వేలానికి జోనాథన్ రియా కవాసకి జెడ్ఎక్స్-10 ఆర్ఆర్ రేస్ బైక్

ఆరుసార్లు ప్రపంచ సూపర్‌బైక్ ఛాంపియన్‌గా గెలిచిన జోనాథన్ రియా యొక్క కవాసకి జెడ్ఎక్స్-10 ఆర్ఆర్ వాడిన రేస్ బైక్‌ను వేలానికి ఉంచారు. ప్రముఖ ఆన్‌లైన్ ఆక్షన్ సంస్థ ఈబేలో ఈ వేలం జరగుతోంది. వేలంలో ఈ బైక్‌ను సొంతం చేసుకున్న విజేతకు సూపర్‌బైక్‌తో పాటు, అనేక ఇతర గూడీస్ కూడా లభిస్తాయి.

వేలానికి జోనాథన్ రియా కవాసకి జెడ్ఎక్స్-10 ఆర్ఆర్ రేస్ బైక్

కవాసాకి జెడ్‌ఎక్స్-10 ఆర్‌ఆర్ ఒక పూర్తి రేస్-స్పెక్ సూపర్‌బైక్. ఈ బైక్‌ను డిఫెండింగ్ ప్రపంచ సూపర్‌బైక్ ఛాంపియన్ అయిన జోనాథన్ రియా అనేక పాపులర్ మోటార్‌స్పోర్ట్ రేస్‌లలో ఉపయోగించారు. వరల్డ్ సూపర్‌బైక్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుఎస్‌బికె) 1988లో ప్రారంభమైంది.

వేలానికి జోనాథన్ రియా కవాసకి జెడ్ఎక్స్-10 ఆర్ఆర్ రేస్ బైక్

ఈ సిరీస్ చరిత్రలోనే అత్యధిక సార్లు డబ్ల్యుఎస్‌బికె ఛాంపియన్‌షిప్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న ఒకే ఒక రైడర్ జోనాథన్ రియా. ఇతను 2015, 2016, 2017, 2018, 2019 మరియు 2020లో ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

MOST READ:విమానంలో ప్రయాణించేటప్పుడు మీ సెల్‌ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయమన్నారా? ఎందుకో తెలుసా?

వేలానికి జోనాథన్ రియా కవాసకి జెడ్ఎక్స్-10 ఆర్ఆర్ రేస్ బైక్

జోనాథన్ రియా పాల్గొన్న అన్ని డబ్ల్యుఎస్‌బికె రేస్‌లలోనూ కవాసాకి మోటార్‌సైకిళ్లనే నడిపాడు. అందుకే, ఈ కవాసకి జెడ్ఎక్స్-10ఆర్ఆర్ మరింత ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. బిడ్డింగ్‌లో ఈ మోటారుసైకిల్ సొంతం చేసుకున్న వారికి, బైక్‌తో పాటుగా పలు గుడీస్ కూడా లభిస్తాయి.

వేలానికి జోనాథన్ రియా కవాసకి జెడ్ఎక్స్-10 ఆర్ఆర్ రేస్ బైక్

అంతేకాదు, ఈ మోటారుసైకిల్ కొనుగోలుదారుడిని ఒక డబ్ల్యుఎస్‌కె రేస్‌కు విఐపి అతిథిగా కూడా ఆహ్వానించబడతారు. జోనాథన్ రియా మరియు కవాసకి రేసింగ్ టీమ్ సిబ్బందిని కలుసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ఇంకా, సదరు బైక్ కొనుగోలుదారుడు జోనాథన్ రియా నుండి సంతకం చేసిన వివిధ రకాల గూడీస్ కూడా పొందుతారు.

MOST READ:చంద్రుడిపైకి జనరల్ మోటార్స్ మూన్ రోవర్స్; పూర్తి వివరాలు

వేలానికి జోనాథన్ రియా కవాసకి జెడ్ఎక్స్-10 ఆర్ఆర్ రేస్ బైక్

డబ్ల్యుఎస్‌కె ఛాంపియన్ స్వయంగా ఈ బైక్‌లోని ఫీచర్లను మరియు వాటిని ఉపయోగించే విధానాన్ని కొనుగోలుదారుకు వివరిస్తాడు. ఈ ప్రత్యేకమైన కవాసాకి జెడ్‌ఎక్స్-10 ఆర్ఆర్ కెఆర్‌టి వింటర్ టెస్ట్ కలర్స్ మరియు ప్రత్యేకమైన స్టిక్కర్లను కలిగి ఉంటుంది.

వేలానికి జోనాథన్ రియా కవాసకి జెడ్ఎక్స్-10 ఆర్ఆర్ రేస్ బైక్

ఈబేలో పేర్కొన్న సమాచారం, ఈ బైక్‌లో పూర్తిగా కొత్త ఇంజన్‌ను అమర్చారని మరియు ఈ మోటార్‌సైకిల్ యూకేలో నమోదు చేయబడిందని పేర్కొన్నారు. కవాసాకి జెడ్‌ఎక్స్-10 ఆర్ఆర్ బైక్‌లో 998 సిసి, ఇన్‌లైన్-ఫోర్-సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

వేలానికి జోనాథన్ రియా కవాసకి జెడ్ఎక్స్-10 ఆర్ఆర్ రేస్ బైక్

సాధారణ డీలర్‌షిప్‌ల ద్వారా లభించే ఈ ఇంజన్ గరిష్టంగా 197 బిహెచ్‌పి శక్తిని మరియు 113.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇందులో కవాసాకి రేసింగ్ బృందం చేసిన మార్పుల నేపథ్యంలో, ఇది స్టాండర్డ్ వెర్షన్ కంటే ఎక్కువ శక్తిని మరియు టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.

వేలానికి జోనాథన్ రియా కవాసకి జెడ్ఎక్స్-10 ఆర్ఆర్ రేస్ బైక్

ఈబేలో ఈ బైక్ కోసం వేలాన్ని 25,000 డాలర్లు (సుమారు రూ. 18.14 లక్షల) వద్ద ప్రారంభించారు. కాగా, ఈ కథనం వ్రాసే సమయానికి ఈ మోటారుసైకిల్‌కు అత్యధికంగా 38,100 డాలర్ల (సుమారు రూ. 27.65 లక్షలు) బిడ్స్ వచ్చాయి. ఈ మోటారుసైకిల్ పూర్తిగా విక్రయించబడే నాటికి దీని ధర మరింత పెరగవచ్చని ఆశిస్తున్నారు.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

వేలానికి జోనాథన్ రియా కవాసకి జెడ్ఎక్స్-10 ఆర్ఆర్ రేస్ బైక్

జూన్ 4, 2021వ తేదీ ఈ బైక్ వేలం ముగుస్తుంది మరియు అప్పటికి ఈ ధర రెట్టింపు అవుతుందని అంచనా. జోనాథన్ రియా చేతిలో కవాసాకి జెడ్‌ఎక్స్-10 ఆర్ఆర్ అద్భుతమైన విజయాలను సాధించిపెట్టింది. ఈ మోటార్‌సైకిల్‌ను సొంతం చేసుకునే వారికి, బైక్‌తో పాటుగా మొత్తం కవాసాకి రేసింగ్ టీమ్ అనుభవాన్ని విక్రేత అందిస్తున్నాడు, అది చాలా విలువైనది.

Most Read Articles

English summary
Jonathan Rea’s Kawasaki ZX-10RR Is Up For Auction, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X