కవాసకి బైక్స్‌పై జూన్ ఆఫర్స్; రూ.50,000 వరకూ డిస్కౌంట్స్!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసాకి జూన్ 2021 ఆఫర్లలో భాగంగా, ఎంపిక చేసిన మోటార్‌సైకిళ్లపై డిస్కౌంట్లు మరియు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఈ నెలలో కవాసకి మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ.50,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

కవాసకి బైక్స్‌పై జూన్ ఆఫర్స్; రూ.50,000 వరకూ డిస్కౌంట్స్!

కవాసకి వెర్సిస్ 650, వల్కాన్ ఎస్, నింజా 1000 ఎస్ఎక్స్, డబ్ల్యూ 800, కెఎల్ఎక్స్ 110, కెఎల్ఎక్స్ 140 మరియు కెఎక్స్ 100 మోటార్‌సైకిళ్లపై కంపెనీ ఈ ఆఫర్లను అందిస్తోంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

కవాసకి బైక్స్‌పై జూన్ ఆఫర్స్; రూ.50,000 వరకూ డిస్కౌంట్స్!

ఆఫర్లు మరియు డిస్కౌంట్ వివరాలు

* రోడ్-లీగల్ మోటార్‌సైకిళ్లయిన వెర్సిస్ 650, వల్కాన్ ఎస్, నింజా 1000 ఎస్ఎక్స్, డబ్ల్యూ 800 మోడళ్ల కోసం కొత్త బిగినింగ్ వోచర్.

* స్ట్రీట్ లీగల్ కాని మోటార్‌సైకిళ్లయిన కెఎల్ఎక్స్ 110, కెఎల్ఎక్స్ 140 మరియు కెఎక్స్ 100 మోడళ్ల కోసం ఆఫ్-రోడ్ వోచర్.

* ఈ ఆఫర్లు జూన్ 1 నుండి జూన్ 30, 2021 వరకు చెల్లుబాటులో ఉంటాయి.

కవాసకి బైక్స్‌పై జూన్ ఆఫర్స్; రూ.50,000 వరకూ డిస్కౌంట్స్!

కవాసాకి ఈ నెలలో కొనుగోలు చేసే అన్ని అర్హత కలిగిన రోడ్-లీగల్ మోటార్‌సైకిళ్ల కోసం ‘న్యూ-బిగినింగ్ వోచర్' డిస్కౌంట్ కూపన్‌లను అందిస్తోంది. ఈ వోచర్ మొత్తాన్ని సదరు పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరను తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు.

కవాసకి బైక్స్‌పై జూన్ ఆఫర్స్; రూ.50,000 వరకూ డిస్కౌంట్స్!

ఈ డిస్కౌంట్ వోచర్ యొక్క మోటార్‌సైకిల్ యొక్క విలువపై ఆధారపడి ఉంటుంది. వల్కాన్ ఎస్ క్రూయిజర్‌పై రూ.20,000 వోచర్‌ను అందిస్తున్నారు. ఇది మోటార్‌సైకిల్ ధర ఎక్స్-షోరూమ్ ధర తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా, వెర్సిస్ 650, నింజా 1000 ఎస్ఎక్స్ మరియు డబ్ల్యూ 800 మోటార్ సైకిళ్లకు రూ.30,000 డిస్కౌంట్ వోచర్‌ను అందిస్తున్నారు.

కవాసకి బైక్స్‌పై జూన్ ఆఫర్స్; రూ.50,000 వరకూ డిస్కౌంట్స్!

కవాసాకి భారతదేశంలో విక్రయించే ఆఫ్-రోడ్ మోటార్‌సైకిళ్లపై ‘ఆఫ్-రోడ్ వోచర్' డిస్కౌంట్ కూపన్‌లను కూడా అందిస్తోంది. ఇవి కేవలం ట్రాక్ ఉపయోగం కోసం మాత్రమే అందుబాటులో ఉన్న నాన్-స్ట్రీట్-లీగల్ మోటార్‌సైకిళ్లు.

కవాసకి బైక్స్‌పై జూన్ ఆఫర్స్; రూ.50,000 వరకూ డిస్కౌంట్స్!

వీటిలో కవాసకి కెఎల్ఎక్స్110 మోడల్‌పా రూ.30,000 డిస్కౌంట్ కూపన్‌ను అందిస్తున్నారు. అలాగే, కవాసకి కెఎల్‌ఎక్స్ 140, మరియు కవాసకి కెఎక్స్ 100 మోడళ్లపై వరుసగా రూ.40,000 మరియు రూ.50,000 డిస్కౌంట్ కూపన్‌ను అందిస్తున్నారు.

కవాసకి బైక్స్‌పై జూన్ ఆఫర్స్; రూ.50,000 వరకూ డిస్కౌంట్స్!

కవాసకి భారతదేశంలో కె-కేర్ పేరుతో ఓ కొత్త మెయింటినెన్స్ ప్యాకేజీని కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీని ప్రస్తుతం 2021 మోడల్ ఇయర్ నింజా జెడ్ఎక్స్-10ఆర్ మోడల్‌పై మాత్రమే అందిస్తున్నారు. కే-కేర్ మెయింటినెన్స్ ప్యాకేజీలో విస్తరించిన వారంటీ (ఎక్స్‌టెండెడ్ వారంటీ) మరియు వార్షిక నిర్వహణ ఒప్పందం (యాన్యువల్ మెయింటినెన్స్ కాంట్రాక్ట్)లు ఉన్నాయి.

కవాసకి బైక్స్‌పై జూన్ ఆఫర్స్; రూ.50,000 వరకూ డిస్కౌంట్స్!

కె-కేర్ ప్యాకేజీతో, బైక్ యొక్క వారంటీ 4 సంవత్సరాలు / 50,000 కిలోమీటర్లకు విస్తరించబడుతుంది. మరోవైపు, ఏఎమ్‌సి సర్వీస్ వ్యయంపై పొదుపును నిర్ధారిస్తుంది. ఎవరైనా వినియోగదారులు తమ కవాసకి బైక్‌ను విక్రయించినట్లయితే, ఈ కె-కేర్ ప్యాకేజీని కూడా తదుపరి యజమానికి బదిలీ చేయవచ్చు.

కవాసకి బైక్స్‌పై జూన్ ఆఫర్స్; రూ.50,000 వరకూ డిస్కౌంట్స్!

కవాసాకి భారత మార్కెట్లో విక్రయించే కొన్ని ప్రసిద్ధ మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. డిస్కౌంట్ తరువాత, కవాసకి వెర్సిస్ 650 ధర రూ.6.78 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. పరిమిత స్టాక్‌లో లభించే నాన్-స్ట్రీట్-లీగల్ కెఎల్ఎక్స్ మరియు కెఎక్స్ మోటార్‌సైకిళ్లపై గరిష్టంగా రూ.50,000 వరకూ నగదు ప్రయోజనం లభిస్తుంది.

Most Read Articles

English summary
June 2021 Offers On Kawasaki Bikes: Up To Rs 50,000 Discounts And Benefits On Select Models. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X