కవాసకి ప్రియులకు షాకింగ్ న్యూస్.. అమాంతం పెరిగిన కవాసకి బైక్ ధరలు, దేనిపై ఎంతో ఇక్కడ చూడండి

మార్కెట్లో ఇప్పటికే దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతూ అధికారికంగా ప్రకటనలు చేసాయి. అంతే కాకుండా ఈ ధరలు ప్రస్తుతం అమల్లోకి కూడా వచ్చేసాయి. అయితే ఇప్పుడు ప్రముఖ బైక్ తయారీదారు అయిన కవాసకి తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని వాహనాల ధరలను పెంచినట్లు తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కవాసకి ప్రియులకు షాకింగ్ న్యూస్.. అమాంతం పెరిగిన కవాసకి బైక్ ధరలు, దేనిపై ఎంతో ఇక్కడ చూడండి

కవాసకి ప్రకటించిన ఈ కొత్త ధరలు 2021 ఆగస్టు 1 నుండి అమలులోకి రానున్నాయి. కవాసకి యొక్క కొన్ని బైక్‌లు ఇకపై కూడా వాటి పాత ధరలకు విక్రయించబడతాయి. కానీ ఎక్కువ శాతం బైకుల ధరలను పెంచినట్లు కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా వెలువడింది.

కవాసకి ప్రియులకు షాకింగ్ న్యూస్.. అమాంతం పెరిగిన కవాసకి బైక్ ధరలు, దేనిపై ఎంతో ఇక్కడ చూడండి

కవాసకి ఇప్పుడు ఈ కొత్త ధరల జాబితాలో దాదాపు మొత్తం 9 బైక్‌లను చేర్చింది. ఈ ధరల పెరుగుదలలో అతి తక్కువ పెరుగుదల రూ. 6,000 కాగా, గరిష్ట పెరుగుదల 15,000 రూపాయల వరకు ఉంటుంది. కవాసకి జెడ్ 650 మరియు వల్కాన్ ఎస్ ధరలు 6,000 రూపాయలు పెరిగాయి.

కవాసకి ప్రియులకు షాకింగ్ న్యూస్.. అమాంతం పెరిగిన కవాసకి బైక్ ధరలు, దేనిపై ఎంతో ఇక్కడ చూడండి

కవాసకి యొక్క కొత్త ధరల జాబితాలో నింజా జెడ్‌ఎక్స్-10 ఆర్ ధర ఇప్పుడు ఏకంగా 15,000 రూపాయలు పెరిగింది. ధరల పెరుగుదలకు ముందు కవాసకి జెడ్ 650 ధర రూ. 6.18 లక్షలు కాగా, ఇప్పుడు దీని ధర 2021 ఆగస్టు 1 నుంచి రూ. 6.24 లక్షలు కానుంది, అంటే ఇది మార్కెట్లో రూ. 6.24 లక్షలకు విక్రయించబడుతుంది.

కవాసకి ప్రియులకు షాకింగ్ న్యూస్.. అమాంతం పెరిగిన కవాసకి బైక్ ధరలు, దేనిపై ఎంతో ఇక్కడ చూడండి

ఈ జాబితాలోని కవాసకి వల్కాన్ ఎస్ విషయానికి వస్తే, ఈ బైక్ ప్రస్తుతం రూ. 6.04 లక్షలకు విక్రయించబడుతోంది. దీని ధర ఇప్పుడు 6,000 రూపాయలు పెరగడం చేత దీని ధర ఇప్పుడు 2021 ఆగస్టు 1 నుంచి రూ. 6.10 లక్షలు అవుతుంది.

కవాసకి ప్రియులకు షాకింగ్ న్యూస్.. అమాంతం పెరిగిన కవాసకి బైక్ ధరలు, దేనిపై ఎంతో ఇక్కడ చూడండి
Kawasaki Current Price New Price Price Hike
Ninja 650 ₹6,54,000 ₹6,61,000 ₹7,000
Ninja 1000SX ₹11,29,000 ₹11,40,000 ₹11,000
Ninja ZX-10R ₹14,99,000 ₹15,14,000 ₹15,000
Z650 ₹6,18,000 ₹6,24,000 ₹6,000
Z900 ₹8,34,000 ₹8,42,000 ₹8,000
Versys 650 ₹7,08,000 ₹7,15,000 ₹7,000
Versys 1000 ₹11,44,000 ₹11,55,000 ₹11,000
Vulcan S ₹6,04,000 ₹6,10,000 ₹6,000
W800 ₹7,19,000 ₹7,26,000 ₹7,000
కవాసకి ప్రియులకు షాకింగ్ న్యూస్.. అమాంతం పెరిగిన కవాసకి బైక్ ధరలు, దేనిపై ఎంతో ఇక్కడ చూడండి

కవాసకి నింజా జెడ్‌ఎక్స్-10 ఆర్ యొక్క ప్రస్తుతం ధర రూ. 14.99 లక్షలు కాగా, 2021 ఆగస్టు 1 నుండి దీని ధర రూ. 15.14 లక్షలు కానుంది. అంటే దీని ధర 15,000 పెరిగింది. అదేవిధంగా కవాసకి యొక్క నింజా 650 బైక్ 2021 ఆగస్టు 1 నుంచి రూ. 6.61 లక్షలకు విక్రయించబడనుంది. దీని ధర 7,000 రూపాయలు పెరిగింది. ధరల పెరుగుదలకు ముందు ఈ బైక్ ధర రూ. 6.54 లక్షలు.

కవాసకి ప్రియులకు షాకింగ్ న్యూస్.. అమాంతం పెరిగిన కవాసకి బైక్ ధరలు, దేనిపై ఎంతో ఇక్కడ చూడండి

కంపెనీ కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్ ధరను కంపెనీ రూ. 11,000 పెంచింది. ఇప్పటి వరకు మార్కెట్లో ఈ బైక్‌ ధర రూ. 11.29 లక్షలు, ధరల పెరుగుదల తర్వాత అంటే 2021 ఆగస్టు 1 నుంచి దీని ధర రూ. 11.40 లక్షలు కానుంది. ఈ బైక్ ధర ఇప్పుడు 11,000 రూపాయలు పెరిగింది.

కవాసకి ప్రియులకు షాకింగ్ న్యూస్.. అమాంతం పెరిగిన కవాసకి బైక్ ధరలు, దేనిపై ఎంతో ఇక్కడ చూడండి

కవాసకి జెడ్ 900 బైక్ యొక్క ధర విషయానికి వస్తే, ఇప్పుడు ఈ బైక్ 8,000 రూపాయల వరకు పెరిగింది. కావున ఈ బైక్ ధర ఇప్పుడు మార్కెట్లో రూ. 8.42 లక్షలకు విక్రయించబడుతుంది. ఈ బైక్ యొక్క మునుపటి ధర రూ. 8.34 లక్షలు. కంపెనీ వెర్సిస్ 650 ధరను రూ. 7,000 పెంచగా, వెర్సిస్ 1000 ధరను రూ. 11,000 పెంచింది.

కవాసకి ప్రియులకు షాకింగ్ న్యూస్.. అమాంతం పెరిగిన కవాసకి బైక్ ధరలు, దేనిపై ఎంతో ఇక్కడ చూడండి

కవాసకి వెర్సిస్ 650 ధర ఇప్పుడు అంటే ధరల పెరుగుదల తర్వాత రూ. 7.15 లక్షలు, కవాసకి వెర్సిస్ 1000 ధర రూ. 15.55 లక్షలకు విక్రయించబడుతుంది. ఇక చివరగా కంపెనీ కవాసకి డబ్ల్యూ 800 ధరను రూ. 7,000 పెంచడం వల్ల, దీని ధర ఇప్పుడు రూ. 7.26 లక్షలకు చేరింది. ధరల పెరుగుదలకు ముందు ఈ బైక్ ధర రూ. 7.19 లక్షలు. ధరల పెరుగుదల తర్వాత అమ్మకాలపై ఎటువంటి ప్రభావం ఉంటుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Kawasaki Shares New Price List, Most Models to Get Costlier From 1 August. Read in Telugu.
Story first published: Saturday, July 24, 2021, 12:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X