కబీరా ఎలక్ట్రిక్ బైక్స్‌కు 5000 బుకింగ్స్; మొదటి బ్యాచ్ అమ్ముడైపోయింది!

గోవాకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ కబీరా మొబిలిటీ, ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కెఎమ్ 3000, కెఎమ్ 4000 మోటార్‌సైకిళ్ల కోసం 5000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయని, ఈ మోడళ్లకు సంబంధించిన మొదటి బ్యాచ్ అమ్మకాలు కూడా పూర్తయిపోయాయని కంపెనీ పేర్కొంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.1.26 లక్షలు, రూ.1.36 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

కబీరా ఎలక్ట్రిక్ బైక్స్‌కు 5000 బుకింగ్స్; మొదటి బ్యాచ్ అమ్ముడైపోయింది!

ఈ రెండు మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్‌లు ప్రారంభించిన మొదటి నాలుగు రోజుల్లోనే ఇవి పూర్తిగా అమ్ముడైపోయాయి. మరికొద్ది రోజుల్లోనే మొదటి బ్యాచ్ డెలివరీలను ప్రారంభిస్తామని, రెండవ బ్యాచ్‌కి సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తామని కంపెనీ ప్రకటించింది.

కబీరా ఎలక్ట్రిక్ బైక్స్‌కు 5000 బుకింగ్స్; మొదటి బ్యాచ్ అమ్ముడైపోయింది!

కబీరా మొబిలిటీ అందిస్తున్న కెఎమ్ 3000 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ రూపంలో ఉండగా, కెఎమ్ 4000 ఇ-స్ట్రీట్ బైక్‌గా ఉంటుంది. ఈ రెండు పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌లలో ఆఫర్ చేస్తున్న కాంబి బ్రేక్‌లు బెస్ట్ ఇన్ క్లాస్ పనితీరును కనబరుస్తాయని కంపెనీ పేర్కొంది.

MOST READ:ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

కబీరా ఎలక్ట్రిక్ బైక్స్‌కు 5000 బుకింగ్స్; మొదటి బ్యాచ్ అమ్ముడైపోయింది!

కెఎమ్ 3000 ఎలక్ట్రిక్ బైక్‌లో 6 కిలోవాట్ డెల్టివ్ బిఎల్‌డిసి మోటార్‌ను ఉపయోగించారు. ఈ మోటార్ 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది ఎకో మోడ్‌లో 120 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అలాగే, స్పోర్ట్ మోడ్‌లో గరిష్టంగా గంటకు 100 కి.మీ వేగంతో పరుగులు తీస్తూ, పూర్తి చార్జ్‌పై 60 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

కబీరా ఎలక్ట్రిక్ బైక్స్‌కు 5000 బుకింగ్స్; మొదటి బ్యాచ్ అమ్ముడైపోయింది!

కెఎమ్ 4000 ఎలక్ట్రిక్ బైక్‌లో 8 కిలోవాట్ డెల్టివ్ బిఎల్‌డిసి మోటార్‌ను ఉపయోగించారు. ఈ మోటార్ 4.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది ఎకో మోడ్‌లో 150 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. స్పోర్ట్ మోడ్‌లో గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో పరుగులు తీస్తూ, పూర్తి చార్జ్‌పై 90 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ వివరించింది.

MOST READ:ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరూ చూడండి

కబీరా ఎలక్ట్రిక్ బైక్స్‌కు 5000 బుకింగ్స్; మొదటి బ్యాచ్ అమ్ముడైపోయింది!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కెఎమ్ 3000 కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, కెఎమ్ 4000 కేవలం 3.1 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

కబీరా ఎలక్ట్రిక్ బైక్స్‌కు 5000 బుకింగ్స్; మొదటి బ్యాచ్ అమ్ముడైపోయింది!

కెఎమ్ 3000 మరియు కెఎమ్ 4000 బ్యాటరీ ప్యాక్‌లను పూర్తిగా చార్జ్ చేయటానికి ఎకో ఛార్జ్ ద్వారా 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. అయితే, కేవలం 2 గంటల 50 నిమిషాల్లోనే వీటిని సుమారు 80 శాతం చార్జ్ చేసుకోవచ్చుని కంపెనీ చెబుతోంది. ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. బూస్ట్ చార్జ్ ద్వారా అయితే కేవలం 50 నిమిషాల్లోనే వీటిని 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు.

MOST READ:విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

కబీరా ఎలక్ట్రిక్ బైక్స్‌కు 5000 బుకింగ్స్; మొదటి బ్యాచ్ అమ్ముడైపోయింది!

రెండు మోడళ్లలో సిబిఎస్ (కాంబి బ్రేకింగ్ సిస్టమ్)తో కూడిన సింగిల్ రియర్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కబీరా కెఎమ్ 3000 బైక్‌లో ముందు వైపు ఒకే ఒక డిస్క్ బ్రేక్ ఉంటుంది. అయితే, కబీరా కెఎమ్ 4000లో మాత్రం ముందు వైపు రెండు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. కెఎమ్ 3000 బైక్ 138 కిలోల బరువును మరియు కెఎమ్ 4000 బైక్ 147 కిలోల బరువును కలిగి ఉంటాయి.

కబీరా ఎలక్ట్రిక్ బైక్స్‌కు 5000 బుకింగ్స్; మొదటి బ్యాచ్ అమ్ముడైపోయింది!

కబీరా మొబిలిటీ విక్రయిస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం కంపెనీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ మోటార్‌సైకిళ్లలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్‌లు పూర్తిగా ఫైర్‌ప్రూఫ్‌ను కలిగి ఉంటాయని, ఇందులో పార్క్ అసిస్ట్‌తో పాటుగా ఇతర స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

MOST READ:మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

కబీరా ఎలక్ట్రిక్ బైక్స్‌కు 5000 బుకింగ్స్; మొదటి బ్యాచ్ అమ్ముడైపోయింది!

ఈ ఏడాదిలో అనేక కొత్త మోడళ్లను తమ వినియోగదారులకు పరిచయం చేయాలని కబీరా మొబిలిటీ ప్లాన్ చేస్తోంది. గడచిన 2018 నుండి కబీరా మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విక్రయిస్తోంది. భారత మార్కెట్లో తమ పరిధిని పెంచుకునేందుకు ఈ కంపెనీ వివిధ రకాల ఇ-కామర్స్ మరియు డీలర్షిప్ మోడళ్లపై ఆధారపడుతోంది.

Most Read Articles

English summary
Kabira Electric Motorcycles Received 5000 Units Booking; First Batch Sold Out, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X