భారత్‌లో కబీరా పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు రేంజ్

గోవాకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కబీరా మొబిలిటీ కెఎమ్ 3000, కెఎమ్ 4000 అనే రెండు సరికొత్త పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.1.26 లక్షలు, రూ.1.36 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

భారత్‌లో కబీరా పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు రేంజ్

ఈ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించామని, త్వరలోనే వీటి భారతదేశ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌లలో ఆఫర్ చేస్తున్న కాంబి బ్రేక్‌లు బెస్ట్ ఇన్ క్లాస్ పనితీరును కనబరుస్తాయని కంపెనీ తెలిపింది.

భారత్‌లో కబీరా పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు రేంజ్

కెఎమ్ 3000 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ కాగా, కెఎమ్ 4000 ఇ-స్ట్రీట్ బైక్‌గా ఉంటుంది. కెఎమ్ 3000 లో 6 కిలోవాట్ డెల్టివ్ బిఎల్‌డిసి మోటార్ ఉంటుంది మరియు ఇది 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది ఎకో మోడ్‌లో 120 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అలాగే, స్పోర్ట్ మోడ్‌లో గరిష్టంగా గంటకు 100 కి.మీ వేగంతో పరుగులు తీస్తూ, పూర్తి చార్జ్‌పై 60 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

MOST READ:ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..

భారత్‌లో కబీరా పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు రేంజ్

ఇకపోతే, కెఎమ్ 4000 లో 8 కిలోవాట్ డెల్టివ్ బిఎల్‌డిసి మోటార్ ఉంటుంది, ఇది 4.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది ఎకో మోడ్‌లో 150 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. స్పోర్ట్ మోడ్‌లో గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో పరుగులు తీస్తూ, పూర్తి చార్జ్‌పై 90 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ వివరించింది.

భారత్‌లో కబీరా పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు రేంజ్

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కెఎమ్ 3000 కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, కెఎమ్ 4000 కేవలం 3.1 సెకన్లలోనే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

MOST READ:విదేశీ మోడళ్లకు సవాల్ విసరనున్న మేడ్ ఇన్ ఇండియా 'ఈట్రస్ట్' ఎలక్ట్రిక్ బైక్

భారత్‌లో కబీరా పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు రేంజ్

కెఎమ్ 3000 మరియు కెఎమ్ 4000 బ్యాటరీ ప్యాక్‌లను ఎకో ఛార్జ్ ద్వారా 2 గంటల 50 నిమిషాల్లో 80 శాతం చార్జ్ చేసుకోవచ్చు. అదే బూస్ట్ చార్జ్ ద్వారా అయితే కేవలం 50 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. ఈ బ్యాటరీలను పూర్తిగా 100 శాతం చార్జ్ చేయటానికి ఎకో ఛార్జ్ ద్వారా 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.

భారత్‌లో కబీరా పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు రేంజ్

రెండు మోడళ్లలో సిబిఎస్ (కాంబి బ్రేకింగ్ సిస్టమ్)తో కూడిన సింగిల్ రియర్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కబీరా కెఎమ్ 3000 బైక్‌లో ముందు వైపు ఒకే ఒక డిస్క్ బ్రేక్ ఉంటుంది. అయితే, కబీరా కెఎమ్ 4000లో మాత్రం ముందు వైపు రెండు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.

MOST READ:ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండి

భారత్‌లో కబీరా పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు రేంజ్

కబీరా కెఎమ్ 3000 మొత్తం 2100 మిమీ పొడవును, 760 వెడల్పును మరియు 1200 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది మరియు దీని వీల్ బేస్ 1430 మిమీగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో 830 మి.మీ సీటు హైట్‌ను కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువు 138 కిలోలుగా ఉంటుంది.

భారత్‌లో కబీరా పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు రేంజ్

కబీరా కెఎమ్ 4000 మొత్తం 2050 మిమీ పొడవును, 740 వెడల్పును మరియు 1280 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది మరియు దీని వీల్ బేస్ 1280 మిమీగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 200 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో 800 మి.మీ సీటు హైట్‌ను కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువు 147 కిలోలుగా ఉంటుంది.

MOST READ:ప్రమాదానికి గురైన శిల్పా శెట్టి భర్త కార్, కానీ కార్‌లో ఉన్నది మాత్రం అతడు కాదు.. ఇంకెవరు

భారత్‌లో కబీరా పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు రేంజ్

కబీరా మొబిలిటీ 2018 నుండి ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేస్తోంది. ఈ బైక్‌ల కోసం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఫైర్‌ప్రూఫ్ బ్యాటరీ ప్యాక్‌లు, పార్క్ అసిస్ట్ మరియు ఇతర స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో కబీరా పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; ధర, ఫీచర్లు మరియు రేంజ్

ఈ ఏడాది అనేక కొత్త మోడళ్లను తమ వినియోగదారులకు పరిచయం చేయాలని కబీరా మొబిలిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో కబీరా మొబిలిటీ తమ పరిధిని పెంచుకునేందుకు ఇ-కామర్స్ మరియు డీలర్షిప్ మోడళ్లపై ఆధారపడుతుంది.

Most Read Articles

English summary
Kabira Performance Electric Bikes Launched In India; Price, Features, Range. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X