జావా బైక్ లవర్స్‌కి షాక్.. రూ.8,700 మేర పెరిగిన ధరలు!

రెట్రో-మోడ్రన్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ జావా మోటార్‌సైకిల్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఈ జావా బైక్‌ల ధరలు రూ.8,700 వరకూ పెరిగాయి.

జావా బైక్ లవర్స్‌కి షాక్.. రూ.8,700 మేర పెరిగిన ధరలు!

దేశీయ విపణిలో ఇప్పటికే ధరలను పెంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్, హీరో మోటోకార్ప్, సుజుకి మోటార్‌సైకిల్స్ మరియు కెటిఎమ్ సంస్థల మాదిరిగానే జావా మోటార్‌సైకిల్స్ కూడా ఈ జులై నెలలో తమ వాహనాల ధరలను పెంచింది.

జావా బైక్ లవర్స్‌కి షాక్.. రూ.8,700 మేర పెరిగిన ధరలు!

జావా మోటార్‌సైకిళ్ల పోర్ట్‌ఫోలియోలో అత్యంత ఖరీదైన బైక్ జావా పెరాక్. కంపెనీ ఈ బైక్ ధరను సుమారు రూ.8,700 మేర పెంచింది. తాజా ధరల పెరుగుదల అనంతరం, మార్కెట్లో జావా పెరాక్ మోటార్‌సైకిల్ ధర ఇప్పుడు రూ.1.97 లక్షల నుండి 2.06 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగింది.

జావా బైక్ లవర్స్‌కి షాక్.. రూ.8,700 మేర పెరిగిన ధరలు!

జావా 42 బైక్ ధర కూడా భారీగానే పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలోనే జావా మోటార్‌సైకిల్స్ ఈ మోడల్‌లో అల్లాయ్ వీల్స్‌తో కూడిన వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు ఈ జావా 42 యొక్క అల్లాయ్ వీల్ వేరియంట్‌లో ధర రూ.7,000 మేర పెరిగింది.

జావా బైక్ లవర్స్‌కి షాక్.. రూ.8,700 మేర పెరిగిన ధరలు!

తాజా ధరల పెరుగుదల తరువాత, జావా 42 యొక్క డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్ ప్రస్తుత ధర రూ.1.91 లక్షలకు చేరుకుంది. గడచిన ఫిబ్రవరిలో కంపెనీ ఈ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పుడు దీని ధర రూ.1.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది.

జావా బైక్ లవర్స్‌కి షాక్.. రూ.8,700 మేర పెరిగిన ధరలు!

ఇవే కాకుండా, జావా 42 స్పోక్ వీల్, జావా స్టాండర్డ్ మోడల్స్ వంటి ఇతర జావా మోటార్‌సైకిళ్ల ధరలను కూడా రూ.1,000 వరకూ పెచింది. ఈ రెండు బైక్‌లు కూడా జావా 42 అల్లాయ్ వీల్స్ వేరియంట్ మాదిరిగానే అప్‌డేటెడ్ ఇంజన్‌ను కలిగి ఉంటాయని గమనించాలి.

జావా బైక్ లవర్స్‌కి షాక్.. రూ.8,700 మేర పెరిగిన ధరలు!

స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ బైక్స్ విడుదల

ఇదిలా ఉంటే, జావా మోటార్‌సైకిల్స్ ఇటీవలే తమ జావా స్టాండర్డ్ మోడల్ యొక్క స్పెషల్ ఎడిషన్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ జావా స్టాండర్డ్ బైక్ ఖాకీ మరియు మిడ్‌నైట్ గ్రే అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టబడింది.

జావా బైక్ లవర్స్‌కి షాక్.. రూ.8,700 మేర పెరిగిన ధరలు!

భారతదేశం యొక్క 1971 యుద్ధ విజయం 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కంపెనీ ఈ రెండు రంగులను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో బైకుల ధర రూ.1.93 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జావా అధీకృత డీలర్‌షిప్‌లలో ఇవి అందుబాటులో ఉంటాయి.

జావా బైక్ లవర్స్‌కి షాక్.. రూ.8,700 మేర పెరిగిన ధరలు!

ఈ స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ మోటార్‌సైకిళ్లలోని కొత్త కలర్ ఆఫ్షన్లు రెండూ కూడా మ్యాట్ ఫినిష్‌లో ఉంటాయి మరియు ఇవి ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంటాయి. వీటిలో బ్లాక్ అవుట్ స్పోక్ రిమ్స్ ఉపయోగించారు, ఇవి ఈ మోటార్‌సైకిళ్ల మొత్తం రూపాన్ని మరింత మెరుగ్గా చేస్తాయి. ఈ కొత్త కలర్ ఆప్షన్లు డ్యూయెల్-ఏబిఎస్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని గమనించాలి.

జావా బైక్ లవర్స్‌కి షాక్.. రూ.8,700 మేర పెరిగిన ధరలు!

జావా క్లాసిక్ స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లలో కొత్త ఖాకీ మరియు మిడ్‌నైట్ గ్రే కలర్ ఆప్షన్లతో పాటుగా, వీటిపై ఓ ప్రత్యేకమైన స్మారక చిహ్నం కూడా ఉంటుంది. ఇది ఆర్మీ చిహ్నాన్ని మరియు 1971 విజయానికి ప్రతీక అయిన 'లారెల్ దండ'ను కలిగి ఉంటుంది. ఈ చిహ్నం బైక్ యొక్క ఇంధన ట్యాంక్ మధ్యలో త్రివర్ణ చారల వృత్తంలో ఉంచబడింది, ఇది దేశ గర్వానికి చిహ్నంగా ఉంటుంది.

జావా బైక్ లవర్స్‌కి షాక్.. రూ.8,700 మేర పెరిగిన ధరలు!

స్టాండర్డ్ మోడల్‌లోని ఇంజన్‌నే ఈ జావా క్లాసిక్ స్పెషల్ ఎడిషన్ మోడళ్లలోనూ ఉపయోగించారు. ఇందులోని 293సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 27.33 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27.02 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 15, 2021, 12:15 [IST]
English summary
Jawa Motorcycle Prices Increased Upto Rs 8700; New Price Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+