పెరిగిన జావా మోటార్‌సైకిళ్ల ధరలు; మోడల్ వారీగా కొత్త ధరలు

ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'జావా మోటార్‌సైకిల్స్' భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ మూడు మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో జావా మోటార్‌సైకిల్స్ విక్రయిస్తున్న క్లాసిక్, ఫోర్టీ-టూ, పెరాక్ మోడళ్ల ధరలను రూ.2,987 మేర పెంచింది.

పెరిగిన జావా మోటార్‌సైకిళ్ల ధరలు; మోడల్ వారీగా కొత్త ధరలు

జావా స్టాండర్డ్ మోడల్ మూడు కలర్ ఆప్షన్స్‌లో మరియు సింగిల్-ఛానల్ మరియు డబుల్-ఛానల్ ఏబిఎస్‌లలో లభిస్తుంది. ఇందులో జావా బ్లాక్ సింగిల్-ఛానెల్ ఏబిఎస్ ధర రూ.1,76,151 మరియు డ్యూయల్-ఛానెల్ ఏబిఎస్ ధర రూ.1,85,093 గా ఉన్నాయి.

పెరిగిన జావా మోటార్‌సైకిళ్ల ధరలు; మోడల్ వారీగా కొత్త ధరలు

అలాగే, ఇందులో గ్రే కలర్ ఆప్షన్ సింగిల్-ఛానెల్ ఏబిఎస్ ధర రూ.1,76,151 మరియు డ్యూయల్ ఛానెల్ ఏబిఎస్ ధర రూ.1,85,093 ఉంది. ఇకపోతే, సింగిల్-ఛానెల్ ఏబిఎస్ ఆఫ్ మెరూన్ కలర్ ఆప్షన్ ధర రూ.1,77,215 మరియు డ్యూయల్-ఛానెల్ ఏబిఎస్ ధర రూ.1,86,157 గా ఉంది.

MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

పెరిగిన జావా మోటార్‌సైకిళ్ల ధరలు; మోడల్ వారీగా కొత్త ధరలు

జావా ఫోర్టీ టూ మోడల్ విషయానికి వస్తే, కంపెనీ ఇదివరకు ఈ మోడల్‌ను రూ.1,60,300 నుండి రూ.1,69,242 మధ్య విక్రయిస్తుండగా, ఇప్పుడు ఈ బైక్ ధర రూ.1,63,287 నుండి రూ.1,72,229కి పెరిగింది. ఇది ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. జావా అందిస్తున్న బాబర్ స్టైల్ బైక్, జావా పెరాక్ ధర రూ.2,987 మేర పెరిగి రూ.1,97,487 గా ఉంది. (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

పెరిగిన జావా మోటార్‌సైకిళ్ల ధరలు; మోడల్ వారీగా కొత్త ధరలు

జావా క్లాసిక్ మరియు జావా 42 (ఫోర్టీ-టూ) మోడళ్లు రెండూ ఒకేరకమైన ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తాయి. వీటిలో 298సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 26 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

పెరిగిన జావా మోటార్‌సైకిళ్ల ధరలు; మోడల్ వారీగా కొత్త ధరలు

జావా పెరాక్ మోటారుసైకిల్ విషయానికి వస్తే, ఇది బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్. రెట్రో రూపంతో బాబర్ స్టైల్ డిజైన్‌ను కలిగి ఉండే ఈ మోటార్‌సైకిల్‌లో 334సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ డిహెచ్‌సి ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 30 బిహెచ్‌పి శక్తిని మరియు 32 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తోనే జతచేయబడి ఉంటుంది.

పెరిగిన జావా మోటార్‌సైకిళ్ల ధరలు; మోడల్ వారీగా కొత్త ధరలు

జావా పెరాక్ మోటార్‌సైకిల్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, ఇందులో పొడగించిన స్వింగ్ఆర్మ్, రైడర్ కోసం ఒకే సీటు, టియర్‌డ్రాప్ ఆకారంలో ఉండే 14 లీటర్ల ఇంధన ట్యాంక్, డ్యూయెల్ ఎగ్జాస్ట్, టర్న్ ఇండికేటర్లతో కూడిన లో సెట్ టెయిల్ ల్యాంప్స్, గుండ్రటి ఆకారంలో హెడ్‌ల్యాంప్, బార్-ఎండ్ మిర్రర్స్, సింగిల్-పాడ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.

Jawa
Old Price Single-channel ABS New Price Single-channel ABS Differece Old Price Dual-channel ABS New Price Dual-channel ABS Difference
Black ₹1,73,164 ₹1,76,151 ₹2,987 ₹1,82,106 ₹1,85,093 ₹2,987
Grey ₹1,73,164 ₹1,76,151 ₹2,987 ₹1,82,106 ₹1,85,093 ₹2,987
Maroon ₹1,74,228 ₹1,77,215 ₹2,987 ₹1,83,170 ₹1,86,157 ₹2,987
Forty Two
Haley's Teal ₹1,60,300 ₹1,63,287 ₹2,987 ₹1,69,242 ₹1,72,229 ₹2,987
Comet Red ₹1,65,228 ₹1,68,215 ₹2,987 ₹1,74,170 ₹1,77,157 ₹2,987
Galactic Green ₹1,65,228 ₹1,68,215 ₹2,987 ₹1,74,170 ₹1,77,157 ₹2,987
Nebula Blue ₹1,65,228 ₹1,68,215 ₹2,987 ₹1,74,170 ₹1,77,157 ₹2,987
Lumos Lime ₹1,64,164 ₹1,67,151 ₹2,987 ₹1,73,106 ₹1,76,093 ₹2,987
Starlight Blue ₹1,60,300 ₹1,63,287 ₹2,987 ₹1,69,242 ₹1,72,229 ₹2,987
Perak
Old Price New Price Difference
Black, Dual-channel ABS ₹1,94,500 ₹1,97,487 ₹2,987

MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

పెరిగిన జావా మోటార్‌సైకిళ్ల ధరలు; మోడల్ వారీగా కొత్త ధరలు

దేశంలోని ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే, జావా మోటార్‌సైకిల్స్ కూడా గడచిన సంవత్సరంలో ఎదుర్కున్న సవాళ్లు, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు మరియు ఉత్పాదక వ్యయాల కారణంగానే కంపెనీ ధరల పెంపుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పెరిగిన జావా మోటార్‌సైకిళ్ల ధరలు; మోడల్ వారీగా కొత్త ధరలు

ఇదిలా ఉంటే, జావా తమ ఫోర్టీ టూ మోడల్‌లో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది కొద్దిపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా సరికొత్త అల్లాయ్ వీల్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

Most Read Articles

English summary
Jawa Motorcycles Increases Its Entire Model Lineup Prices, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X