భారతదేశంలో అత్యంత వేగవంతమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్‌ 650 నిర్మించిన మంత్ర రేసింగ్; పూర్తి వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఒక్క భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి. ఇటువంటి సమయంలో భారతదేశంలో వేగంగా వెళ్లే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మోటార్‌సైకిల్‌ను బెంగళూరుకు చెందిన మంత్ర రేసింగ్ అభివృద్ధి చేసింది.

ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మోటార్‌సైకిల్‌ను ప్రముఖ ఇండియన్ బైక్ రేసర్లయిన లెజండరీ డ్రాగ్ రేసర్ మరియు హిల్ క్లైమ్ ఛాంపియన్ 'బాబా సతగోపన్' మరియు నాలుగుసార్లు నేషనల్ డ్రాగ్ రేసింగ్ ఛాంపియన్ 'హేమంత్ ముద్దప్ప' టెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మోటార్‌సైకిల్‌ను టెస్ట్ చేసే సమయంలో మంత్ర రేసింగ్, దాని ప్రత్యేకమైన భాగాలు మరియు పరికరాలతో అభివృద్ధి చేయడం కూడా ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా అభివృద్ధి చేయబడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ 0 నుంచి100 కి.మీ / గం మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది.

వేగవంతమైన ఇంటర్‌సెప్టర్‌ 650 నిర్మించిన మంత్ర రేసింగ్

మంత్ర రేసింగ్ ప్రస్తుతం స్టేజ్ I స్ట్రీట్, స్టేజ్ I స్ట్రీట్ ప్లస్, స్టేజ్ II స్పోర్ట్, స్టేజ్ II స్పోర్ట్ ప్లస్ అనే నాలుగు ప్యాకేజీలను అందిస్తుంది. మంత్ర రేసింగ్ ట్యూన్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ఇప్పుడు 50.42 బిహెచ్‌పి మరియు 60.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.53 సెకన్లలో 0-100 కి.మీ / గం వేగవంతమవుతుంది. ఈ బైక్ గంటకు 174 కి.మీ వేగంతో ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 అదే పర్ఫామెన్స్ పార్ట్స్ తో బోల్ట్ చేయవచ్చు.

ఈ పర్ఫామెన్స్ ప్యాకేజీలను కొనాలనుకునే ఎవరైనా మంత్ర రేసింగ్‌ను ఇమెయిల్- contact@mantraracing.com మరియు Facebook మరియు Instagram ను సంప్రదించవచ్చు. అంతే కాకుండా మంత్ర రేసింగ్ యొక్క వీడియోలను YouTube ఛానల్ చూడవచ్చు. ఈ వీడియో కోవిడ్-19 లాక్‌డౌన్ ముందు చిత్రీకరించబడింది.

Most Read Articles

English summary
Fastest Royal Enfield Interceptor 650 In India Is Equipped With Mantra Racing’s Performance Parts. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X