కార్గిల్ విజయ్ దివాస్: అమరవీరుల జ్ఞాపకార్థం 75 జావా బైకులతో ర్యాలీ

కార్గిల్ యుద్ధం గురించి భారతీయ పౌరులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో ఎందరో భారత వీరులు వీర మరణం పొంది విజయం సాధించారు. ఈ కారణంగా వారి త్యాగానికి గుర్తుగా అమరవీరుల దినంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకునేందుకు భారత ఆర్మీ సిబ్బంది సోమవారం జావా బైక్‌లపై ర్యాలీ చేపట్టారు.

కార్గిల్ విజయ్ దివాస్: అమరవీరుల జ్ఞాపకార్థం 75 జావా బైకులతో ర్యాలీ

ఈ సందర్భంగా, భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా భారత సైన్యంలోని 75 మంది రైడర్లు ధ్రువ్ కార్గిల్ రైడ్‌లో పాల్గొన్నారు. ఇందులో జావా మోటార్‌సైకిల్ రైడర్లను నాలుగు గ్రూపులుగా విభజించి ర్యాలీ ప్రారంభించారు.

కార్గిల్ విజయ్ దివాస్: అమరవీరుల జ్ఞాపకార్థం 75 జావా బైకులతో ర్యాలీ

ప్రధాన రైడ్‌ను ధ్రువ వార్ మెమోరియల్ నుండి పివిసి సుధేదార్ సంజయ్ కుమార్, ఉధంపూర్‌లోని హెడ్ క్వార్టర్ నార్తర్న్ కమాండ్ ఆధ్వర్యంలో, లెఫ్టినెంట్ జనరల్ వైకె జోషి నేతృత్వంలోని జావా మోటార్‌సైకిళ్లలో 25 మంది రైడర్లతో డ్రస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌కు వెళ్ళింది.

కార్గిల్ విజయ్ దివాస్: అమరవీరుల జ్ఞాపకార్థం 75 జావా బైకులతో ర్యాలీ

భారతదేశం స్వాతంత్య్రం పొందిన 75 సంవత్సరాల గుర్తుగా 75 మోటారు సైకిళ్ల లెక్కింపును పూర్తి చేసి, నౌషెరా, శ్రీనగర్ మరియు కరాకోరం పాస్ నుండి ఇతర రైడింగ్స్ ఫ్లాగ్ చేయబడ్డాయి. భారత సైనికుల శౌర్యం మరియు ధైర్యాన్ని ప్రతిబింబిస్తూ, లెఫ్టినెంట్ జనరల్ జోషి, అమరవీరులు ఎల్లప్పుడూ దేశానికి మరియు దాని సాయుధ దళాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటారని హైలైట్ చేశారు.

కార్గిల్ విజయ్ దివాస్: అమరవీరుల జ్ఞాపకార్థం 75 జావా బైకులతో ర్యాలీ

ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ జోషి మాట్లాడుతూ, భారత సైన్యం యొక్క సైనికులు చేసిన త్యాగాలు జ్ఞాపకం చేసుకోవడమే కాక, ప్రస్తుత మరియు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేవిగా గుర్తించబడ్డాయి. అందువల్ల, మా ఈ ప్రయత్నం, ధ్రువ్ కార్గిల్ రైడ్ సమయంలో అమరవీరులు, ఆపరేషన్ విజయ్ ధైర్యవంతులను గుర్తుంచుకోవడానికి మరియు అదే సమయంలో యువతలో దేశభక్తి స్ఫూర్తిని పునరుద్ధరించడానికి చాలా వరకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

కార్గిల్ విజయ్ దివాస్: అమరవీరుల జ్ఞాపకార్థం 75 జావా బైకులతో ర్యాలీ

ఇటీవల జావా మోటార్ సైకిల్ కంపెనీ, 1971 యుద్ధ విజయానికి 50 వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త కలర్ జావా బైకులను విడుదల చేసింది. కొత్త జావా క్లాసిక్ మోటార్‌సైకిల్ ఇప్పుడు ఖాకీ మరియు మిడ్‌నైట్ గ్రే అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

కార్గిల్ విజయ్ దివాస్: అమరవీరుల జ్ఞాపకార్థం 75 జావా బైకులతో ర్యాలీ

క్లాసిక్ లెజెండ్స్ సిఇఒ ఆశిష్ సింగ్ జోషి మాట్లాడుతూ, మన భారత దేశ సైనికులు, మా నిజమైన హీరోలు. దేశ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తూ, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే వారి కోసం చేస్తున్న ర్యాలీలో కంపెనీ బైకులను ఉపయోగించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

కార్గిల్ విజయ్ దివాస్: అమరవీరుల జ్ఞాపకార్థం 75 జావా బైకులతో ర్యాలీ

కార్గిల్ యుద్ధంలో సైనికులు చేసిన త్యాగాలను జ్ఞాపకం చేసుకోవడానికి కార్గిల్ విజయ్ దివాస్ ప్రతి సంవత్సరం జూలై 26 న జరుపుకుంటారని విషయం అందరికి తెలిసిందే. 26 జూలై 1999 న, కార్గిల్-డ్రాస్ రంగంలో పాకిస్థాన్ చొరబాటుదారుల నుండి భారత భూభాగాలను తిరిగి తీసుకోవడానికి భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్' ను ప్రారంభించింది.

కార్గిల్ విజయ్ దివాస్: అమరవీరుల జ్ఞాపకార్థం 75 జావా బైకులతో ర్యాలీ

పాకిస్థాన్ సైన్యాన్ని వెనక్కి తరిమిగొట్టిన తరువాత భారత సైన్యం 'టైగర్ హిల్' పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. జావా కంపెనీ తన బైకులను భారతదేశంలో మూడు మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో జావా క్లాసిక్, జావా 42 మరియు జావా పెరాక్ ఉన్నాయి. జావా క్లాసిక్ 293 సిసి, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ 27.33 బిహెచ్‌పి పవర్ మరియు 27.02 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

Most Read Articles

English summary
Jawa Partners With Indian Army For Celebratory Rides. Read in Telugu.
Story first published: Tuesday, July 27, 2021, 16:27 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X