Yezdi బైకులు మళ్ళీ రానున్నాయా.. ఇదిగో టీజర్ వచ్చేసింది
ఒకప్పుడు భారతీయ మార్కెట్లో సంచలనం సృష్టించి అత్యంత ప్రజాదరణ పొందిన బైకులు కాలక్రమంలో కాల గర్భంలోనే కలిసిపోయాయి. అయితే వీటిని మనం అప్పుడప్పుడు అక్కడక్కడా రోడ్లపై చూస్తూనే ఉంటాము. అలాంటి బైకులలో యెజ్డీ (Yezdi) ఒకటి. ఇది ప్రారంభంలో విపరీతమైన ఆదరణ పొందగలిగింది, అయితే తరువాత దీని ఉత్పత్తి నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఈ Yezdi బైక్ మళ్ళీ భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు నివేదికల ద్వారా తెలిసింది.

భారతీయ మార్కెట్లో క్లాసిక్ బైకులకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణంగానే క్లాసిక్ బైక్ తయారీదారులు భారతీయ మార్కెట్లో తమ పట్టును నిరంతరం పటిష్టం చేసుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహీంద్రా-ఆధారిత మోటార్‌సైకిల్ తయారీదారు రాబోయే కాలంలో భారతీయ మార్కెట్లో తన కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

అయితే ప్రస్తుతం జావా మోటార్‌సైకిల్స్ బ్రాండ్‌లో జావా క్లాసిక్, పెరాక్ మరియు జావా 42 వంటి మూడు మోడళ్లను మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగానే జావా మోటార్‌సైకిల్స్‌తో పాటు, బైక్ తయారీదారు యెజ్డీ మరియు BSA వంటి ఇతర దిగ్గజ మోటార్‌సైకిల్ బ్రాండ్‌లను కూడా పునరుద్ధరించాలని యోచిస్తోంది.

క్లాసిక్ లెజెండ్స్ మరో దిగ్గజ మోటార్‌సైకిల్ బ్రాండ్‌ను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 2018 లో జావాను విజయవంతంగా పునరుద్ధరించిన తర్వాత, మహీంద్రా-ఆధారిత కంపెనీ ఇప్పుడు నవంబర్ 2022 లో కొత్త-జనరేషన్ యెజ్డీ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. అయితే కంపెనీ రాబోయే కొత్త మోడళ్ల వివరాలు ఇంకా అధికారికంగా అందుబాటులో లేదు.

అయితే త్వరలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టబోతున్న Yezdi మోటార్‌సైకిళ్లు పబ్లిక్ రోడ్‌లపై పరీక్షిస్తున్నట్లు గుర్తించబడ్డాయి. ఇప్పుడు జావా మోటార్‌సైకిల్స్ తన రాబోయే బ్రాండ్ యెజ్డీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌ను వెల్లడించింది. ఈ కొత్త యెజ్డీ యొక్క టీజర్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విడుదలయ్యాయి.

అయితే త్వరలో మార్కెట్లో రావడానికి సిద్ధంగా ఉన్న ఈ బైకుల యొక్క విడుదల తేదీపైన కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ నివేదికల ప్రకారం ఈ నెలలోనే ఈ బైకులు వెల్లడయ్యే అవకాశం ఉంది. భారతీయ మార్కెట్ కోసం కంపెనీ ఇప్పటికే Yezdi Roadking పేరును నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Yezdi నుండి మొదటి రెండు మోటార్‌సైకిళ్లలో ఒకటి రోడ్‌కింగ్ స్క్రాంబ్లర్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. అయితే రెండవ మోడల్ అడ్వెంచర్ బైక్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఇప్పటికే టెస్టింగ్ సమయంలో గుర్తించబడినట్లు తెలుస్తోంది.

Yezdi Roadking Adventure ఇటీవల టెస్టింగ్ సమయంలో గుర్తించబడింది. క్లాసిక్ లెజెండ్స్ 2018 చివరిలో భారతీయ మార్కెట్లోకి తిరిగి వస్తున్నట్లు ప్రకటించింది. కానీ కంపెనీ ప్రకటన నుండి క్లాసిక్ లెజెండ్స్ తీవ్రమైన సరఫరా సమస్యలను ఎదుర్కొంటోంది. కోవిడ్-19 మహమ్మారి ముప్పు గణనీయంగా తగ్గినందున, ఈ సమస్యలను పరిష్కరించామని మరియు ఇప్పుడు అమ్మకాలను విస్తరించడానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీ తెలిపింది.

ఇక దేశీయ మార్కెట్లో కొత్త బైకులు మళ్ళీ పునః ప్రవేశం చేయనున్నాయి కావున ఈ కొత్త బైకులు పూర్వ వైభవం పొందుతాయా.. లేదా అని విషయాలు త్వరలో తెలుస్తాయి. అంతే కాకుండా ఈ కొత్త బైకులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో ప్రస్తుత తరానికి అనుకూలమగా వుండే విధంగా ఉంటాయని ఆశిస్తున్నాము. భారతీయ మార్కెట్లో క్లాసిక్ బైకులకు అత్యంత ఆదరణ ఉండటం వల్ల రానున్న ఈ కొత్త బైకులు కూడా మంది స్థాయిలో ముందుకు సాగుతాయి.

ఈ బైకులు మార్కెట్లో విడుదలైన తరువాత ప్రత్యర్థులను గట్టి స్థాయిలో ఎదుర్కోవలసి వస్తుంది. ఇవన్నీ ఈ కొత్త బైకులు తట్టుకుని నిలబడగలవా, కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందగలవా అనే విషయాలు ముందుముందు తెలుస్తాయి. Yezdi బైకులు దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఎక్కువ మంది క్లాసిక్ వాహన ప్రియురాలను తప్పకుండా ఆకర్షించడంలో విజయం సాధిస్తుంది. కావున ఇప్పుడు మార్కెట్లో ఉన్న క్లాసిక్ బైకులకు సరైన ప్రత్యర్థిగా కూడా ఉండే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం క్లాసిక్ బైకులకున్న డిమాండ్ దృష్ట్యా Yezdi బైకులు కూడా మంచి స్థాయిలోనే అమ్మకాలను జరపనున్నట్లు ఆశిస్తున్నాము. ఈ బైక్ గురించి పూర్తి సమాచారం త్వరలో అందుబాటులోకి రానుంది. అప్పటివరకు మరిన్ని కొత్త బైకులు మరియు కార్లను గురించి మరింత సమాచారం కోసం మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








