స్టార్‌లైట్ బ్లూ కలర్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న జావా 42 మోటార్‌సైకిల్!

భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఐకానిక్ క్లాసిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ జావా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తమ ఫోర్టీ టూ (42) మోడల్‌లో ఓ కొత్త 2021 వెర్షన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ సీరియస్ వైట్, ఆల్-స్టార్ బ్లాక్ మరియు ఓరియన్ రెడ్ అనే మూడు కొత్త రంగులో లభిస్తుంది.

స్టార్‌లైట్ బ్లూ కలర్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న జావా 42 మోటార్‌సైకిల్!

కస్టమర్లు ఈ కలర్ ఆప్షన్లలో ఒక ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అయితే, కొందరు కస్టమర్లు ఈ కలర్ ఆప్షన్లు కాకుండా, తమకు నచ్చిన విధంగా ఈ బైక్‌ను కస్టమ్ పెయింట్ చేయించుకునేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి కస్టమర్ల కోసం గుజరాత్‌కు చెందిన అగోజీ కస్టమ్, జావా 42 కోసం ప్రత్యేక పెయింట్ స్కీమ్స్‌ను అందిస్తోంది.

స్టార్‌లైట్ బ్లూ కలర్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న జావా 42 మోటార్‌సైకిల్!

తాజాగా ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇంటర్నెట్‌లో రిలీజ్ అయ్యాయి. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన అగోజీ కస్టమ్ ఓ కొత్త జావా 42 బైక్‌ను స్టార్‌లైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లో పెయింట్ చేసింది. ఇటీవల ఈ కస్టమ్ షాప్ ఓ డీలర్‌షిప్ కోసం జావా పెరాక్ మోటార్‌సైకిల్‌ను కూడా కస్టమైజ్ చేసింది.

స్టార్‌లైట్ బ్లూ కలర్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న జావా 42 మోటార్‌సైకిల్!

అగోజీ కస్టమ్ ఇప్పుడు తాజాగా సూరత్ కేంద్రంగా ఉన్న 'సీమా బైక్' అనే జావా డీలర్‌షిప్ కోసం జావా 42 బైక్‌ను మోడిఫై చేసింది. స్టాండర్డ్ జావా 42 మోటార్‌సైకిల్‌తో పోలిస్తే, స్టార్‌లైట్ బ్లూ కలర్‌లో పెయింట్ చేసిన ఈ జావా 42 బైక్‌లో పలు కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇది చూడటానికి ఇతర జావా 42 బైక్‌ల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది.

స్టార్‌లైట్ బ్లూ కలర్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న జావా 42 మోటార్‌సైకిల్!

ఈ మోటారుసైకిల్ ఫ్యూయెల్ ట్యాంక్‌కు ఇరు వైపులా బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్ ఉంటుంది. ఒరిజినల్ బైక్‌లో ఫ్యూయెల్ ట్యాంక్‌పై జావా బ్యాడ్జింగ్ చుట్టూ గ్రే కలర్‌లో కనిపించే చారను ఇందులో త్రివర్ణంలో ఫినిష్ చేశారు. ట్యాంక్ పైభాగంలో గ్రే మరియు గోల్డ్ కలర్ స్ట్రైప్స్, 42 క్లాసిక్ లెజెండ్స్ అనే బ్యాడ్జింగ్ కనిపిస్తుంది.

స్టార్‌లైట్ బ్లూ కలర్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న జావా 42 మోటార్‌సైకిల్!

బ్లాక్ అండ్ బ్లూ డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో ఈ కొత్త స్టార్‌లైట్ బ్లూ కలర్ జావా ఫోర్టీ టూ మోటార్‌సైకిల్ చాలా భిన్నంగా మరియు స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇందులో కేవలం పెయింట్‌లో మార్పులు మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇంజన్ పరంగా కూడా ఇందులో ఎలాంటి మార్పులు లేదు.

స్టార్‌లైట్ బ్లూ కలర్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న జావా 42 మోటార్‌సైకిల్!

జావా 42 మోడల్‌లో ఉపయోగించిన 293సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ గరిష్టంగా 27 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

స్టార్‌లైట్ బ్లూ కలర్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న జావా 42 మోటార్‌సైకిల్!

దేశీయ విపణిలో కొత్త 2021 జావా ఫోర్టీ టూ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.1.84 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ మోటారుసైకిల్‌లో బార్-ఎండ్ మిర్రర్స్, రైడర్ మరియు పిలియన్ రైడర్ కంఫర్ట్ కోసం విస్తృతమైన సీట్, రీడిజైన్ చేయబడిన సైడ్ స్టాండ్, ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

స్టార్‌లైట్ బ్లూ కలర్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న జావా 42 మోటార్‌సైకిల్!

జావా మోటార్‌సైకిల్స్ ఈ ఫోర్టీ టూ మోడల్ కోసం హెడ్‌ల్యాంప్ గ్రిల్ మరియు ఫ్లై-స్క్రీన్‌లను అదనపు యాక్ససరీలుగా అందిస్తోంది. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కోసం ఈ మోటార్‌సైకిల్ సస్పెన్షన్ సెటప్‌ను కంపెనీ స్వల్పంగా రీట్యూన్ చేసింది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ కొత్త మోడల్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా సపోర్ట్ చేస్తాయి.

Image Courtesy: agozee_customs

Most Read Articles

English summary
Jawa 42 Motorcycle Customized In Starlight Blue Color; Looks Like Classic Legend, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X