్ అయినప్పుడు, దాని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 8.5 లక్షలు ఉంటుందని అంచనా.

Most Read Articles

English summary
India bound triumph tiger sport 660 adventure motorcycle unveiled details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X