ఈ బైక్స్‌కి భారీ డిమాండ్.. నాలుగు రోజుల్లోనే మొత్తం అమ్ముడైపోయాయ్..

గోవాకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ కబీరా మొబిలిటీ, గడచిన ఫిబ్రవరి 22వ తేదీన కెఎమ్ 3000 మరియు కెఎమ్ 4000 అనే రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్‌కు పరిచయం చేసిన సంగతి తెలిసినదే. మార్కెట్లో వీటి ప్రారంభ ధర రూ.1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్, గోవా)గా ఉన్నాయి.

ఈ బైక్స్‌కి భారీ డిమాండ్.. నాలుగు రోజుల్లోనే మొత్తం అమ్ముడైపోయాయ్..

కాగా, ఈ మోడళ్ల కోసం బుకింగ్స్ ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే ఇవి పూర్తిగా అమ్ముడైపోయాయని కంపెనీ తెలిపింది. మొదటి బ్యాచ్‌లో భాగంగా 5000 యూనిట్లను ముందుగా డెలివరీ చేయనున్నామని, వీటికి సంబంధించిన బుకింగ్స్ కూడా పూర్తయ్యాయని కంపెనీ పేర్కొంది.

ఈ బైక్స్‌కి భారీ డిమాండ్.. నాలుగు రోజుల్లోనే మొత్తం అమ్ముడైపోయాయ్..

కబీరా మొబిలిటీ కెఎమ్ 3000 మరియు కెఎమ్ 4000 మోటార్‌సైకిళ్లను తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. గత నెలల మార్కెట్లోకి విడుదలైన ఈ మోటార్‌సైకిళ్ల డెలివరీలు మే 2021లో ప్రారంభం కానున్నాయి. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.1.27 లక్షలు, రూ.1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్, గోవా)గా ఉన్నాయి.

ఈ బైక్స్‌కి భారీ డిమాండ్.. నాలుగు రోజుల్లోనే మొత్తం అమ్ముడైపోయాయ్..

కెఎమ్ 3000 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ను కవాసకి నింజా 300 మోడల్ నుండి స్పూర్తి పొంది డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది, ఇదొక ఫుల్ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్. కెఎమ్ 4000 నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైక్‌గా ఉంటుంది. దీనిని కవాసకి జెడ్1000 మోడల్ నుండి స్పూర్తి పొంది తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. అయితే, దీని ఫ్రంట్ హెడ్‌ల్యాంప్ మాత్రం యమహా ఎఫ్‌జెడ్-ఎస్ మోడల్ మాదిరిగా ఉంటుంది.

ఈ బైక్స్‌కి భారీ డిమాండ్.. నాలుగు రోజుల్లోనే మొత్తం అమ్ముడైపోయాయ్..

కబీరా కెఎమ్ 3000 ఫుల్ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ అయినప్పటికీ ఇది 138 కిలోల బరువును కలిగి ఉంటుంది. అయితే, ఇది దాని నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ కెఎమ్ 4000 మోడల్‌తో పోలిస్తే 9 కిలోలు తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్ళు వేర్వేరు సస్పెన్షన్ సెటప్‌లను కలిగి ఉంటాయి.

ఈ బైక్స్‌కి భారీ డిమాండ్.. నాలుగు రోజుల్లోనే మొత్తం అమ్ముడైపోయాయ్..

కెఎమ్ 3000 మోడల్ స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్కులను కలిగి ఉంటుంది. టాప్-రేంజ్ వేరియంట్ అయిన కెఎమ్4000 యూఎస్‌డి (అప్ సైడ్ డౌన్) ఫ్రంట్ ఫోర్కులను కలిగి ఉంటుంది. అయితే, బ్రేకింగ్ ఫీచర్ మాత్రం రెండు మోడళ్లలో ఒకేలా ఉంటుంది. ఈ రెండు వేరియంట్లలో ముందు వైపు మరియు వెనుక వైపు స్టాండర్డ్ సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి కాంబీ బ్రేక్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తాయి.

ఈ బైక్స్‌కి భారీ డిమాండ్.. నాలుగు రోజుల్లోనే మొత్తం అమ్ముడైపోయాయ్..

కెఎమ్ 3000 ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, బైక్‌లో 6 కిలోవాట్ డెల్టివ్ బిఎల్‌డిసి మోటార్‌ను ఉపయోగించారు. ఈ మోటార్ 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది సింగిల్ చార్జ్‌పై 120 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 100 కి.మీ మరియు ఇది కేవలం 3.1 సెకన్లలోనే గంటకు 0-40కి.మీ వేగాన్ని చేరుకుంది.

ఈ బైక్స్‌కి భారీ డిమాండ్.. నాలుగు రోజుల్లోనే మొత్తం అమ్ముడైపోయాయ్..

కెఎమ్ 4000 ఎలక్ట్రిక్ బైక్‌లో 8 కిలోవాట్ డెల్టివ్ బిఎల్‌డిసి మోటార్‌ను ఉపయోగించారు. ఈ మోటార్ 4.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. దీని గరిష్ట రేంజ్ 150 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇది కేవలం 3.1 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

ఈ బైక్స్‌కి భారీ డిమాండ్.. నాలుగు రోజుల్లోనే మొత్తం అమ్ముడైపోయాయ్..

కెఎమ్ 3000 మరియు కెఎమ్ 4000 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు ఎకో మరియు బూస్ట్ అనే రెండు రకాల చార్జింగ్‌లను సపోర్ట్ చేస్తాయి.ఎకో ఛార్జ్ ద్వారా బ్యాటరీ ప్యాక్‌లను పూర్తిగా చార్జ్ చేయటానికి 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. బూస్ట్ చార్జ్ ద్వారా అయితే కేవలం రెండు గంటల్లోనే 0 నుండి 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ బైక్స్‌కి భారీ డిమాండ్.. నాలుగు రోజుల్లోనే మొత్తం అమ్ముడైపోయాయ్..

కబీరా మొబిలిటీ అందిస్తున్న కెఎమ్ 3000 బైక్ 138 కిలోల బరువును మరియు కెఎమ్ 4000 బైక్ 147 కిలోల బరువును కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం కంపెనీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా అందిస్తోంది. ఈ మోటార్‌సైకిళ్లలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్‌లు పూర్తిగా ఫైర్‌ప్రూఫ్‌ను కలిగి ఉంటాయని, ఇందులో పార్క్ అసిస్ట్‌తో పాటుగా ఇతర స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 9, 2021, 11:10 [IST]
English summary
Kabira Mobility KM3000 And KM4000 Electric Motorcycles Sold Out In Just 4 Days, Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+